అన్వేషించండి

Toyota Starlet Safety Test: క్రాష్ టెస్టులో అట్ట‌ర్ ప్లాఫ్ అయిన‌ టయోటా స్టార్లెట్:  రేటింగ్ తెలిస్తే షాకే..!

Toyota Starlet Safety Test: మారుతి సుజుకి బాలెనో ఆధారంగా తయారైన టయోటా స్టార్లెట్ కారు గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో అడల్ట్ సేఫ్టీ పరంగా సున్నా రేటింగ్‌ను పొంది షాక్ ఇచ్చింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టయోటా స్టార్లెట్ కార్ అడల్ట్ ఆక్యుపెంట్ విభాగంలో జీరో స్టార్ రేటింగ్ పొందింది.
  • ఫ్రంటల్, సైడ్ ఇంపాక్ట్ పరీక్షల్లో డ్రైవర్ ఛాతీ రక్షణ చాలా తక్కువగా ఉంది.
  • పిల్లల భద్రత విభాగంలో మూడు స్టార్లను సాధించింది, అయితే పెద్దల భద్రత లోపించింది.
  • కొత్త మోడల్ లో సైడ్ ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ గా అందిస్తున్నారు.

Toyota Starlet Scores Zero Stars in Global NCAP Safety Test: ఇండియాలో ఎంతో పాపులర్ అయిన మారుతి సుజుకి బాలెనో అలాగే టయోటా గ్లాంజా మోడళ్లకు రీబ్యాడ్జ్ వెర్షన్‌గా వస్తున్న టయోటా స్టార్లెట్ కారు భద్రత విషయంలో దారుణంగా విఫలమైంది. గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP) నిర్వహించిన 'సేఫర్ కార్స్ ఫర్ ఆఫ్రికా' ప్రోగ్రామ్‌లో ఈ కారుకు అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో జీరో స్టార్ రేటింగ్ వచ్చింది. చైల్డ్ సేఫ్టీలో మాత్రం మూడు స్టార్లను సాధించినప్పటికీ, ఓవరాల్‌గా ప్రాథమిక క్రాష్ ప్రొటెక్షన్ లో ఉన్న లోపాలను ఈ ఫలితాలు ఎత్తిచూపుతున్నాయి. ఆఫ్రికా లాంటి ఎగుమతి మార్కెట్ల కోసం తయారు చేసిన ఈ కారు భద్రతపై ఇప్పుడు ఆందోళన మొదలైంది.

అడల్ట్ సేఫ్టీలో భారీ లోపాలు..

గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన ఫ్రంటల్ ఇంకా సైడ్ ఇంపాక్ట్ టెస్టులలో టయోటా స్టార్లెట్ అడల్ట్ సేఫ్టీ పరంగా 34 పాయింట్లకు గానూ సున్నా పాయింట్లు మాత్రమే సాధించింది. ముందు వైపు నుండి జరిగిన క్రాష్ టెస్టులో డ్రైవర్ ఛాతీ భాగంలో రక్షణ చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. అలాగే ప్యాసింజర్ తలకు అందాల్సిన సేఫ్టీ కూడా ఆశించిన స్థాయిలో లేదు. ముఖ్యంగా కారు లోపల కాలు ఉంచే భాగం (Footwell area) తీవ్రంగా దెబ్బతింది. ఇక సైడ్ బారియర్ టెస్టులో కూడా తల ఇంకా ఛాతీ భాగాలకు రక్షణ కరువైంది. దీనివల్లే ఈ కారుకు జీరో స్టార్ రేటింగ్ కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.

Also Read: సరికొత్త టాటా పంచ్‌ కారును అనంతపురంలో కొనాలంటే ఎంత ఈఎంఐ చెల్లించాలి?

పిల్లల రక్షణలో మెరుగైన ప్రదర్శన..

పిల్లల భద్రత (Child Safety) విషయానికి వస్తే, స్టార్లెట్ 49 పాయింట్లకు గానూ 29.33 పాయింట్లు సాధించి మూడు స్టార్లను దక్కించుకుంది. 18 నెలల చిన్నారి డమ్మీకి మంచి రక్షణ లభించినట్లు నివేదిక పేర్కొంది. అయితే మూడేళ్ల చిన్నారి డమ్మీ తల భాగం సైడ్ టెస్టులో లోపలి భాగాలకు తగలడం వల్ల కొన్ని పాయింట్లు కోల్పోయింది. ఈ రెండు పరీక్షల్లో కూడా వెనుక వైపు ముఖం ఉండే చైల్డ్ సీట్లను సీట్‌బెల్ట్ సాయంతో బిగించి టెస్ట్ చేశారు. ఈ విభాగంలో మెరుగ్గా ఉన్నా, పెద్దవారి భద్రతలో ఉన్న వైఫల్యం కారు ఓవరాల్ ఇమేజ్ మీద దెబ్బకొట్టింది.

Also Read: 120 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ కలిగిన టూవీలర్ ఈవీల జాబితా ఇదే! ధరలు, ఫీచర్స్ తెలుసుకోండి!

