అన్వేషించండి

Upcoming Electric SUVs India :ఒకసారి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్లు దూసుకెళ్లే ఈవీ! భారత్ మార్కెట్‌లోకి ఎప్పుడ వస్తుందంటే?

Upcoming Electric SUVs India :స్టెలాంటీస్, చైనాకు చెందిన లీప్‌మోటార్‌తో జతకట్టి భారత ఎలక్ట్రిక్‌ వాహన మార్కెట్‌లోకి ప్రవేశిస్తోంది. 2026 చివరి నాటికి టీ03, సీ10, బీ 10 వంటి ఈవీలను లాంచ్ చేయనుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • స్టెల్లాంటిస్ లీప్ మోటార్‌తో కలిసి భారత్‌లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకురానుంది.
  • లీప్ మోటార్ T03, C10, B10 మోడళ్లతో మార్కెట్లోకి ప్రవేశించనుంది.
  • C10 మోడల్ 800V ఆర్కిటెక్చర్‌తో వేగవంతమైన ఛార్జింగ్‌ను అందిస్తుంది.
  • వాహనాలు CKD కిట్‌లుగా దిగుమతి అయ్యి, మహారాష్ట్రలో అసెంబుల్ చేయబడతాయి.

Upcoming Electric SUVs India : భారత్ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం శరవేగంగా పెరుగుతోంది. టాటా మోటా్స్, మహీంద్రా వంటి స్వదేశీ దిగ్గాలతో పాటు హ్యుందాయ్‌, ఎంజీ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ రేసులో ఉన్నాయి.  ఈ క్రమంలో గ్లోబల్‌ ఆటోమొబైల్‌ దిగ్గం స్టెల్లాంటిస్‌ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే భారత మార్కెట్‌లో జీప్‌, సిట్రోయస్‌ వంటి బ్రాండ్లతో గుర్తింపు పొందిన స్టెల్లాంటిస్‌, ఇప్పుడు తన ఎలక్ట్రిక్‌ అమ్ముల పొది నుంచి లీప్ మోటార్ అనే కొత్త బ్రాండ్‌ను పరిచయం చేస్తోంది. 

లీప్‌మోటార్, స్టెల్లాంటిస్‌ మధ్య ఒప్పందం

లీప్‌మోటార్ ఇంటర్నేషనల్ అనేది స్టెల్లాంటిస్‌, చైనాకు చెందిన లీప్‌మోటార్‌ సంస్థల మధ్య కుదిరిన అంగీకార ఒప్పందం. ఈ జాయింట్ వెంచ్‌లో స్టెల్లాంటీస్‌ 51 శాతం వాటతో పూర్తి నిర్వహణ నియంత్రణను కలిగి ఉంది. చైనా వెలుపల ఈ ఈవీలను తయారు చేయడానికి ఎగుమతి చేయడానికి, విక్రయించడానికి స్టెల్లాంటిస్‌కు పూర్తి హక్కులు ఉన్నాయి. అందుకే లీప్ మోటార్ టెక్నాలజీని వాడుకుంటోంది. తనకు ఉన్న అతి పెద్ద నెట్‌వర్క్‌ను ఉపయోగించుకొని మార్కెట్‌ను పెంచుకుంటూ ఉంది. ఈ వ్యూహాత్మక వ్యాపారంలో భాగంగా ఇప్పుడు భారత్ మార్కెట్‌లో పెరుగుతున్న ఈవీలపై ఫోకస్ చేసింది. ఇక్కడ పట్టు పెంచుకోవాలని ఉద్దేశంతో ఈ ఏడాది చివరి నాటికి లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఈవీలను మార్కెట్‌లోకి తీసుకొని రానుంది. 

