అన్వేషించండి

Renault Car Discounts: రెనో కార్లపై అదిరిపోయే మే ఆఫర్లు.. క్విడ్, ట్రైబర్, కైగర్‌లపై భారీ డిస్కౌంట్లు! ఏ మోడల్‌పై ఎంత సేవింగ్స్ అంటే?

మే నెలలో రెనో ఇండియా తన పాపులర్ కార్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. కైగర్, ట్రైబర్, క్విడ్ మోడళ్లపై రూ. 65,000 వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రెనో మే నెలలో కైగర్, ట్రైబర్, క్విడ్ లపై డిస్కౌంట్లు ప్రకటించింది.
  • కైగర్ పై రూ. 65,000 వరకు, ట్రైబర్ పై రూ. 45,000 వరకు ఆఫర్లు.
  • క్విడ్ మోడల్ పై రూ. 40,000 వరకు తగ్గింపుతో కొత్త కార్లు లభ్యం.
  • ఈ ఆఫర్లు మే 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Renault Car Discounts and Offers for May: కారు కొనుగోలుదారులకు రెనో ఇండియా ఈ మే నెలలో సూపర్ ఆఫర్లను తీసుకొచ్చింది. తన లైనప్‌లో ఉన్న మూడు ప్రధాన మోడళ్లు కైగర్, ట్రైబర్, క్విడ్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను కంపెనీ ప్రకటించింది. మోడల్, స్టాక్ సంవత్సరాన్ని బట్టి ఈ బెనిఫిట్స్ మారుతుంటాయి. ఈ నెలలో అన్నింటికంటే ఎక్కువగా రెనో కైగర్ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అయితే తాజాగా లాంచ్ అయిన డస్టర్ మిడ్ సైజ్ ఎస్‌యూవీపై మాత్రం ఎటువంటి ఆఫర్ స్కీమ్ అందుబాటులో లేదు. ఈ ఆఫర్లు అన్నీ మే 31, 2026 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. డీలర్ షిప్, నగరాన్ని బట్టి ఆఫర్ వివరాల్లో స్వల్ప మార్పులు ఉండే ఛాన్స్ ఉంది.

రెనో కైగర్ (Renault Kiger)..
ఈ మే నెలలో కైగర్ పై అన్నింటికంటే పెద్ద డిస్కౌంట్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఉన్న విన్ (VIN) 2026 స్టాక్ పై మొత్తం రూ. 65,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇందులో రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 15,000 లాయల్టీ బెనిఫిట్స్ ఉన్నాయి. వీటితో పాటు రూ. 10,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ. 4,000 రూరల్ ఆఫర్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు పాత మోడల్ ఎంవై (MY) 2025 స్టాక్ తీసుకుంటే ఏకంగా రూ. 88,500 వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు. కైగర్ ధర రూ. 5.81 లక్షల నుండి రూ. 10.34 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది.

రెనో ట్రైబర్ (Renault Triber)..
ఫ్యామిలీ కారుగా పేరున్న ట్రైబర్ విన్ 2026 స్టాక్ పై రూ. 45,000 వరకు బెనిఫిట్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇందులో రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. వీటితో పాటు లాయల్టీ బోనస్, రూ. 10,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తాయి. అర్హులైన కొనుగోలుదారులకు రూ. 4,000 గ్రామీణ ప్రాంత ఆఫర్ కూడా వర్తిస్తుంది. పాత ఎంవై 2025 స్టాక్ ఎంచుకునే వారు రూ. 60,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ట్రైబర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.81 లక్షల నుండి రూ. 8.48 లక్షల వరకు ఉంటుంది.

రెనో క్విడ్ (Renault Kwid)..
రెనో క్విడ్ హ్యాచ్‌బ్యాక్ పై ఈ నెలలో కొంత తక్కువ ఆఫర్లు ఉన్నాయి. విన్ 2026 స్టాక్ పై రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 లాయల్టీ బోనస్, రూ. 10,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ. 4,000 రూరల్ బెనిఫిట్ కలిపి మొత్తం రూ. 40,000 వరకు ఆఫర్లు లభిస్తాయి. ఎంవై 2025 స్టాక్ పై మాత్రం రూ. 50,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. క్విడ్ ధర రూ. 4.30 లక్షల నుండి రూ. 5.88 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్ లో అందుబాటులో ఉంది.

పైన చెప్పిన ధరలన్నీ ఎక్స్-షోరూమ్ కి సంబంధించినవి మాత్రమే. ఈ ఆఫర్లు అన్నీ మే 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. నగరం, డీలర్ షిప్, స్టాక్ లభ్యతను బట్టి ఆఫర్లు మారుతుంటాయి. కాబట్టి కారు కొనే ముందు మీకు దగ్గరలో ఉన్న రెనో డీలర్ షిప్ కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. మంచి ఫీచర్లు, సేఫ్టీ ఉన్న ఈ కార్లను తక్కువ ధరలో సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయం.

Frequently Asked Questions

మే నెలలో రెనో కార్లపై ఏయే మోడళ్లకు డిస్కౌంట్లు ఉన్నాయి?

మే నెలలో రెనో ఇండియా కైగర్, ట్రైబర్, క్విడ్ మోడళ్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది.

రెనో కైగర్ పై ఈ నెలలో ఎంత వరకు డిస్కౌంట్ లభిస్తుంది?

VIN 2026 స్టాక్ పై కైగర్ పై మొత్తం రూ. 65,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. MY 2025 స్టాక్ పై రూ. 88,500 వరకు ఆదా చేసుకోవచ్చు.

రెనో ట్రైబర్ పై మే నెలలో ఎలాంటి ఆఫర్లు ఉన్నాయి?

VIN 2026 ట్రైబర్ పై రూ. 45,000 వరకు బెనిఫిట్స్, MY 2025 స్టాక్ పై రూ. 60,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

రెనో క్విడ్ పై ఈ నెలలో ఎంత డిస్కౌంట్ లభిస్తుంది?

VIN 2026 క్విడ్ పై రూ. 40,000 వరకు ఆఫర్లు, MY 2025 స్టాక్ పై రూ. 50,000 వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి.

ఈ రెనో కార్ల ఆఫర్లు ఎప్పటి వరకు చెల్లుబాటు అవుతాయి?

ఈ ఆఫర్లన్నీ మే 31, 2026 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. డీలర్ షిప్, నగరాన్ని బట్టి ఆఫర్లలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
PM Modi Chennai Tour: సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
Embed widget