అన్వేషించండి

Tata Motors Launches Harrier and Safari: టాటా హారియర్, సఫారీ డీజిల్ వెర్షన్లలో కొత్త అల్ట్రా ట్రిమ్, రెడ్ డార్క్ ఎడిషన్ లాంచ్.. అదిరిపోయే ఫీచర్లు, ధర వివరాలు..

టాటా మోటార్స్ తన పాపులర్ ఎస్‌యూవీలు హారియర్, సఫారీ డీజిల్ మోడళ్లలో అల్ట్రా ట్రిమ్, రెడ్ డార్క్ ఎడిషన్‌ను విడుదల చేసింది. అదిరిపోయే ఇంటీరియర్, సేఫ్టీ ఫీచర్లు వీటి సొంతం.

Tata Motors Launches Harrier and Safari Red Dark Edition: ఇండియ‌న్ రోడ్లపై రారాజుల్లా వెలిగిపోతున్న టాటా హారియర్ (Harrier), టాటా సఫారీ (Safari) ఇప్పుడు మరింత స్టైలిష్‌గా మారిపోయాయి. టాటా మోటార్స్ ఈ రెండు ఎస్‌యూవీల డీజిల్ వెర్షన్లలో 'అల్ట్రా' (Ultra) ట్రిమ్ తో పాటు 'రెడ్ డార్క్ ఎడిషన్' (Red Dark Edition) ను అధికారికంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. హారియర్ అల్ట్రా డీజిల్ మాన్యువల్ ధర రూ. 23.84 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి మొదలవుతుంది. అలాగే సఫారీ అల్ట్రా డీజిల్ మాన్యువల్ (7-సీటర్) ధర రూ. 24.49 లక్షల (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ నిర్ణయించింది. ఆసక్తి ఉన్నవారు అన్ని టాటా డీలర్‌షిప్‌లలో లేదా వెబ్‌సైట్ ద్వారా బుకింగ్స్ చేసుకోవచ్చు.

పెట్రోల్ నుంచి డీజిల్ కు అప్‌గ్రేడ్..
నిజానికి ఈ ఏడాది ఆరంభం వరకు అల్ట్రా ట్రిమ్, రెడ్ డార్క్ ఎడిషన్లు కేవలం పెట్రోల్ వేరియంట్లకు మాత్రమే పరిమితమయ్యాయి. కానీ డీజిల్ వెర్షన్ కొనే కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు ఈ ఫీచర్లను డీజిల్ ఇంజిన్‌కు కూడా టాటా మోటార్స్ ఎక్స్‌టెండ్ చేసింది. దీనివల్ల రెండు రకాల ఇంజిన్ ఆప్షన్లలోనూ టాప్-ఎండ్ ఫీచర్లు కస్టమర్లకు అందుబాటులోకి వచ్చాయి.

కళ్లు చెదిరే రెడ్ డార్క్ ఎడిషన్..
ఈ లాంచ్‌లో హైలైట్ అంటే రెడ్ డార్క్ ఎడిషన్ అనే చెప్పాలి. హారియర్ డీజిల్ మోడల్‌లో 'నిట్రో క్రిమ్సన్' (Nitro Crimson) ఎక్స్‌టీరియర్ పెయింట్ ఫినిషింగ్ చూడటానికి చాలా పవర్‌ఫుల్ గా ఉంటుంది. దీనికి తోడు బ్లాక్ కలర్ లో ఉన్న 19 అంగుళాల అలాయ్ వీల్స్, రెడ్ బ్రేక్ కాలిపర్స్ కారుకు ఒక స్పోర్టీ లుక్ ఇస్తాయి. హారియర్ లో ఫియర్లెస్ ఎక్స్ ప్లస్ (Fearless X+), సఫారీలో అకంప్లిష్డ్ ఎక్స్ ప్లస్ (Accomplished X+) ట్రిమ్స్ పైన ఈ కొత్త ఎడిషన్లు ఉంటాయి.

ప్రీమియం ఇంటీరియర్ ఫీచర్లు..
కారు లోపలి భాగం 'కార్నెలియన్ రెడ్' (Carnelian Red) థీమ్‌తో చాలా విలాసవంతంగా ఉంటుంది. రెడ్ కలర్ లెదరెట్ సీట్లు లోపలి లుక్ ని మార్చేస్తాయి. టెక్నాలజీ పరంగా చూస్తే, ఇందులో 14.5 అంగుళాల హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. దీనికి శామ్‌సంగ్ నియో క్యూలెడ్ (Samsung Neo QLED) డిస్‌ప్లే వాడటం విశేషం. డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్ తో మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. అదనంగా, ఇన్-బిల్ట్ డ్యాష్‌క్యామ్ ఉన్న ఈ-ఐఆర్వీఎమ్ (E-IRVM), ఆటో రివర్స్ డిప్ ఫీచర్ ఉన్న మెమరీ ఓఆర్వీఎమ్స్, 65 వాట్ల టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి.

ఇంజిన్ పవర్, సేఫ్టీ..
రెండు కార్లలోనూ 2.0 లీటర్ క్రయోజెట్ (Kryojet) టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 170 పీఎస్ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. సేఫ్టీ గురించి చెప్పాలంటే, భారత్ ఎన్‌క్యాప్ (Bharat NCAP) లో ఈ కార్లు 5 స్టార్ రేటింగ్ సాధించి అత్యంత సురక్షితమైన ఎస్‌యూవీలుగా పేరు తెచ్చుకున్నాయి. టాటా మోటార్స్ తీసుకొచ్చిన ఈ కొత్త అప్‌డేట్స్ డీజిల్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. మీరు ఒక పవర్‌ఫుల్, స్టైలిష్ ఎస్‌యూవీ కోసం చూస్తుంటే ఇవి బెస్ట్ ఆప్షన్స్ అవుతాయి.

టాప్ హెడ్ లైన్స్

బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని 50 ఏళ్లుగా వాడుతున్న బ్రెజిల్.. ఇప్పుడు అక్కడి కార్లు, బైకుల పరిస్థితి ఏంటి?
బ్రెజిల్‌లో 50 ఏళ్లుగా ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వినియోగం - అక్కడి కార్లు, బైక్‌లకు ఏం కాలేదా?
రోజూ కాలేజీ, ఆఫీస్‌కు వెళ్లిరావడానికి బెస్ట్ ఆప్షన్.. రూ.15,000 లోపే వచ్చే ఎలక్ట్రిక్‌ సైకిళ్లు ఇవే
పెట్రోల్ ఖర్చుకు చెక్.. రూ.15,000 లోపే స్టైలిష్‌ ఎలక్ట్రిక్ సైకిళ్లు, 40km వరకు ప్రయాణం!
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget