అన్వేషించండి

PM Modi కాన్వాయ్‌లో 2 వాహనాలు Range Rover , Fortuner లలో సేఫ్టీ, మైలేజీలలో ఏది బెస్ట్ తెలుసా..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కాన్వాయ్‌లో కేవలం రెండు వాహనాలు మాత్రమే ఉపయోగిస్తున్నారు. అయితే రేంజ్ రోవర్, ఫార్చూనర్ కార్లలో భద్రత, మైలేజీ పరంగా వీటిలో ఏది బెస్ట్ ఇక్కడ తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇంధన వినియోగం తగ్గించేందుకు ప్రధాని మోదీ కాన్వాయ్ తగ్గింపు.
  • ప్రధాని మోదీ కేవలం రెండు కార్లు రేంజ్ రోవర్, ఫార్చ్యూనర్ వాడుతున్నారు.
  • రేంజ్ రోవర్ బుల్లెట్ ప్రూఫ్, లగ్జరీ సెక్యూరిటీ కారు.
  • ఫార్చ్యూనర్ స్ట్రాంగ్ బిల్డ్, మైలేజ్, పనితీరుతో ఆకట్టుకుంటుంది.

PM Modi Convoy Cars: న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రూ.3 కు పైగా పెరిగాయి. రెండున్నర నెలలుగా పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా ఆయిల్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. మరోవైపు ఇంధన వినియోగం తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఆయన సైతం తన కాన్వాయ్‌ల సంఖ్య భారీగా తగ్గించారు. కేవలం 2 కార్లలో వెళ్తూ ప్రజలతో పాటు నేతలకు ఆదర్శంగా నిలిచారు. అయితే ప్రధాని మోదీ సెక్యూరిటీ మూవ్‌మెంట్‌లో కేవలం 2 రకాల వాహనాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒకటి రేంజ్ రోవర్ కాగా, రెండోది ఫార్చ్యూనర్ కారు. 

దేశంలో కీలక నేత అయిన నరేంద్ర మోదీ కేవలం రెండు కార్లు రేంజ్ రోవర్, ఫార్చ్యూనర్ వాడుతున్నారు. కొందరు లగ్జరీ అని చెబుతంటే, మరికొందరు ప్రధానికి హై సెక్యూరిటీ ఇస్తాయా అని చర్చిస్తున్నారు. ఫార్చ్యూనర్ స్ట్రాంగ్ బాడీ, మంచి పనితీరుకు ఫేమస్. మైలేజ్, భద్రతలో వీటిలో ఏ కారు పవర్‌ఫుల్, వాటి వివరాలపై ఓ లుక్కేయండి. 

రేంజ్ రోవర్‌లో హై లెవల్ సెక్యూరిటీ
ప్రపంచంలోని అత్యంత ప్రీమియం, హై సెక్యూరిటీ ఎస్‌యూవీలలో (SUV) రేంజ్ రోవర్ ఒకటి. ప్రధాని మోదీ కాన్వాయ్‌లో ఉపయోగించే ప్రత్యేక రేంజ్ రోవర్‌ను బుల్లెట్ రెసిస్టెంట్ టెక్నాలజీ,  అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లతో కంపెనీ తయారుచేసింది. ఇందులో బలమైన బాడీ షెల్, బ్లాస్ట్ ప్రొటెక్షన్, హైటెక్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఫీచర్లు ఇచ్చారు. అందుకే ఎస్పీజీ (SPG) లాంటి పెద్ద సెక్యూరిటీ ఏజెన్సీలు ఈ వాహనాన్ని ఎక్కువగా వినియోగిస్తాయి. 

Also Read: Petrol Diesel Price Hike: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. భారత్‌లో చమురు సెగ మొదలైందా?

అయితే మైలేజ్ విషయానికి వస్తే, ఇంత భారీ, పవర్‌ఫుల్ ఎస్‌యూవీ ఎక్కువ ఇంధనం వినియోగిస్తుంది. సాధారణంగా దీని మైలేజీ లీటరుకు 6 నుండి 8 కిలోమీటర్ల వరకు ఇస్తుందని భావిస్తారు. కానీ ఇక్కడ మైలేజీపై కాకుండా భద్రత, పనితీరుతో నమ్మకమైన వాహనంగా మారింది. అద్భుతమైన రోడ్ ప్రెజెన్స్, లగ్జరీ ఇంటీరియర్ కారణంగా ఈ వాహనం విఐపి (VIP) మూవ్‌మెంట్‌కు  ప్రాధాన్యతగా నిలుస్తుంది.

అద్భుతమైన మైలేజీ ఇచ్చే ఫార్చునర్
టొయోటా ఫార్చూనర్ విషయానికి వస్తే, భారత్‌లోని నాయకులు, అధికారులు, భద్రతా ఏజెన్సీలకు ఫేవరెట్ అని చెప్పవచ్చు. స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ, నమ్మకమైన ఇంజన్ వల్ల కారుపై నమ్మకం ఎక్కువే. అధ్వాన్నమైన రోడ్ల నుండి హైవేల వరకు ఫార్చూనర్ ప్రతిచోటా అద్భుతమైన పనితీరుతో కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. అందుకే ప్రధాని మోదీ కాన్వాయ్‌లో కూడా ఈ వెహికిల్ కనిపిస్తుంది. మైలేజ్ పరంగా ఫార్చూనర్.. రేంజ్ రోవర్ కంటే చాలా ముందుందని చెబుతారు. దీని డీజిల్ వేరియంట్ లీటరుకు సుమారు 10 నుంచి 12 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

Also Read: Supreme Court: ప్రధానికి వ్యతిరేకంగా మంత్రి వెళ్లగలరా? ఎన్నికల సంఘం నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

భద్రత కోసం ఇందులో మల్టీ ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, బలమైన ఛాసిస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫార్చూనర్ ఈజీగా కనిపిస్తున్నప్పటికీ ప్రజలకు బాగా నచ్చుతుంది. అందుకే తక్కువ ఖర్చులో అధిక భద్రత, బెస్ట్ పనితీరు కోరుకునే వారికి ఈ SUV మంచి ఎంపికగా ఉంది.

Frequently Asked Questions

ప్రధాని మోదీ తన కాన్వాయ్‌లో ఏయే కార్లను ఉపయోగిస్తారు?

ప్రధాని మోదీ తన కాన్వాయ్‌లో ముఖ్యంగా రెండు రకాల కార్లను ఉపయోగిస్తారు. అవి రేంజ్ రోవర్ మరియు టొయోటా ఫార్చూనర్.

ప్రధాని మోదీ రేంజ్ రోవర్‌లో ఉన్న భద్రతా ఫీచర్లు ఏమిటి?

ప్రధాని మోదీ ఉపయోగించే రేంజ్ రోవర్ బుల్లెట్ ప్రూఫ్‌తో పాటు, బ్లాస్ట్ ప్రొటెక్షన్, హైటెక్ కమ్యూనికేషన్ సిస్టమ్‌ వంటి అత్యున్నత భద్రతా ఫీచర్లతో వస్తుంది.

టొయోటా ఫార్చూనర్‌లో ఉన్న భద్రతా ఫీచర్లు ఏమిటి?

ఫార్చూనర్‌లో మల్టీ ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, బలమైన ఛాసిస్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

రేంజ్ రోవర్ మరియు ఫార్చూనర్‌లలో ఏది ఎక్కువ మైలేజ్ ఇస్తుంది?

మైలేజ్ విషయానికి వస్తే, టొయోటా ఫార్చూనర్‌ రేంజ్ రోవర్‌ కంటే చాలా ముందుంది. ఫార్చూనర్ డీజిల్ వేరియంట్ సుమారు 10-12 కిలోమీటర్లు ఇస్తే, రేంజ్ రోవర్ 6-8 కిలోమీటర్లు ఇస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

హైడ్రోజన్ కారుతో JCB సంచలనం.. గంటకు 654 కి.మీ. వేగంతో ప్రపంచ రికార్డు!
ఈ కారు స్పీడ్‌ గంటకు 654km, బుల్లెట్‌ ట్రైన్‌ కూడా ఈ వేగం ముందు బలాదూర్‌!
పెరిగింది రూ.15 వేలే.. కానీ కొత్త Ducati Monsterలో వచ్చిన మార్పులు ఇవీ!
కొత్త ఇంజిన్‌తో Ducati Monster V2.. పాత మోడల్‌కు దీనికి ఇంత తేడానా?
సింగిల్‌ ఛార్జ్‌తో 145 కి.మీ. హ్యాపీగా తిరిగిరావచ్చు.. కొత్త BGauss OoWah MAX Plus‌లో స్పెషల్ ఫీచర్లు!
145km రేంజ్ ఇచ్చే కొత్త BGauss ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌.. ఛార్జర్‌ పూర్తిగా ఉచితం
E20 ఇంధనంతో వాహనాల ఇంజిన్లకు ముప్పే! కార్‌ కంపెనీల తనిఖీల్లో సంచలన విషయాలు
E20 పెట్రోల్‌ మీద మళ్లీ రచ్చ.. ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక తేమ, రాష్ట్రాలవారీ వివరాలు లీక్‌

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget