అన్వేషించండి

Tata Nexon Affordable Panoramic Sunroof SUV: టాటా మోటార్స్ సంచలన నిర్ణయం! 10 లక్షల మోడల్స్‌కే పనోరమిక్‌ సన్‌రూఫ్ ఫీచర్! 

Tata Nexon Affordable Panoramic Sunroof SUV:టాటా మోటార్స్ తన పాపులర్‌ ఎస్‌యూవీ నెక్సాన్‌లో ప్యూర్‌‌+పీఎస్ అనే కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా సరికొత్త విప్లవానికి తెరలేపింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టాటా నెక్సాన్ ప్యూర్+పీస్ వేరియంట్ పనోరమిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది.
  • ఈ కొత్త వేరియంట్ సుమారు 9.49 లక్షల ధరతో లభ్యం కానుంది.
  • ప్రీమియం ఫీచర్లను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం.
  • త్వరలో ఈ వేరియంట్ పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వెర్షన్లలో రానుంది.

Tata Nexon Affordable Panoramic Sunroof SUV: భారతీయ వాహనదారుల మనసు గెలుచుకున్న మోడళ్లలో టాటా నెక్సాన్ ముందు వరుసలో ఉంటుంది. టాటా మోటార్స్ సంస్థ ఈ కారును కేవలం ఒక వాహనంగానే కాకుండా, మారుతున్న కస్టమర్ల అభిరుచుకులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ముస్తాబు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం వాహన ప్రియులు ఎక్కువగా కోరుకుంటున్న  పనోరమిక్‌ సన్‌రూఫ్ ఫీచర్‌ను అత్యంత సరసమైన ధరకే అందించేందుకు టాటా సిద్ధమైంది. దీని కోసం ప్యూర్‌+పీస్‌ అనే కొత్త వేరియంట్‌ను కంపెనీ రంగంలోకి దించుతోంది. 

10 లక్షలకే పనోరమిక్ సన్‌రూఫ్‌ కార్లు 

ప్రస్తుతం టాటా నెక్సాన్‌లో పనోరమిక్ సన్‌రూఫ్‌ కావాలంటే కస్టమర్లు, క్రియేటివ్‌+ పీఎస్‌ వేరియంట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ. 11.32 లక్షగా ఉంది. అయితే కొత్తగా రాబోతున్న ప్యూర్‌+ఫీఎస్‌ వేరియంట్‌ ఈ ఫీచర్‌ను పది లక్షల లోపే అందించబోతోంది. ఈ కొత్త వేరియంట్‌ ధర సుమారు 9.49 లక్షలుగా ఉండే అవకాశం ఉంది. దీని వల్ల పనోరమిక్‌ సన్‌రూఫ్‌ కలిగిన అత్యంత చౌకైన ఎస్‌యూవీగా నెక్సాన్‌ ఈ విభాగంలో సరికొత్త రికార్డు సృష్టించనుంది. 

సన్‌రూఫ్‌నకు పెరుగుతున్న ఆదరణ క్యాష్ చేసుకుంటున్న టాటా

ప్రీమియం ఫీచర్లను కేవలం ఖరీదైన వేరియంట్లకు మాత్రమే పరిమితం చేయకుండా సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావాలన్నదే టాటా మోటార్స్ ప్రధాన ఉద్దేశం. పనోరమిక్‌ సన్‌రూఫ్‌ పట్ల పెరుగుతున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని, తక్కువ ధరకే ఈ ఫీచర్లను అందించడం ద్వారా నెక్సాన్ అమ్మకాలను మరింత పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఇది వాహనదారులకు గొప్ప విలువను అదించడమే కాకుండా, పోటీ సంస్థలకు గట్టి సవాలు విసరనుంది. 

త్వరలో అందుబాటులోకి ప్యూర్‌ +పీఎస్‌ వేరియంట్‌

నెక్సాన్‌ లైన్ అప్‌లో ఈ కొత్త ప్యూర్‌ +పీఎస్‌ వేరియంట్‌ త్వరలోనే చేరుకనుంది. ఇది ప్రస్తుతం ఉన్న ప్యూర్‌+ఎస్‌, క్రియేటివ్‌ వేరియంట్ల మధ్యలో స్థానం పొందుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ప్యూర్‌+ఎస్‌ ర 9.23 లక్షలుగా క్రియేటివ‌ 1.2 పెట్రోల్‌ ధర 9.99 లక్షలుగా ఉంది. 

ఈవీ మోడల్స్‌లో కూడా సన్‌రూఫ్‌ ఫీచర్

నెక్సాన్‌ తన వైవిధ్యమైన ఇంజన్ ఆప్షన్లకు పేరుగాంచింది. ఈ కొత్త వేరియంట్‌ కూడా పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్జీ వెర్షన్‌లో అందుబాటులోకి వస్తుందని అంచనా. అంతేకాకుండా, భవిష్యత్‌లో నెక్సాన్‌ ఈవీ మోడల్‌లో కూడా ఇదే తరహా సరసమైన పనోరమిక్ సన్‌రూఫ్‌ వేరియంట్‌ను ఆశించవచ్చు. 

Also Read: కారు మెయింటెనెన్స్‌లో ఈ టిప్స్ పాటిస్తే మీ జేబుకు చిల్లు పడదు.. భారీ రిపేర్ ఖర్చుల నుంచి తప్పించుకోవడానికి సింపుల్ గైడ్!

2017లో మొదటిసారిగా లాంచ్ అయిన టాటా నెక్సాన్, 2023లో తన రెండో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌లో భాగంగా స్టైలింగ్, ఇంటీరియర్‌ డిజైన్, ఫీచర్లలో సమూల మార్పులు వచ్చాయి. అప్పట్లో కేవలం సింగిల్‌ ఫేస్  సన్‌రూఫ్‌తో వచ్చిన ఈ కారులో అక్టోబర్‌ 2024లో పనోరమిక్ సన్‌రూఫ్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. ప్రారంభంలో ఈ ఫీచర్‌ ఉన్న వేరియంట్ల ధర రూ. 13.60 లక్షల నుంచి మొదలయ్యేది. కానీ జీఎస్టీ సవరణలు, కొత్త వేరియంట్ల చేరికతో ఇప్పుడు పది లక్షల లోపు ధరకే ఈ లగ్జరీ ఫీచర్ కస్టమర్ల దరికి చేరుతోంది. 

Also Read: వచ్చే ఏడాది మార్కెట్లోకి కొత్త హ్యుందాయ్ క్రెటా నెక్ట్స్ జనరేషన్.. స్పై షాట్‌లలో ప్రీమియం లుక్

ప్రస్తుతం నెక్సాన్‌ మోడల్ కార్లు 7.37 లక్షల నుంచి 15.95 లక్షల ధరల మధ్య అందుబాటులో ఉన్నాయి. ఇందులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌, డిజిట్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్‌ సీట్లు, ఆరు ఎయిర్‌ బ్యాగ్‌ల వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్ల ప్రామాణికంగా ఉన్నాయి. ఈ కొత్త అప్‌డేట్‌తో నెక్సాన్‌ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోనుంది. 

Frequently Asked Questions

టాటా నెక్సాన్ లో పనోరమిక్ సన్‌రూఫ్‌ ఫీచర్‌ను అత్యంత సరసమైన ధరకే అందించేందుకు కంపెనీ ఏ కొత్త వేరియంట్‌ను తీసుకువస్తోంది?

టాటా మోటార్స్ పనోరమిక్‌ సన్‌రూఫ్‌ ఫీచర్‌ను అందుబాటు ధరలో అందించడానికి 'ప్యూర్‌+పీఎస్‌' అనే కొత్త వేరియంట్‌ను రంగంలోకి దించుతోంది. దీని ద్వారా నెక్సాన్‌ అత్యంత చౌకైన సన్‌రూఫ్‌ ఎస్‌యూవీగా మారనుంది.

కొత్త ప్యూర్‌+ఫీఎస్‌ వేరియంట్‌ ధర ఎంత ఉండనుంది?

కొత్తగా రాబోతున్న ప్యూర్‌+ఫీఎస్‌ వేరియంట్‌ ధర సుమారు 9.49 లక్షలుగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం క్రియేటివ్‌+ పీఎస్‌ వేరియంట్‌ ధర 11.32 లక్షగా ఉంది.

టాటా మోటార్స్‌ పనోరమిక్‌ సన్‌రూఫ్‌ను తక్కువ ధరకే ఎందుకు అందిస్తోంది?

ప్రీమియం ఫీచర్లను సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలన్నది టాటా మోటార్స్‌ ఉద్దేశ్యం. సన్‌రూఫ్‌ పట్ల పెరుగుతున్న క్రేజ్‌ను అందిపుచ్చుకొని, నెక్సాన్‌ అమ్మకాలను పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది.

ప్యూర్‌ +పీఎస్‌ వేరియంట్‌ ఏయే ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుంది?

ఈ కొత్త వేరియంట్‌ కూడా పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్జీ వెర్షన్‌లలో అందుబాటులోకి వస్తుందని అంచనా. భవిష్యత్‌లో ఈవీ మోడల్‌లో కూడా ఈ ఫీచర్‌ ఆశించవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
హోండా రెబెల్ 300 vs రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350 - ఏది స్పెషల్‌ బైక్‌?
ఎలక్ట్రిక్‌ బైక్‌ లేదా స్కూటర్‌ కొనేవాళ్లకు పెద్ద శుభవార్త.. రాయితీ గడువు పొడిగించిన కేంద్రం
ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనేవాళ్ల కోసం బిగ్‌ న్యూస్‌.. సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం
Exter Sales Report: 27 కిలోమీటర్ల మైలేజీ ఇస్తూ తక్కువ ధరకే లభించే కారు గురించి తెలుసా? అందుకే జనం ఎగబడుతున్నారా?
27 కిలోమీటర్ల మైలేజీ ఇస్తూ తక్కువ ధరకే లభించే కారు గురించి తెలుసా? అందుకే జనం ఎగబడుతున్నారా?
Hero Electric Bike: హీరో నుంచి రెడీ అవుతున్న ఈవీ బైక్.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
హీరో నుంచి రెడీ అవుతున్న EV Bike.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Embed widget