అన్వేషించండి

Barrierless Toll Plaza: టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు

ఢిల్లీలోని అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-II పై దేశంలోనే రెండో బారియర్ లెస్ టోల్ ప్లాజాను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఇకపై వాహనాలు ఆగకుండానే టోల్ చెల్లింపులు పూర్తవుతాయి.

Delhi Gets Indias Second Barrierless Toll Plaza: దేశంలోని హైవేలపై ప్రయాణించే వారికి ఇది నిజంగా శుభవార్త. టోల్ ప్లాజాల వద్ద బారులు తీరే వాహనాలు, ట్రాఫిక్ జామ్ లకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టెక్నాలజీని వేగంగా విస్తరిస్తోంది. ఢిల్లీలోని అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-II (UER-II) పై ఈ సరికొత్త బారియర్ లెస్ టోల్ ప్లాజాను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ముండ్కా-బక్కర్వాలా వద్ద ఉన్న ఈ టోల్ ప్లాజా ఇప్పుడు దేశంలోనే రెండో బారియర్ లెస్ టోల్ గా రికార్డు సృష్టించింది.

ఏమిటీ బారియర్ లెస్ టోలింగ్?
సాధారణంగా టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగినప్పుడు బారియర్లు పైకి లేస్తాయి. కానీ ఈ కొత్త టెక్నాలజీలో అసలు భౌతికమైన బారియర్లు ఉండవు. రోడ్డుపై ఏర్పాటు చేసిన ఓవర్‌హెడ్ ఫ్రేమ్స్‌కు అత్యాధునిక సెన్సార్లు, కెమెరాలు అమర్చి ఉంటాయి. వాహనం ఆ పాయింట్ దాటుతున్నప్పుడు ఈ సెన్సార్లు ఫాస్టాగ్ ను రీడ్ చేసి, కెమెరాలు నంబర్ ప్లేట్ ను రికార్డ్ చేస్తాయి. తద్వారా వెహికల్ వేగంగా వెళ్తున్నప్పుడే టోల్ అమౌంట్ ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. దీనివల్ల డ్రైవర్లు కారును ఆపాల్సిన అవసరం గానీ, వేగం తగ్గించాల్సిన అవసరం గానీ ఉండదు.

72 గంటల్లోపు చెల్లిస్తేనే ఊరట..
ఈ సిస్టమ్ లో ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. టోల్ పాయింట్ దాటిన తర్వాత మీకు మొబైల్ కు ఈ-నోటీస్ వస్తుంది. ఒకవేళ ఫాస్టాగ్ లో బ్యాలెన్స్ లేకపోయినా లేదా ఏదైనా సాంకేతిక సమస్య వచ్చినా, నోటీస్ వచ్చిన 72 గంటల్లోపు టోల్ ఫీజు చెల్లించాలి. నిర్ణీత సమయం దాటితే మాత్రం డబుల్ టోల్ ఛార్జీ (2x) చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ హెచ్ఏఐ (NHAI) నిబంధనల ప్రకారం పెనాల్టీ నుంచి తప్పించుకోవాలంటే 72 గంటల డెడ్ లైన్ ను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.

రానున్న రోజుల్లో మరిన్ని టోల్ ప్లాజాలు..
కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 2026 నాటికి గుజరాత్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లోని 17 టోల్ ప్లాజాలను ఈ టెక్నాలజీలోకి మార్చనున్నారు. దీనివల్ల ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. మార్చి 2027 నాటికి రెండో దశలో మరో 108 కంటే ఎక్కువ టోల్ ప్లాజాలను అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

జాగ్రత్తలు ఇవే..
బారియర్ లెస్ టోల్ రోడ్లపై ప్రయాణించేటప్పుడు డబుల్ ఛార్జీల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని విషయాలు పాటించాలి. ముందుగా మీ ఫాస్టాగ్ ఎప్పుడూ యాక్టివ్ గా ఉండేలా చూసుకోవాలి. వాలెట్ లో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవడం తప్పనిసరి. అలాగే వాహనానికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (HSRP) ఉండాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చే మెసేజ్ లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే ఎటువంటి పెనాల్టీలు పడకుండా హాయిగా ప్రయాణించవచ్చు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ రోడ్లపై ప్రయాణం కూడా డిజిటల్ మయం అవుతోంది అనడానికి ఈ బారియర్ లెస్ టోల్ ప్లాజాలే నిదర్శనం.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కొత్త అప్‌డేట్‌ - కొనే ముందు మీరు తెలుసుకోవాల్సిన 6 విషయాలు ఇవే!
2026 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో కొత్తగా వచ్చిన మార్పులేంటి? ధర ఎంత? పూర్తి వివరాలు
Best Mileage Scooters: పెట్రోల్ టెన్షన్‌కు చెక్, 2026లో అత్యధిక మైలేజ్ ఇచ్చే స్కూటర్లు ఇవే
పెట్రోల్ టెన్షన్‌కు చెక్, 2026లో అత్యధిక మైలేజ్ ఇచ్చే స్కూటర్లు ఇవే
వచ్చే ఏడాది నుంచే CAFE-III నిబంధనలు అమలు - కొత్త కారు కొనేవాళ్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వివరాలు
CAFE-III కొత్త నిబంధనలు ఏమిటి? పెట్రోల్ కార్లపై ప్రభావం ఎంత, EVలకు కలిగే లాభాలేంటి?
E20 పెట్రోల్‌పై డౌట్‌ ఉందా? రూ.10 లక్షల లోపు కొనుగోలు చేయగల 5 బెస్ట్‌ డీజిల్ కార్ల లిస్ట్‌
రూ.10 లక్షల లోపు బడ్జెట్‌లో డీజిల్ కార్లు కావాలా? ఇప్పటికీ మార్కెట్‌లో ఉన్న 5 బెస్ట్ ఆప్షన్లు ఇవే
Advertisement

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Embed widget