తయారీ ,తాజా అప్‌డేట్స్..

ఈ టయోటా స్టార్లెట్ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి స్టాండర్డ్‌గా వస్తాయి. కానీ సైడ్ లేదా కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు లేకపోవడం పెద్ద లోపంగా మారింది. మారుతి సుజుకి ప్లాట్‌ఫామ్‌పై గుజరాత్ ప్లాంట్‌లో తయారైన ఈ కారు, మన దేశంలోని బాలెనో అండర్‌పిన్నింగ్స్‌నే పంచుకుంటుంది. అయితే క్రాష్ టెస్ట్ ఫలితాల తర్వాత టయోటా ఒక కీలక ప్రకటన చేసింది. సౌత్ ఆఫ్రికా మార్కెట్లోకి వచ్చే కొత్త స్టార్లెట్ వేరియంట్లలో సైడ్ హెడ్ ఇంకా థొరాక్స్ ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫీచర్లుగా ఇస్తున్నట్లు తెలిపింది. ఈ అప్‌డేటెడ్ మోడల్‌ను కూడా మరోసారి పరీక్షించి పాత దానికి దీనికి ఉన్న తేడాలను గ్లోబల్ ఎన్‌క్యాప్ త్వరలోనే వెల్లడించనుంది.

Frequently Asked Questions

టయోటా స్టార్లెట్ గ్లోబల్ NCAP భద్రతా పరీక్షలో ఎన్ని స్టార్లను సాధించింది?

టయోటా స్టార్లెట్ గ్లోబల్ NCAP 'సేఫర్ కార్స్ ఫర్ ఆఫ్రికా' ప్రోగ్రామ్‌లో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో జీరో స్టార్ రేటింగ్ సాధించింది.

పిల్లల భద్రత విషయంలో టయోటా స్టార్లెట్ ఎలా పనిచేసింది?

పిల్లల భద్రత (Child Safety) విషయానికి వస్తే, టయోటా స్టార్లెట్ మూడు స్టార్లను సాధించింది. 18 నెలల చిన్నారి డమ్మీకి మంచి రక్షణ లభించినప్పటికీ, మూడేళ్ల చిన్నారి డమ్మీ కొన్ని పాయింట్లు కోల్పోయింది.

టయోటా స్టార్లెట్ అడల్ట్ సేఫ్టీలో ఎందుకు విఫలమైంది?

ఫ్రంటల్ ఇంకా సైడ్ ఇంపాక్ట్ టెస్టులలో డ్రైవర్ ఛాతీ, ప్యాసింజర్ తల భాగాలకు రక్షణ తక్కువగా ఉండటంతో పాటు, ఫుట్‌వెల్‌ ఏరియా తీవ్రంగా దెబ్బతినడం వల్ల అడల్ట్ సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ వచ్చింది.

టయోటా స్టార్లెట్‌లో ఏ భద్రతా ఫీచర్లు స్టాండర్డ్‌గా వస్తాయి?

ఈ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌ వంటివి స్టాండర్డ్‌గా వస్తాయి. కానీ సైడ్ లేదా కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు లేవు.

క్రాష్ టెస్ట్ ఫలితాల తర్వాత టయోటా తీసుకున్న చర్య ఏమిటి?

సౌత్ ఆఫ్రికా మార్కెట్లోకి వచ్చే కొత్త స్టార్లెట్ వేరియంట్లలో సైడ్ హెడ్ ఇంకా థొరాక్స్ ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫీచర్లుగా ఇస్తున్నట్లు టయోటా ప్రకటించింది. ఈ అప్‌డేటెడ్ మోడల్‌ను గ్లోబల్ NCAP మరోసారి పరీక్షించనుంది.

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
మారుతి బలెనో కొనేవాళ్లు కొన్ని రోజులు ఆగండి, సెప్టెంబర్‌ 5న వచ్చే కొత్త మోడల్‌లో కీలక మార్పులు!
మారుతి బలెనోకు కొత్త లుక్‌ - సన్‌రూఫ్‌, యాంబియంట్‌ లైటింగ్‌ సహా చాలా కొత్త ఫీచర్లు
ఒకే ఛాసిస్‌.. కానీ లుక్‌, ఇంటీరియర్‌, ఫీచర్లలో భారీ తేడాలు.. మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌!
మహీంద్రా స్కార్పియో ఎన్‌ vs లైఫ్‌స్టైలర్‌ మధ్య ఇంత తేడానా? కొత్త పికప్‌ ట్రక్‌లో మారినవేంటో తెలుసా?
BE 6 రేసింగ్‌ లుక్‌ను పక్కన పెట్టిన మహీంద్రా.. త్రివర్ణాలు, 540 డిగ్రీల కెమెరాతో కొత్త 'ఫ్రీడమ్‌ ఎడిషన్‌'
ఆగస్టు 15 సందర్భంగా మహీంద్రా BE 6కు కొత్త లుక్‌.. ఫార్ములా ఈ ఫ్రీడమ్‌ ఎడిషన్‌లో ప్రత్యేక మార్పులు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget