అన్వేషించండి

NHAI Issues Warning: నేషనల్ హైవేలపై కొత్త టోల్ రూల్స్.. గడువు దాటితే డబుల్ పేమెంట్! హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్

నేషనల్ హైవేలపై బారియర్ లెస్ టోల్ విధానం అమల్లోకి వచ్చింది. టోల్ చెల్లింపులో ఆలస్యమైతే 72 గంటల తర్వాత రెట్టింపు బాదుడు తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

NHAI Issues Warning on Barrierless Toll Charges : నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా బారియర్ లెస్ టోల్ రోడ్లను వాడే వారు ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి. దేశంలోనే మొదటిసారిగా రాజస్థాన్‌లోని మనోహర్‌పూర్, తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతాల్లో ఈ కొత్త టోలింగ్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ సిస్టమ్ వల్ల వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండానే నేరుగా వెళ్లిపోవచ్చు. అయితే ఈ సౌకర్యంతో పాటు కొన్ని కఠినమైన నిబంధనలు కూడా వచ్చాయి. టోల్ పేమెంట్ గడువు దాటితే వాహనదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

బారియర్ లెస్ టోల్ ఎలా పనిచేస్తుంది?
ఈ కొత్త విధానంలో లైడార్ (LiDAR) టెక్నాలజీని వాడుతున్నారు. రోడ్డుపై ఉన్న టోల్ గాంట్రీ కింద నుంచి వాహనం వెళ్తున్నప్పుడు, ఈ సెన్సార్లు రియల్ టైమ్‌లో వాహనాన్ని గుర్తిస్తాయి. కెమెరాల సాయంతో నంబర్ ప్లేట్ ను రీడ్ చేసి, వాహనం సైజు, యాక్సిల్ కౌంట్ ఆధారంగా అది ఏ కేటగిరీకి చెందుతుందో సిస్టమ్ ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. ఆ తర్వాత ఆ డేటాను ఫాస్టాగ్ (FASTag) తో లింక్ చేసి టోల్ అమౌంట్ ను కట్ చేస్తుంది. దీనివల్ల ట్రాఫిక్ జామ్ సమస్యలు తగ్గడమే కాకుండా ప్రయాణం చాలా వేగంగా సాగుతుంది.

డబుల్ ఛార్జ్ ఎందుకు పడుతుంది?
అయితే కొన్నిసార్లు టెక్నికల్ సమస్యలు లేదా ఫాస్టాగ్ లో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల టోల్ అమౌంట్ కట్ అవ్వదు. అలాగే ఇన్-యాక్టివ్ ట్యాగ్స్ ఉన్నా పేమెంట్ ప్రాసెస్ కాదు. ఇలాంటి సందర్భాల్లో సిస్టమ్ ఆ వాహన వివరాలను రికార్డ్ చేసుకుని, వెంటనే ఒక ఎలక్ట్రానిక్ నోటీస్ (e-Notice) ను వాహన యజమానికి పంపిస్తుంది. రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా ఈ నోటీస్ వస్తుంది. పెండింగ్ ఉన్న టోల్ అమౌంట్ ను చెల్లించాలని ఇది ఒక రిమైండర్ లా పనిచేస్తుంది.

72 గంటల గడువు - డెడ్ లైన్..
వాహనదారులు ఇక్కడ ఒక ముఖ్యమైన రూల్ గుర్తుంచుకోవాలి. మీకు ఇ-నోటీస్ వచ్చిన 72 గంటల లోపు పెండింగ్ టోల్ చెల్లిస్తే.. కేవలం ఒరిజినల్ అమౌంట్ కడితే సరిపోతుంది. ఒకవేళ ఆ 72 గంటల టైమ్ విండో దాటితే మాత్రం, కట్టాల్సిన సొమ్ము ఆటోమేటిక్‌గా డబుల్ అవుతుంది. అంటే కేవలం ఆలస్యం వల్ల మీరు రెట్టింపు టోల్ చెల్లించాల్సి వస్తుంది.

పేమెంట్ ఎలా చేయాలి?
మీ వాహనంపై ఏవైనా టోల్ బకాయిలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) నిర్వహిస్తున్న అఫీషియల్ పోర్టల్ లో లాగిన్ అవ్వాలి. వాహనం నంబర్ ఎంటర్ చేసి బకాయిలను సెటిల్ చేసుకోవచ్చు. ఈ విషయంలో మోసగాళ్లు నకిలీ లింకులు పంపే అవకాశం ఉన్నందున, కేవలం అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే వాడాలని అధికారులు సూచిస్తున్నారు.

తప్పుడు నోటీసులు వస్తే?
ఒకవేళ మీకు తప్పుడు ఇ-నోటీస్ వచ్చినా లేదా పేమెంట్ విషయంలో ఏదైనా అభ్యంతరం ఉన్నా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. గ్రీవెన్స్ ఫైల్ చేయడానికి కూడా అదే 72 గంటల సమయం ఇస్తారు. ఆ లోపు స్పందించకపోతే మాత్రం పెనాల్టీ వర్తిస్తుంది. కాబట్టి ప్రయాణానికి ముందే ఫాస్టాగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, సరైన ట్యాగ్ వాడటం ఇప్పుడు తప్పనిసరి.  హైవేలపై వేగంగా వెళ్లడమే కాదు, టోల్ పేమెంట్ల విషయంలోనూ అలర్ట్ గా ఉంటేనే జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

రూ.10 లక్షల లోపు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌.. బలెనో, i20లో మీకు ఏది సరిపోతుందంటే?
బలెనో vs i20.. టాప్‌ వేరియంట్లలో ఏ కారు ఎక్కువ ఫీచర్లు ఇస్తుందో తెలుసా?
రూ.9 వేల కంటే తక్కువ EMIతోనే టాటా ఆల్ట్రోజ్‌ను మీ సొంతం చేసుకోవచ్చు! ఇదిగో ఈజీ ప్లాన్‌
5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ ఉన్న టాటా ఆల్ట్రోజ్‌ కొనడానికి లోన్‌ ఇస్తారా? డౌన్‌పేమెంట్‌ ఎంత కట్టాలి?
Kawasaki Z900 బైక్‌పై అదిరిపోయే డీల్‌.. వడ్డీ మినహాయింపుతో పాటు ఉచిత యాక్సెసరీస్‌!
Kawasaki Z900 కొనండి.. రూ. 1.25 లక్షల విలువైన డీల్‌ సొంతం చేసుకోండి!
రూ.10 లక్షల లోపులో బలెనో - రూ.10.75 లక్షల ఆల్ట్రోజ్‌.. టెక్నాలజీ, ఫీచర్లలో ఏ కారు బెటర్‌?
మారుతి బలెనో vs టాటా ఆల్ట్రోజ్‌.. టాప్‌ వేరియంట్లలో ఏ కారు ప్రత్యేకత ఏంటి?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
Irumudi OTT : థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
Hyderabad Crime News: వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
యువతకు నచ్చేలా అపాచీ, రోనిన్‌లో కొత్త టెక్నాలజీ ఫీచర్లు.. ధరలు ఎంతంటే?
యూత్‌ఫుల్‌ Apache, Ronin బైకుల్లో కొత్త వేరియంట్లు, కొత్త టెక్నాలజీ
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
Embed widget