Also Read: వచ్చే ఏడాది మార్కెట్లోకి కొత్త హ్యుందాయ్ క్రెటా నెక్ట్స్ జనరేషన్.. స్పై షాట్‌లలో ప్రీమియం లుక్

భారత్ మార్కెట్‌లోకి ప్రధానంగా మూడు మోడళ్లతో రానుందీ లీప్‌ మోటర్‌. ఇందులో దాదాపు అన్నింటిలో కూడా ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న వాటి కంటే ఎక్కువ టెక్నాలజీతో  దూసుకొస్తున్నాయి. మైలేజీ విషయంలో కూడా ఒక మెట్టు పైనే ఉంటాయి. అన్ని రకాలుగా మార్కెట్‌ను షేక్ ఉద్దేశంతోనే ఉందీ లీప్‌మోటార్. 

లీప్‌మోటార్‌ టీ03: 

ఇది లీప్‌మోటార్ లైనప్‌లో అత్యంత రీజనబుల్‌, చిన్న ఈవీ. చైనాలో ఇప్పటికే విజయవంతమైన ఈ మోడల్ భారత్ మార్కెట్‌లో టాటా పంచ్ ఈవీకి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో లెవల్‌ 2 అడాస్‌, సన్‌రూఫ్‌, పెద్ద టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. 

Also Read: కారు మెయింటెనెన్స్‌లో ఈ టిప్స్ పాటిస్తే మీ జేబుకు చిల్లు పడదు.. భారీ రిపేర్ ఖర్చుల నుంచి తప్పించుకోవడానికి సింపుల్ గైడ్!

గ్లోబల్‌ మార్కెట్‌లో ఇది 319 kWh, 41.3 kWh బ్యాటరీ ప్యాక్‌లతో లభిస్తుంది. ఇవి వరుసగా 310కిలోమీటర్లు, 403 కిలోమీటర్లు రేంజ్‌ను అందిస్తాయి. చైనాలో దీని ప్రారంభ ధర సుమారు 7.8 లక్షలు. భారత్‌లో కూడా ఇదే తరహా ధర ఉంటే ఇది సామాన్యులకు అందుబాటులో ఉండే బెస్ట్‌ ఈవీ అవుతుంది. 

లీప్‌మోటార్‌ సీ10

ఇది ఒక ప్రీమియం ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ, ఇది హ్యుందాయ్‌ క్రెటా ఈవీల, మారుతి ఇ- విటారా, టాటా సియెరా ఈవీ మోడళ్లతో తలపడనుంది. ఇది 800V హై వోల్టేజ్‌ ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి డిజైన్ చేశారు. దీని వల్ల కేవలం 16 నిమిషాల్లో 30 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ అవుతుంది. 74.9kWh బ్యాటరీ ప్యాక్‌తో 605 కిలోమీటర్ల రేంజ్‌ను ఇది అందిస్తుంది. దీని మోటార్‌ 295 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల కేవలం 5.9 సెకన్లోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 

లీప్‌మోటార్‌ బీ10

ఇది కాంపాక్ట్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రాబోతోంది. లీప్‌ 3.5 మాడ్యులర్‌ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి రూపొందించిన ఈ కారులో 510 కిలోమీటర్ల నుంచి 600 కిలోమీటర్ల రేంజ్‌ ఇచ్చే బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో 360 డిగ్రీల కెమెరా, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, 12 స్పీకర్ల ఆడియో సిస్టమ్‌ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. 

త్వరలో విడిభాగాలా ప్లాంట్‌

స్టెల్లాంటిస్ తన లీప్ మోటార్ వాహనాలను తొలుత కంప్లీట్లీ నాక్డ్‌ డౌన్ కిట్ల రూపంలో దిగుమతి చేసుకుంటుంది. తర్వాత మహారాష్ట్రలోని రంజన్‌గావ్ ప్లాంట్‌లో అసెంబ్లీ చేస్తారు. దీని వల్ల దిగుమతి సుంకాలు తగ్గి, కారు ధరను అదుపులో ఉంచుకోవడానికి వీలు ఉంటుంది. భవిష్యత్‌లో డిమాండ్‌ను బట్టి విడిభాగాల తయారీని కూడా భారత్‌లో చేపట్టే ఛాన్స్ ఉంది. 

Also Read: దళపతి విజయ్ ద‌గ్గ‌ర‌ కోట్లు విలువ చేసే లగ్జరీ రైడ్స్ నుంచి సాదాసీదా స్విఫ్ట్ వరకు!

లీప్ మోటార్ తన సొంత షోరూమ్‌లను ఏర్పాటు చేయడం కంటే ముందు స్టెల్లాంటిస్ గ్రూప్‌న కు చెందిన జీప్, సిట్రోయెన్ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోనుంది. దీని వల్ల కస్టమర్లకు సర్వీసింగ్, సేల్స్ పరంగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది. 

Frequently Asked Questions

భారత మార్కెట్లోకి స్టెల్లాంటిస్ ఏ కొత్త బ్రాండ్‌ను పరిచయం చేస్తోంది?

స్టెల్లాంటిస్, లీప్ మోటార్ అనే కొత్త ఎలక్ట్రిక్ వాహనాల బ్రాండ్‌ను భారత మార్కెట్లోకి పరిచయం చేస్తోంది. ఇది చైనాకు చెందిన లీప్ మోటార్ సంస్థతో జాయింట్ వెంచర్.

లీప్ మోటార్ వాహనాలు ఎప్పుడు మార్కెట్లోకి వస్తాయి?

ఈ ఏడాది చివరి నాటికి లీప్ మోటార్ లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రిక్ వాహనాలను భారత మార్కెట్లోకి తీసుకురానుంది.

లీప్ మోటార్ నుండి భారత మార్కెట్లోకి వస్తున్న ముఖ్యమైన మోడల్స్ ఏవి?

భారత్ మార్కెట్లోకి లీప్ మోటార్ ప్రధానంగా మూడు మోడళ్లతో రానుంది: లీప్ మోటార్ టీ03, లీప్ మోటార్ సీ10, మరియు లీప్ మోటార్ బీ10.

లీప్ మోటార్ టీ03 వాహనం భారత మార్కెట్లో ఏ కారుకు పోటీ ఇవ్వనుంది?

లీప్ మోటార్ టీ03, టాటా పంచ్ ఈవీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇది చిన్న, సరసమైన ఎలక్ట్రిక్ వాహనం.

టాప్ హెడ్ లైన్స్

సరికొత్తగా మార్కెట్లోకి Skoda Slavia Facelift.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే.. ఫీచర్ల వివరాలు
సరికొత్తగా మార్కెట్లోకి Skoda Slavia Facelift.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే.. ఫీచర్ల వివరాలు
బజాజ్ చేతక్ EVని ఇంటికి తెచ్చుకోవడానికి లోన్‌ ఫెసిలిటీ.. కనీస డౌన్‌పేమెంట్‌, EMI పూర్తి వివరాలు
Bajaj Chetak C2501 ఎలక్ట్రిక్ స్కూటర్‌.. నెలకు కేవలం రూ.1500 EMIతో మీ సొంతం!
చలికాలంలో కారు తీసుకుని బయటకు వెళ్తున్నారా? ఈ 5 యాక్సెసరీస్ ఉంటే టెన్షన్ ఉండదు!
ఈ చలికాలంలో కారు డ్రైవింగ్ సేఫ్‌గా సాగాలంటే.. ఈ 5 యాక్సెసరీస్ తప్పనిసరి!
గూగుల్‌ మ్యాప్స్‌ మిర్రరింగ్‌ ఉన్న 8 బైక్‌లు.. పూర్తిగా కొత్త ప్రదేశంలోనూ ఈజీగా దారి తెలుసుకోవచ్చు!
బైక్‌ స్కీన్‌పైనే గూగుల్‌ మ్యాప్‌ కనిపిస్తుంది.. ధర కేవలం రూ.1 లక్షల నుంచి స్టార్ట్‌!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
8th Pay Commission: 8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
Dada Rules Delhi: ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Embed widget