అన్వేషించండి

Hyundai Venue Vs Kia Sonnet: హ్యుందాయ్‌ వెన్యూ vs కియా సోనెట్‌లో ఏ కాంపాక్ట్ ఎస్‌యూవీ సరైంది? 8 లక్షల బడ్జెట్‌ కార్లు కొనే ముందు తేడాలు తెలుసుకోండి! 

Hyundai Venue Vs Kia Sonnet: భారత్‌ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో కాంపాక్ట్ ఎస్‌యూవీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఇందులో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ మధ్య వ్యత్యాసం తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ కంపాక్ట్ ఎస్‌యూవీల పోటీ.
  • కియా సోనెట్ ధర తక్కువ, మైలేజ్ ఆకర్షణీయం.
  • హ్యుందాయ్ వెన్యూ భద్రతలో 5-స్టార్ రేటింగ్ తో ముందుంది.
  • రెండు కార్లలోనూ లగేజీ స్థలం, ప్రీమియం ఫీచర్లున్నాయి.

Hyundai Venue Vs Kia Sonnet: భారత్‌ రహదారులపై నేడు కంపాక్ట్‌ ఎస్‌యూవీల హవా నడుస్తోంది. మధ్యతగతి కుటుంబాలకు ఇటు బడ్జెట్‌లో ఉంటూనే, అటు ప్రీమియం ఫీచర్లను అందించే కార్ల కోసం వెతుకులాట నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ రేసులో అగ్రస్థానంలో ఉన్న రెండు అద్భుతమైన మోడళ్లు హ్యుందాయ్‌ వెన్యూ, కియా సోనెట్‌. ఈ రెండు కార్లు దాదాపు ఒకే రకమైన ఇంజిన్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ వినియోగదారుడి అవసరాలను ట్టి వీటి ఎంపిక మారుతుంటుంది. 

ధరల, వేరియంట్లలో తేడా

బడ్జెట్‌ అనేది ప్రతి కారు కొనుగోలుదారుని మొదటి ప్రాధాన్యత వనరుల ప్రకారం, హ్యుందాయ్‌ వెన్యూ(HX 2 పెట్రోల్ 1.2L) ప్రారంభ ధర సుమారు 8 లక్షలు గా ఉంది. మరోవైపు కియా సోనెట్ (HTE పెట్రోల్ 1.2L) మరింత సరసమైన ధరకే అందుబాటులో ఉంది. దీని ధర 7.32 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. సుమారు 68వేల వ్యత్యాసం ఈ రెండు మోడళ్ల మధ్య కనిపిస్తోది. ఇది బడ్జెట్‌ వినియోగదారులకు సోనెట్‌ వైపు మొగ్గు చూపేలా చేస్తుంది. 

ఇంజిన్ పని తీరు, మైలేజీ 

ఈ రెండు కార్లలో 1197cc, 4 సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ ఉపయోగించారు. రెండు కార్లూ 82bhp@6000 rpm శక్తిని ఉత్పత్తి చేస్తాయి. వెన్యూ 114. 7Nm టార్క్‌ను ఇంస్తుండగా, సోనెట్‌ స్వల్పంగా ఎక్కువగా 115Nm టార్గ్‌ను అందిస్తుంది. హ్యుందాయ్‌ వెన్యూ లీటర్‌కు 18.5 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. వినియోగదారుల ఫీడ్ బ్యాక్ ప్రకారం ఇది సుమారు 17 కిలోమీటర్ల ఇస్తుంది. కియో సోనెట్‌ విషయంలో వినియోగదారులు దాని ఫ్యూయల్‌ ఎకనామీకి 5/5 రేటింగ్ ఇచ్చారు. 

