అన్వేషించండి

కారు కొనాలనే ఆలోచన ఉన్న వారికి గుడ్ న్యూస్! హోండా మోడల్స్‌పై రెండు లక్షల వరకు డిస్కౌంట్!

హోండా తన పాపులర్‌ కార్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇందులో దాదాపు అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి. వాటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హోండా సిటీ హైబ్రిడ్ పై 1.80 లక్షల నగదు తగ్గింపు.
  • హోండా ఎలివేట్ ఎస్‌యూవీపై 40వేల నగదు తగ్గింపు.
  • హోండా సిటీ పెట్రోల్‌పై 40వేల నగదు తగ్గింపు.
  • హోండా అమేజ్ పై 67వేల వరకు ప్రయోజనాలు.

భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లో వినియోగదారుల అభిరుచులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అందుకే పాత స్టాక్‌ను క్లియర్ చేసుకొని కొత్త మోడల్స్‌ను వాటి స్థానంలో తీసుకురావాలని మోటార్ కంపెనీలను ప్రయత్నిస్తుంటాయి. ఇలాంటి ప్రయత్నంలో ఉన్న హోండా క్లియరెన్స్ సేల్ ప్రకటించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న మోడల్స్‌పై భారీ ఆఫర్స్‌ ఇస్తోంది. కొత్త మోడల్స్ కోసం ప్లేస్ రెడీ చేసేందుకు ఈ పాత మోడల్స్‌ను త్వరగా విక్రయించేయాలని చూస్తోంది. హోండా సిటీ, అమేజ్, ఎలివేట్‌ మూడు మోడల్స్‌పై భారీగా ధరలు తగ్గించి అమ్ముతోంది. 

హోండా సిటీ హైబ్రిడ్‌పై భారీ ఆఫర్‌

ఈ నెలల హోండా అందిస్తున్న ఆఫర్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హోండా సిటీ హైబ్రిడ్‌. దీనిపై కంపెనీ నేరుగా 1.80 లక్షల నగదు తగ్గింపును అందిస్తోంది. దీనికి అదనంగా, రాయితీతో కూడిన 7 ఏళ్ల ఎక్స్‌టెండెడ్‌ వారంటీని కలిపితే మొత్తం ప్రయోజనాలు 1.97 లక్షలకు చేరుకుంటాయి. సుమారు 20లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధర కలిగిన ఈ కారుపై దాదాపు రెండు లక్షల తగ్గింపు లభించం అనేది వినియోగదారులకు గొప్ప విషయమని చెప్పవచ్చు. 

Also Read: కారు మెయింటెనెన్స్‌లో ఈ టిప్స్ పాటిస్తే మీ జేబుకు చిల్లు పడదు.. భారీ రిపేర్ ఖర్చుల నుంచి తప్పించుకోవడానికి సింపుల్ గైడ్!

మే 22న హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ కానుంది. కొత్త మోడల్ వచ్చే లోపు పాత స్టాక్‌ను పూర్తిగా విక్రయించాలనే లక్ష్యంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త కారులో కాస్మెటిక్ మార్పులు, ఫీచర్ అప్‌డేట్స్ ఉన్నప్పటికీ, ఇంజిన్ పరంగా మార్పులు ఉండకపోవచ్చు. కాబట్టి భారీ డిస్కౌంట్ కావాలనుకునే వారు ఇప్పుడు అందుబాటులో ఉన్న మోడల్‌ను ఎంచుకోవడం మంచిది. 

హోండా ఎలివేట్‌ ఎస్‌యూవీపై కూడా డిస్కౌంట్ 

హోండా పాపులర్‌ ఎస్‌యూవీ ఎలివేట్‌ ఈ నెలలో అత్యధిక తగ్గింపు ధరలు ఇస్తోంది. దీనిపై 2.12 లక్షల వరకు ప్రయోజనాలు కల్పిస్తోంది. నగదు తగ్గింపు 40వేలు, ఎక్స్చేంజ్‌ బోనస్‌ 30వేలు, ఇతర కార్పొరేట్ బోనస్‌, లాయల్టీ బోనస్, ఏడేళ్ల ఎక్సెటెండెడ్‌ వారంటీ కూడా ఇస్తోంది. 2025 నాటి పాత స్టాక్‌పై డీలర్లు మరిన్ని అదను ఆఫర్లను ఇచ్చే అవకాశం ఉంది. 

Also Read: వచ్చే ఏడాది మార్కెట్లోకి కొత్త హ్యుందాయ్ క్రెటా నెక్ట్స్ జనరేషన్.. స్పై షాట్‌లలో ప్రీమియం లుక్

ప్రస్తుతం ఎలివేట్ ధర 11.60 లక్షల నుంచి 16.57 లక్షల మధ్య ఉంది. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీని తట్టుకోవడానికి హోండా ఈ స్థాయిలో ఆఫర్లను ప్రకటించింది.

హోండా సిటీ పెట్రోల్‌పై తగ్గింపు 

సిటీ హైబ్రిడ్‌ తరహాలోనే పెట్రోల్ వెర్షన్‌పై కూడా ఆఫర్లు ఉన్నాయి. అయితే ఇక్కడ స్ట్రక్చర్ భిన్నంగా ఉంటుంది. హోండా సిటీ పెట్రోల్‌పై 40వేల నగదు తగ్గింపు ఉండగా, ఎక్స్చేంజ్‌ బెనిఫిట్ ఏకంగా 60 వేల వరకు ఉంది. లాయల్టీ, కార్పొరేట్‌ ప్రయోజనాలతో కలిపి 1.56 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. 

Also Read: టాటా మోటార్స్ సంచలన నిర్ణయం! 10 లక్షల మోడల్స్‌కే పనోరమిక్‌ సన్‌రూఫ్ ఫీచర్!

ముఖ్యంగా పాత హోండా సిటీ కార్లను వాడుతున్న వారు కొత్త మోడల్‌లోకి మారేలా ప్రోత్సహించడానికి ఈ ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ను కంపెనీ డిజైన్ చేసింది. మే 22న రాబోయే ఫేస్‌లిఫ్ట్‌ కొత్త ఇంటీరియర్‌, ఫీచర్లతో రానుంది. అయితే ప్రస్తుతం ధర కంటే అది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. 

హోండా అమేజ్ డిస్కౌంట్ 

ప్రస్తుతం హండా తన అమేజ్‌ మోడల్‌లో రెండు జనరేషన్స్‌ను ఒకేసారి విక్రయిస్తోంది. థర్డ్ జనరేషన్‌పై 67వేల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. సెకండ్ జనరేషన్‌పై 20వేల వరకు తగ్గింపు ఇస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆధునిక ఫీచర్లు, మెరుగైన ఆఫర్లు ఉన్న థర్డ్ జనరేషన్ అమేజ్ ఎంచుకోవడమే లాభదాయకం.దీని ధర 7.57 లక్షల నుంచి పది లక్షల మధ్య ఉంటుంది. 

7 ఏళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీతో ఏంటీ ప్రయోజనం 

మే నెల ఆఫర్స్‌లో అత్యంత ముఖ్యమైన అంశం రాయితీతో కూడిన 7 ఏళ్ల ఎక్స్‌టెండెడ్‌ వారంటీ. సాధారణంగా ఈ ప్యాకేజీ ధర ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం తక్కువ ధరకే లభిస్తోంది. మీరు కారును ఎక్కువ కాలం ఉంచుకోవాలనుకుంటే ఇది నిర్వహణ ఖర్చులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

Also Read: ఒకసారి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్లు దూసుకెళ్లే ఈవీ! భారత్ మార్కెట్‌లోకి ఎప్పుడ వస్తుందంటే?

ఈ ఆఫర్లన్నీ మే 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. నగరాలను బట్టి, డీలర్‌ వద్ద ఉన్న స్టాక్‌ను బట్టి ఈ తగ్గింపులు మారవచ్చు. సిటీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ సమీపిస్తున్న కొద్దీ పాత మోడల్స్‌ లభ్యత తగ్గిపోవచ్చు. 

Frequently Asked Questions

హోండా ప్రస్తుతం ఏయే కార్లపై డిస్కౌంట్లు అందిస్తోంది?

హోండా ప్రస్తుతం సిటీ, అమేజ్, మరియు ఎలివేట్ మోడల్స్‌పై భారీ తగ్గింపులను అందిస్తోంది. కొత్త మోడల్స్ కోసం పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి ఈ ఆఫర్లు ప్రకటించింది.

హోండా సిటీ హైబ్రిడ్‌పై ఎంత తగ్గింపు లభిస్తుంది?

హోండా సిటీ హైబ్రిడ్‌పై నేరుగా 1.80 లక్షల నగదు తగ్గింపు ఉంది. ఎక్స్‌టెండెడ్ వారంటీతో కలిపి మొత్తం ప్రయోజనాలు 1.97 లక్షల వరకు చేరుకుంటాయి.

హోండా ఎలివేట్‌పై మొత్తం ప్రయోజనాలు ఎంత?

హోండా ఎలివేట్‌పై నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, ఇతర బోనస్‌లు, మరియు ఎక్స్‌టెండెడ్ వారంటీతో కలిపి మొత్తం 2.12 లక్షల వరకు ప్రయోజనాలు కల్పిస్తోంది.

7 ఏళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీతో కలిగే ప్రయోజనం ఏమిటి?

ఈ ఆఫర్లలో భాగంగా లభించే 7 ఏళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీ, కారును ఎక్కువ కాలం ఉంచుకోవాలనుకునే వారికి నిర్వహణ ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది. సాధారణంగా ఈ ప్యాకేజీ ధర ఎక్కువగా ఉంటుంది.

ఈ ఆఫర్లు ఎప్పటి వరకు అందుబాటులో ఉంటాయి?

ఈ ఆఫర్లన్నీ మే 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే, నగరాలు మరియు డీలర్ల వద్ద ఉన్న స్టాక్‌ను బట్టి ఈ తగ్గింపులు మారవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget