అన్వేషించండి

TVS Motor Launches iQube S: టీవీఎస్ ఐక్యూబ్ నుంచి సరికొత్త వేరియంట్ లాంచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 175 కిలోమీటర్ల రేంజ్! ధర, ఫీచర్ల వివరాలు..

టీవీఎస్ మోటార్ ఐక్యూబ్ లైనప్‌లో కొత్తగా 4.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. ఇది 175 కిలోమీటర్ల రేంజ్ తో పాటు అదిరిపోయే కలర్స్ లో లభిస్తుంది.

TVS Motor Launches iQube S 4.7 kWh Variant: ఇండియ‌న్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో టీవీఎస్ మోటార్ (TVS Motor) తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. ప్రస్తుతం దేశీయ ఈవీ మార్కెట్లో ఏకంగా 24.36 శాతం వాటాతో ఈ బ్రాండ్ అగ్రస్థానంలో నిలిచింది. టీవీఎస్ సక్సెస్ లో ఐక్యూబ్ (iQube) లైనప్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ జోరును ఇలాగే కొనసాగించడానికి కంపెనీ ఇప్పుడు ఐక్యూబ్ ఎస్ (iQube S) మోడల్‌లో సరికొత్త 4.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వేరియంట్ విశేషాలు, పర్ఫార్మెన్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పెద్ద బ్యాటరీ - అదిరిపోయే రేంజ్..
గతంలో ఉన్న ఐక్యూబ్ ఎస్ 3.5 కిలోవాట్ అవర్ వేరియంట్ ప్లేస్ లో ఈ కొత్త మోడల్ వచ్చింది. పేరుకు తగ్గట్టుగానే ఇందులో 4.7 కిలోవాట్ అవర్ సామర్థ్యం ఉన్న పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనివల్ల రేంజ్ కూడా భారీగా పెరిగింది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ స్కూటర్ 175 కిలోమీటర్ల వరకు వెళ్తుందని కంపెనీ హామీ ఇస్తోంది. సిటీలో తిరిగే వారికి, లాంగ్ కమ్యూట్ చేసే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ గా మారుతుంది.

ధర ఎంతంటే?
ఈ కొత్త టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ 4.7 కిలోవాట్ అవర్ వేరియంట్ ధరను ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 1,37,142 గా నిర్ణయించారు. ఇది బేస్ వేరియంట్ ఐక్యూబ్ కు పైన, టాప్ మోడల్ ఐక్యూబ్ ఎస్టీ (iQube ST) కి కింద ఉంటుంది. అంటే మిడ్-రేంజ్ లో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఇది కరెక్ట్ ఛాయిస్.

డిజైన్, కలర్ ఆప్షన్లు..
కొత్త వేరియంట్ తో పాటు టీవీఎస్ కొన్ని అట్రాక్టివ్ కలర్స్ ను కూడా పరిచయం చేసింది. టైటానియం గ్రే, హార్లెక్విన్ బ్లూ బీజ్, మేగ్నిఫిసెన్స్ పర్పుల్ బీజ్ వంటి ఆప్షన్లలో ఈ స్కూటర్ లభిస్తుంది. దీని సీటు ఎత్తు 770 మిమీ ఉండగా, గ్రౌండ్ క్లియరెన్స్ 157 మిమీగా ఉంది. మొత్తం స్కూటర్ బరువు 128.8 కిలోలు. డ్యూయల్ టోన్ సీటు, బీజ్ కలర్ ఇన్నర్ ప్యానెల్స్ స్కూటర్ కు ఒక రిచ్ లుక్ ఇస్తాయి.

పవర్, పర్ఫార్మెన్స్..
ఇందులో ఉన్న హబ్ మోటార్ 3.0 కిలోవాట్ పీక్ పవర్‌ను, 33 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. స్పీడ్ విషయానికి వస్తే, ఇది గంటకు 82 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం 4.3 సెకన్లలోనే సున్నా నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం విశేషం. బ్రేకింగ్ కోసం ముందు వైపు 220 మిమీ డిస్క్ బ్రేక్, వెనుక వైపు 130 మిమీ డ్రమ్ బ్రేక్ సెటప్ ఇచ్చారు. దీనివల్ల ప్రయాణం సేఫ్ గా ఉంటుంది.

స్మార్ట్ ఫీచర్లు..
టెక్నాలజీ పరంగా ఐక్యూబ్ ఎస్ అప్డేటెడ్ గా ఉంది. ఇందులో 7 అంగుళాల టీఎఫ్టీ (TFT) ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక జాయ్ స్టిక్ సదుపాయం కల్పించారు. బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ తో పాటు 118 కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రివర్స్ మోడ్ ఉండటం వల్ల పార్కింగ్ చాలా సులభం అవుతుంది. క్రాష్ అలర్ట్, ఫాల్ అలర్ట్, యాంటీ-థెఫ్ట్ అలర్ట్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ పాడవకుండా ఐపీ67 (IP67) డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఇచ్చారు.

స్టోరేజ్, ఛార్జింగ్..
ఈ స్కూటర్ లో 32 లీటర్ల భారీ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. ఇందులో రెండు హెల్మెట్లు పెట్టుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, ఆఫ్-బోర్డ్ ఛార్జర్ ద్వారా 0 నుండి 80 శాతం ఛార్జింగ్ అవ్వడానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. వెనుక కూర్చునే వారికి కంఫర్ట్ కోసం పిలియన్ బ్యాక్‌రెస్ట్ కూడా అమర్చారు. మొత్తానికి రేంజ్, ఫీచర్లు, ధరను బ్యాలెన్స్ చేస్తూ టీవీఎస్ ఒక పక్కా ఫ్యామిలీ ఈవీని మార్కెట్లోకి తెచ్చింది. వచ్చే రోజుల్లో ఈ కొత్త వేరియంట్ తో టీవీఎస్ సేల్స్ మరిన్ని రికార్డులు సృష్టించేలా ఉన్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hybrid Car Types: మీకు ఏ హైబ్రిడ్ కారు బెస్ట్ ? ఫస్ట్ వీటి మధ్య వ్యత్యాసం తెలుసుకుంటేనే బెనిఫిట్స్
మీకు ఏ హైబ్రిడ్ కారు బెస్ట్ ? ఫస్ట్ వీటి మధ్య వ్యత్యాసం తెలుసుకుంటేనే బెనిఫిట్స్
7 Seater Cars For Families: పెద్ద కుటుంబాలకు ఈ 7 సీటర్ కార్లు బెస్ట్.. జాబితాలో Ertiga, Bolero మరింత ప్రత్యేకం
పెద్ద కుటుంబాలకు ఈ 7 సీటర్ కార్లు బెస్ట్.. జాబితాలో Ertiga, Bolero మరింత ప్రత్యేకం
Electric vs Hybrid Cars: తీవ్రమైన వేడి, చలిలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లలో ఏది బెటర్? మైలేజీపై ప్రభావం
తీవ్రమైన వేడి, చలిలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లలో ఏది బెటర్? మైలేజీపై ప్రభావం
Petrol and Diesel Price Hike? ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
Advertisement

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 DC VS PBKS Result Updates: DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు నాలుగో ప‌రాజ‌యం
DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు నాలుగో ప‌రాజ‌యం
Revanth Friendship With Modi: రేవంత్ కావాలా మోదీ..! పొలిటికల్ హీట్ రేపుతున్న మోదీతో సాన్నిహిత్యం..! హస్తం పార్టీలో చిచ్చుపెడతారా..?
రేవంత్ కావాలా మోదీ..! పొలిటికల్ హీట్ రేపుతున్న మోదీతో సాన్నిహిత్యం..! హస్తం పార్టీలో చిచ్చుపెడతారా..?
Hyderabad Crime News: బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్
బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్
Kadapa Tipu Sultan Row: కడపలో టిప్పు సుల్తాన్ వివాదం వెనుక నిషేధిత సంస్థల కుట్ర - సిట్ ఏర్పాటుకు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్
కడపలో టిప్పు సుల్తాన్ వివాదం వెనుక నిషేధిత సంస్థల కుట్ర - సిట్ ఏర్పాటుకు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్
CM Revanth Reddy on Bandi Sanjay Son Case: చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Shreyas Iyer Equals Rare IPL Record: శ్రేయాస్ అయ్యర్ రికార్డుల వేట.. కోహ్లీ, ద్రావిడ్ సరసన పంజాబ్ కింగ్స్ కెప్టెన్! 
శ్రేయాస్ అయ్యర్ రికార్డుల వేట.. కోహ్లీ, ద్రావిడ్ సరసన పంజాబ్ కింగ్స్ కెప్టెన్! 
YSRCP Spokesperson Shyamala Response on Rumors: శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
Maleesha Kharwa Success Story: ధారవి స్లమ్ ప్రిన్సెస్ .. గ్లోబల్ బ్యూటీ ఐకాన్ - నలుపు అని నవ్వినోళ్లే నోరెళ్లబెడుతున్నారు!
ధారవి స్లమ్ ప్రిన్సెస్ .. గ్లోబల్ బ్యూటీ ఐకాన్ - నలుపు అని నవ్వినోళ్లే నోరెళ్లబెడుతున్నారు!
Embed widget