భద్రతలో తోపు ఎవరు 

నేటి కాలంలో కారు కొనేవారు భద్రతకు పెద్దపీట వేస్తున్నవారు. ఇక్కడే హ్యుందాయ్ వెన్యూ పైచేయి సాధిస్తోంది. వెన్యూ భారత్ ఎన్‌క్యాప్‌ల 5 స్టార్ రేటింగ్ సాధించి అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రోల్‌ ఓవర్‌ సెన్సార్‌, ఇంపాక్ట్‌ సెన్సింగ్‌ ఆటో డోర్ అన్‌లాక్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. కియా సోనెట్‌లో కడా ఆరు ఎయిర్‌ బ్యాక్‌లు ప్రామాణికంగా వస్తాయి. అయితే దీనికి ఇంకా అధికారిక ఎన్‌క్యాప్ రేటింగ్ పరీక్షలు నిర్వహించలేదు. 

ఇంటీరియల్ , కంఫర్ట్

కారు లోపల సౌకర్యాల విషయంలో రెండు బ్రాండ్లు తమదైన శైలిని చూపిస్తున్నాయి. ప్రయాణాల్లో లగేజీ పెట్టుకోవడానికి కియా సోనెట్ 385 లీటర్ల స్థలాన్ని అందిస్తోంది. ఇది వెన్యూ కంటే కొంచెం ఎక్కువ. వెన్యూలో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌, వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. సోనెట్‌ లెదరెట్‌ సీట్లతో ప్రీమియం లుక్‌తో ఇస్తుండగా వెన్యూ ఫ్యాబ్రిక్‌ అప్హోల్స్టరీని ఉపయోగిస్తుంది. 

Frequently Asked Questions

హ్యుందాయ్ వెన్యూ మరియు కియా సోనెట్ మధ్య ధరలో ప్రధాన తేడా ఏమిటి?

హ్యుందాయ్ వెన్యూ ప్రారంభ ధర సుమారు 8 లక్షలు కాగా, కియా సోనెట్ 7.32 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ సుమారు 68వేల వ్యత్యాసం బడ్జెట్ వినియోగదారులకు సోనెట్ ను ఆకర్షణీయంగా చేస్తుంది.

రెండు కార్ల ఇంజిన్ పనితీరు మరియు మైలేజీ ఎలా ఉంటాయి?

రెండు కార్లు 1197cc, 4 సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ తో 82bhp శక్తిని ఉత్పత్తి చేస్తాయి. వెన్యూ 114.7Nm టార్క్ ను అందిస్తుండగా, సోనెట్ 115Nm టార్క్ ను అందిస్తుంది. వెన్యూ 18.5 కిమీ/లీ మైలేజీ ఇస్తుందని పేర్కొన్నారు, అయితే సోనెట్ వినియోగదారుల నుండి మంచి ఫ్యూయల్ ఎకానమీ రేటింగ్ పొందింది.

భద్రత పరంగా ఏ కారు మెరుగైనది?

భద్రతలో హ్యుందాయ్ వెన్యూ పైచేయి సాధించింది. ఇది భారత్ NCAP 5 స్టార్ రేటింగ్ పొందింది, ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్ లు, రోల్ ఓవర్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కియా సోనెట్ లో కూడా ఆరు ఎయిర్ బ్యాగ్ లు ఉన్నప్పటికీ, దీనికి ఇంకా అధికారిక NCAP రేటింగ్ లేదు.

కారు లోపల సౌకర్యాల పరంగా ఏది ఎక్కువ స్థలాన్ని అందిస్తుంది?

లగేజీ కోసం కియా సోనెట్ 385 లీటర్ల స్థలాన్ని అందిస్తుంది, ఇది వెన్యూ కంటే కొంచెం ఎక్కువ. వెన్యూలో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

రూ.10 లక్షల బడ్జెట్‌లో లభించే Best CNG Cars ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
రూ.10 లక్షల బడ్జెట్‌లో లభించే Best CNG Cars ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Maruti Baleno కంటే Toyota Glanza రేటు ఎందుకు ఎక్కువ? ధర, ఫీచర్లు, మైలేజీలో అసలు తేడాలివే!
టయోటా గ్లాంజా vs మారుతి బలెనో.. ఈ ట్విన్‌ కార్స్‌లోనూ తేడాలున్నాయ్‌?, కొనే ముందే తెలుసుకోండి
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Embed widget