అన్వేషించండి

Maruti Suzuki Brezza Facelift: మారుతి సుజుకి బ్రెజ్జా 2026 ఫేస్‌లిఫ్ట్ టెస్టింగ్ షురూ.. అండర్‌బాడీ సీఎన్‌జీ ట్యాంక్, హైబ్రిడ్ ఆప్షన్లతో కొత్త అవతారం!

మారుతి సుజుకి తన పాపులర్ ఎస్‌యూవీ బ్రెజ్జా కొత్త వెర్షన్‌ను సిద్ధం చేస్తోంది. అండర్‌బాడీ సీఎన్‌జీ ట్యాంక్, పెద్ద ఇన్‌ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటి అప్‌డేట్లతో ఇది రాబోతోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మారుతి సుజుకి 2026 బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌ను రోడ్లపై పరీక్షిస్తోంది.
  • కొత్త బ్రెజ్జాలో అండర్‌బాడీ సీఎన్‌జీ ట్యాంక్, 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటాయి.
  • ఇంటీరియర్స్‌లో 10.25 అంగుళాల డిస్‌ప్లే, 360 డిగ్రీల కెమెరా సిస్టమ్‌ను పొందుతుంది.
  • ఈ అప్‌డేట్‌లు బ్రెజ్జా‌ను మార్కెట్‌లో మరింత పోటీగా నిలుపుతాయి.

2026 Maruti Suzuki Brezza Facelift Spotted Testing: మారుతి సుజుకి తన కార్ల లైనప్‌ను రిఫ్రెష్ చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా బాలెనోతో పాటు బ్రెజ్జా (Brezza) కొత్త మోడళ్లను టెస్టింగ్ చేస్తోంది. తాజాగా 2026 మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కెమెరాకు చిక్కింది. ఈ స్పై షాట్స్ ద్వారా కారులో రాబోయే కొన్ని కీలక మార్పులు బయటపడ్డాయి. ముఖ్యంగా సీఎన్‌జీ కార్ల ప్రేమికులకు మారుతి ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇవ్వబోతోంది. సాధారణంగా సీఎన్‌జీ కార్లలో సిలిండర్ వల్ల డిక్కీలో (Boot Space) అస్సలు ఖాళీ ఉండదు. కానీ ఈ కొత్త బ్రెజ్జాలో అండర్‌బాడీ సీఎన్‌జీ ట్యాంక్ సెటప్ ఉండబోతోంది.

కొత్త టెక్నాలజీతో సీఎన్‌జీ..
మారుతి సుజుకి గత ఏడాది సెప్టెంబర్ 2025లో 'విక్టోరిస్' మోడల్ ద్వారా అండర్‌బాడీ సీఎన్‌జీ ట్యాంక్ టెక్నాలజీని పరిచయం చేసింది. ఇప్పుడు ఇదే ఫార్ములాను బ్రెజ్జాకు కూడా అప్లై చేస్తోంది. దీనివల్ల కారు లోపల లగేజీ పెట్టుకోవడానికి ఫుల్ స్పేస్ అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్ తో సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో బ్రెజ్జా తన పట్టును మరింత పెంచుకోనుంది.

ఇంజిన్ - పర్ఫార్మెన్స్..
2026 బ్రెజ్జాలో ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ నే కొనసాగించే అవకాశం ఉంది. ఇది 99 హెచ్‌పీ పవర్, 137 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే రిపోర్ట్స్ ప్రకారం ఈసారి బ్రెజ్జాలో హైబ్రిడ్ సెటప్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. గేర్‌బాక్స్ విషయంలోనూ ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ కనిపిస్తోంది. ఇప్పటివరకు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌కే పరిమితమైన మారుతి, ఈ కొత్త బ్రెజ్జాలో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను ప్రవేశపెట్టేలా ఉంది. దీనివల్ల హైవేలపై ప్రయాణం మరింత స్మూత్ గా, ఫ్యూయల్ ఎఫిషియెంట్‌గా మారుతుంది.

డిజైన్ మార్పులు..

బయటి నుంచి చూస్తే కొత్త బ్రెజ్జా లుక్ ప్రస్తుత మోడల్ లాగే ఉన్నా, కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తున్నారు. హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ డిజైన్ దాదాపు పాతదే అయినా.. బంపర్, ఫ్రంట్ గ్రిల్ లో మార్పులు ఉండొచ్చు. టెస్టింగ్ కార్ ను పూర్తిగా కవర్ చేయడం వల్ల లోపల ఏముందో స్పష్టంగా తెలియడం లేదు కానీ, సరికొత్త అలాయ్ వీల్స్ రావడం పక్కా అని తెలుస్తోంది.

ఇంటీరియర్ - ఫీచర్లు..
కారు లోపలి భాగంలో టెక్నాలజీకి పెద్ద పీట వేశారు. ప్రస్తుతం బ్రెజ్జాలో 9 అంగుళాల ఇన్‌ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉండగా, కొత్త మోడల్ లో 10.25 అంగుళాల పెద్ద డిస్‌ప్లేను అమర్చారు. దీని యూజర్ ఇంటర్ఫేస్ కూడా చాలా అప్‌డేటెడ్ గా ఉండబోతోంది. కారు అద్దాల (ORVMs) కింద కెమెరాలు ఉండటం గమనిస్తే, ఇందులో 360 డిగ్రీల కెమెరా సిస్టమ్ ఉంటుందని స్పష్టమవుతోంది. ఇది పార్కింగ్ చేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది.

మార్కెట్ పోటీ..
మారుతి బ్రెజ్జా మార్కెట్లోకి వచ్చిన తర్వాత టాటా నెక్సాన్ (Nexon), హ్యుందాయ్ వెన్యూ (Venue), మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ (XUV 3XO), కియా సోనెట్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. మారుతి సుజుకి బ్రాండ్ వాల్యూ, తక్కువ మెయింటెనెన్స్ తో పాటు ఈ కొత్త ఫీచర్లు తోడైతే సేల్స్ లో బ్రెజ్జా మళ్ళీ టాప్ లో నిలవడం ఖాయం. మారుతి సుజుకి తీసుకొస్తున్న ఈ మార్పులు కారు ప్రియులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి. ముఖ్యంగా అండర్‌బాడీ సీఎన్‌జీ కాన్సెప్ట్ సక్సెస్ అయితే మాత్రం ఇండియన్ ఆటో సెక్టార్ లో ఇదొక గేమ్ చేంజర్ అవుతుంది.

Frequently Asked Questions

2026 మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో ముఖ్యమైన మార్పు ఏమిటి?

కొత్త బ్రెజ్జాలో అండర్‌బాడీ సీఎన్‌జీ ట్యాంక్ సెటప్ రానుంది. దీనివల్ల డిక్కీలో లగేజీకి పూర్తి స్థలం లభిస్తుంది.

కొత్త బ్రెజ్జా ఇంజిన్‌లో ఏమైనా మార్పులు ఉంటాయా?

ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌నే కొనసాగించవచ్చు. అయితే, హైబ్రిడ్ సెటప్‌తో పాటు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది.

కొత్త బ్రెజ్జా ఇంటీరియర్‌లో ఏ కొత్త ఫీచర్లు ఉంటాయి?

ఇన్‌ఫోటైన్‌మెంట్ స్క్రీన్ 9 అంగుళాల నుంచి 10.25 అంగుళాలకు పెరుగుతుంది. అలాగే 360 డిగ్రీల కెమెరా సిస్టమ్ కూడా రానుంది.

2026 బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో డిజైన్‌లో ఎలాంటి మార్పులు ఆశించవచ్చు?

బయటి రూపం ప్రస్తుత మోడల్‌లాగే ఉన్నా, బంపర్, ఫ్రంట్ గ్రిల్‌లో చిన్న మార్పులు ఉండవచ్చు. కొత్త అలాయ్ వీల్స్ వచ్చే అవకాశం ఉంది.

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget