అన్వేషించండి

Honda City Facelift India Launch: హోండా సిటీ కొత్త వెర్షన్ వచ్చేస్తోంది.. మే 22న గ్రాండ్ లాంచ్! అదిరిపోయే ఫీచర్లు, కొత్త లుక్ తో సెడాన్ మార్కెట్లోకి ఎంట్రీ

హోండా కార్స్ ఇండియా తన పాపులర్ సెడాన్ 'సిటీ' అప్‌డేటెడ్ వెర్షన్‌ను మే 22న విడుదల చేయనుంది. ఆధునిక ఫీచర్లు, స్టైలిష్ మార్పులతో వస్తున్న ఈ కారు మార్కెట్లోని ఇతర కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Honda City Facelift India Launch Scheduled for May 22 ఫ ఇండియ‌న్ రోడ్లపై సెడాన్ కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా హోండా సిటీ (Honda City) అంటే కస్టమర్లలో ఒక రకమైన నమ్మకం ఉంటుంది. ఇప్పుడు అదే నమ్మకాన్ని మరింత పెంచడానికి హోండా సంస్థ సిటీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకువస్తోంది. మే 22న ఈ అప్‌డేటెడ్ సెడాన్ మార్కెట్లోకి రాబోతున్నట్లు కంపెనీ నుంచి సమాచారం అందింది. ఐదవ తరం హోండా సిటీ లాంచ్ అయిన తర్వాత వస్తున్న మొదటి మేజర్ అప్‌డేట్ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వోక్స్‌వ్యాగన్ వర్టస్, స్కోడా స్లావియా, హ్యుందాయ్ వెర్నా వంటి కార్ల జోరుకు బ్రేకులు వేయడమే లక్ష్యంగా హోండా ఈ ప్లాన్ వేసింది.

స్టైలిష్ లుక్ - కొత్త మార్పులు..
2026 మోడల్ హోండా సిటీ ప్రస్తుత ప్లాట్‌ఫారమ్ మీదనే తయారవుతున్నప్పటికీ, బాహ్య రూపంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు ఉండబోతున్నాయి. కారు బంపర్ల డిజైన్‌ను మార్చడంతో పాటు, కొత్త హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే కారుకు సరికొత్త అల్లాయ్ వీల్స్ సెట్ జత కానుంది. కారు ఆకారం (Silhouette) పెద్దగా మారకపోయినా, ఈ చిన్న చిన్న మార్పులు కారుకు ఒక ఫ్రెష్ అండ్ మోడర్న్ లుక్ ఇస్తాయి. హోండా తన లేటెస్ట్ గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌కు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దింది.

కేబిన్ లో లగ్జరీ ఫీచర్లు..
ఈసారి హోండా తన ప్రధాన దృష్టిని కారు లోపలి భాగం (Interior) మీద పెట్టింది. ప్రత్యర్థి కార్లలో ఉన్న అన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లను సిటీలోనూ ప్రవేశపెట్టబోతోంది. ఇందులో పెద్ద సైజు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అప్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్ ఉండబోతున్నాయి. డ్రైవర్ సౌకర్యం కోసం ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్డ్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు రానున్నాయి. భద్రత కోసం 360-డిగ్రీ కెమెరా, మెరుగుపరిచిన అడాస్ (ADAS) ఫంక్షన్లు ఈ అప్‌డేట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కొత్త రంగుల అప్హోల్స్టరీ కారు లోపల మరింత రిచ్ ఫీల్ కలిగిస్తుంది.

ఇంజిన్ పర్ఫార్మెన్స్..
మెకానికల్ గా చూస్తే హోండా సిటీ పాత ఇంజిన్లనే కొనసాగించే అవకాశం ఉంది. ఇందులో 1.5-లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజిన్ 121 హెచ్‌పీ పవర్ ఇస్తుండగా, 1.5-లీటర్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ 126 హెచ్‌పీ పవర్ అందిస్తుంది. కస్టమర్ల ఛాయిస్ ని బట్టి మాన్యువల్, సీవీటీ (CVT) గేర్ బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. మైలేజీ విషయంలోనూ హోండా సిటీ తన ప్రత్యేకతను చాటుకోనుంది. ఈ అప్‌డేటెడ్ కారు ధర కూడా కాంపిటీటివ్ గా ఉండేలా కంపెనీ కసరత్తు చేస్తోంది. ఒకప్పుడు సెడాన్ మార్కెట్ ను ఏలిన హోండా సిటీ, ఇప్పుడు కొత్త ఫీచర్లతో మళ్ళీ ఆ సింహాసనాన్ని దక్కించుకుంటుందో లేదో చూడాలి. ఫ్యామిలీ కార్ గా అలాగే ప్రీమియం లుక్ కోరుకునే వారికి ఈ 2026 హోండా సిటీ ఒక బెస్ట్ ఆప్షన్ కానుంది. మే 22న ఈ కారు ఫుల్ డీటెయిల్స్ తో పాటు ధర కూడా రివీల్ కాబోతోంది.

టాప్ హెడ్ లైన్స్

యమహా బైక్ కొనేవాళ్లకు పండగే! FZ నుంచి R15 వరకు ఆఫర్ల వర్షం.. ఈ రాష్ట్రాల్లో మాత్రం నో ఛాన్స్!
యమహా బైక్‌లు, స్కూటర్లపై పండుగ ఆఫర్లు.. రూ.వేలల్లో బెనిఫిట్స్! కేవలం రూ.2,499 డౌన్‌పేమెంట్
మార్కెట్‌లోకి వచ్చిన మహీంద్రా XUV 3XO కొత్త వెర్షన్‌.. పెట్రోల్ పవర్‌తో CNG SUV - ఫీచర్లు, ధరలు ఇవే!
దసరా కానుకగా Mahindra XUV 3XO CNG లాంచ్‌.. రూ.10 లక్షలకే 25 కి.మీ. మైలేజీ!
Triumph Bonneville 350 ఫీచర్లలో భారీ తేడాలు.. వేరియంట్ల వారీగా ధరలు, ప్రత్యేకతలు ఇవే!
Triumph Bonneville 350లో 3 వేరియంట్లు.. T4, T40, T40 బ్లాక్‌లో ఏది కొనాలి?
2026 Toyota Glanza Faceliftలో అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 విషయాల్లో నిరాశ తప్పదు!
కొత్త టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌లో 4 ప్లస్ పాయింట్లు, 3 మైనస్‌లు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Embed widget