పెట్రోల్ లీటరుకు రూ.3.14, డీజిల్ లీటరుకు రూ.3.11 చొప్పున పెంచారు. ఈ కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి.
Petrol Diesel Price Hike: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. భారత్‌లో చమురు సెగ మొదలైందా?
Petrol Price Hike: భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరల్ని చమురు సంస్థలు పెంచేశాయి. రూ.3 చొప్పున ఇంధన ధరల్ని పెంచి సామాన్యుడి జేబుపై భారం పెంచాయి.

- పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.3.14, రూ.3.11 పెరిగాయి.
- పశ్చిమాసియా యుద్ధ వాతావరణం, రవాణా ఖర్చుల పెరుగుదల కారణాలు.
- 11 వారాల తర్వాత చమురు సంస్థలు ధరలను పెంచక తప్పలేదు.
- నిత్యావసరాలు, రవాణా, ఆన్‌లైన్ డెలివరీ ఖర్చులు పెరగనున్నాయి.
Fuel Price Increase | న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో వాహనదారులపై భారం పడింది. లీటరు పెట్రోల్‌పై రూ.3.14, డీజిల్‌పై రూ.3.11 చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు తీసుకున్న నిర్ణయం నేడు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హర్మూజ్ జలసంధిలో రాకపోకలకు అంతరాయం, ఖర్చులు పెరగడం ఈ పెంపునకు ప్రధాన కారణంగా మారింది.
తప్పక పెంచినా.. సామాన్యుడిపై తప్పని భారం..
అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు గత 11 వారాలుగా ఇంధన ధరలను పెంచకుండా స్థిరంగా కొనసాగించాయి. అయితే, పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోలేక చివరకు సామాన్యులపై ఈ భారాన్ని మోపక తప్పలేదని కంపెనీలు పేర్కొన్నాయి. గత కొంతకాలంగా ఏ పెరుగుదల గురించి అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారో అదే జరిగింది. వాస్తవానికి 2022 ఏప్రిల్ నుంచి ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు లేవు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మాత్రం లీటరుకు రూ.2 చొప్పున కేంద్రం తగ్గించింది.
ఇటీవల అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా దేశంలో పెట్రో ధరలు పెరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అప్పట్లో భరోసా ఇచ్చింది. ప్రభుత్వం ఆ ప్రకటనలు చేసిన కొద్ది రోజులకే ఇప్పుడు ధరలు పెరిగాయి. ఈ తాజా పెంపుతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం చూపి, పలు రంగాలపై ప్రభావం చూపుతుందని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
ఇంధన ధరలు పెరగడం వల్ల ప్రభావం కేవలం వాహనాలకే పరిమితం కాదు. రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయలు, పాలు, రేషన్, ఆన్‌లైన్ డెలివరీ, బస్సు, ఆటో ఛార్జీలు, రోజువారీ అవసరమైన అనేక వస్తువుల ధరలు పెరుగుతాయి. ఖర్చులు పెరగడంతో రాబోయే రోజుల్లో ఇంటి బడ్జెట్ మరింత పెరిగి సామాన్యుడు ఇబ్బంది పడతాడు. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలకు లిమిట్ విధించి విక్రయాలు జరుపుగుతున్నారు.
రోజువారీ వస్తువులపై ప్రభావం
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో మొదట రోజువారీ ఉపయోగించే వస్తువులపై ప్రభావం కనిపిస్తుంది. పండ్లు, కూరగాయలను పొలాల నుండి మార్కెట్లకు చేరవేయడానికి రవాణా ఖర్చు పెరుగుతుంది. దీనివల్ల వాటి ధరలు పెరుగుతాయి. పాలు, ఇతర డైరీ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్-డీజిల్ ధరలు వంటింటి బడ్జెట్‌ను తలకిందులు చేయవచ్చు.
పెరగనున్న ట్రావెల్ ఖర్చులు
ఇంధన ధరలు పెరగడం వల్ల ట్రావెలింగ్ ఖర్చులు పెరుగుతాయి. ఆటోలు, ప్రైవేట్ వాహనాలతో పాటు సరుకు రవాణా ఖర్చులు పెరుగుతాయి. దాంతో అది పలు రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు కంపెనీలు ఛార్జీలను పెంచుతాయి. దీంతో పాటు స్కూల్ బస్సు, ఆటోలు సైతం రేట్లు పెంచుతాయి. పిల్లల ట్రాన్స్‌పోర్ట్ ఫీజులు తల్లిదండ్రులకు మరింత బారం కానున్నాయి. తాజా నిర్ణయం కారణంగా ఉబర్, ఓలా, ర్యాపిడో బుకింగ్ ధరలు అమాంతం పెంచే అవకాశం ఉంది.
పెరగనున్న ఆన్‌లైన్ డెలివరీ ఖర్చులు
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల ఆన్‌లైన్ సేవలపై కూడా పడవచ్చు. అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్, జొమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) వంటి కంపెనీలు డెలివరీ ఛార్జీలను పెంచుతాయి. లగేజీ, పార్సిల్స్ పంపే కొరియర్ సేవల ధరలు పెరిగే అవకాశం ఉంది.
Before You Go
Budget 2026 - 2027 Top 10 Points | కేంద్ర బడ్జెట్ లో పది ముఖ్యమైన అంశాలు
Frequently Asked Questions
పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరిగాయి?
పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరిగాయి?
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగడమే ప్రధాన కారణం. హర్మూజ్ జలసంధిలో అంతరాయాలు, ఖర్చులు పెరగడం కూడా దీనికి తోడ్పడింది.
ఇంధన ధరల పెరుగుదల వల్ల వేటిపై ప్రభావం ఉంటుంది?
రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయలు, పాలు, రేషన్, ఆన్‌లైన్ డెలివరీ, బస్సు, ఆటో ఛార్జీలు, పాఠశాల బస్సు ఫీజులు వంటి రోజువారీ వస్తువుల ధరలు పెరుగుతాయి.
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఎందుకు ధరలు పెంచాల్సి వచ్చింది?
గత 11 వారాలుగా ధరలను స్థిరంగా కొనసాగించినప్పటికీ, పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోలేక ధరలు పెంచక తప్పలేదని కంపెనీలు పేర్కొన్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























