అన్వేషించండి

Honda ZR-V India: ఫుల్‌ట్యాంక్ చేస్తే 1000 కిలోమీటర్ల దూసుకెళ్లే హోండా కారు! అదిరిపోయే ప్రీమియం ఫీచర్లతో భారత్ మార్కెట్‌లోకి...!

Honda ZR-V India: ప్రముఖ జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా, మే 22న తన ప్రీమియం ఎస్‌యూవీ ZR-Vని భారత్‌లో విడుదల చేయబోతోంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హోండా ZR-V ప్రీమియం SUV మే 22న భారత మార్కెట్లోకి విడుదల.
  • సివిక్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన ఈ కారు హైబ్రిడ్ వెర్షన్‌లో లభ్యం.
  • ADAS, పనోరమిక్ సన్‌రూఫ్, బాస్ ఆడియో వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.
  • లక్షలు, BMW X1, టైరాన్‌తో పోటీ పడనుంది.

Honda ZR-V India: భారత్ ఆటోమొబైల్ రంగంలో ఒకప్పుడు అకార్డ్, సివిక్, సీఆర్‌ వీ వంటి మోడల్లతో ప్రీమియం సెగ్మెంట్‌లో రారాజుగా వెలిగిన హోండా, మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ  పొందిన ZR-V ఎస్‌యూవీ భారత్ మార్కెట్‌లోకి ప్రవేశపెడుతోంది. ఇది కేవంం ఒక కొత్త కారు లాంచ్ మాత్రమే కాదు. భారత్ మార్కెట్‌లో హోండా విలాసవంతమైన బ్రాండ్ ఇమేజ్‌ను మళ్లీ నిలబెట్టే ఒక వ్యూహాత్మక అడుగు. 

హోండా తన సరికొత్త ప్రీమియం ఎస్‌యూవీ ZR-V మే 22వ తేదీన అధికారికంగా భారత మార్కెట్‌లో విడుదల చేయనున్నట్టు ధ్రువీకరంచింది. చాలా కాలం హోండా అభిమానులు ఎదురు చూస్తున్న ఈ లాంచ్‌, భారత్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కొత్త ప్రకంపనలు సృష్టించబోతోంది. 

ZR-V అంటే ఏంటీ? ప్రత్యేకతలు ఏం ఉన్నాయి?

ZR-V ప్రీమియం 5 సీటర్ ఎస్‌యూవీ ఇది విదేశాల్లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. ఈ కారు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హోండా సివిక్‌ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. భారత్‌లో ప్రస్తుతం సివిక్ అమ్మకాలు లేకపోయినా, దాని  ఇంజినీరింగ్, డ్రైవింగ్ డైనమిక్స్‌ను ZR-V ద్వారా వినియోగదారులు అనుభవించవచ్చు. 

హోండా ఈ కారును సీబీయూ రూట్ ద్వారా అంటే విదేశాల నుంచి నేరుగా దిగుమతి చేసుకొని భారత్‌లో విక్రయించనుంది. దీని వల్ల తయారీ నాణ్యత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. తొలుత పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ కార్లను విక్రయించే అవకాశం ఉంది, తద్వారా హోండా తన హాలో మోడల్‌ వ్యూహాన్ని అమలు చేస్తోంది. 

పవర్ ట్రైన్, అద్భుతమైన మైలేజీ 

భారత్‌కు వచ్చే ZR-V కేవలం హైబ్రిడ్‌ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇది దాదాపు 180bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో అత్యంత ఆకర్షణీయమైన అంశం దాని మైలేజ్‌. ఒకసారి ట్యాంక్ ఫుల్ చేస్తే దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంటోంది. సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారికి ఇది గొప్ప వరం కానుంది. 

లగ్జరీ ఫీచర్ల సమాహారం 

ప్రీమియం సెగ్మెంట్‌లో పోటీ పడుతున్నందున, హోండాZR-Vలో అత్యాధునిక ఫీచర్లను పొందుపరిచింది. క్యాబిన్ విశాలంగా కనిపించేలా దీనికి ఉన్న పనోరమిక్ సన్‌రూఫ్‌ చేస్తుంది. భద్రత కోసం అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్‌ టెక్నాలజీ అడాస్  అప్‌డేట్ చేశారు. 12 స్పీకర్లతో కూడిన ప్రీమియం సౌండ్‌ అనుభవం ఇచ్చే బాస్ ఆడియో సిస్టమ్‌ ఉంది. సౌకర్యవంతమైన డ్రైవింగ్ కోసం లెదర్ హీటెడ్‌ స్టీరింగ్ వీల్, పవర్డ్‌ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. పవర్డ్ టెయిల్ గేట్‌ కారణంగా డిక్కీని సులభంగా ఓపెన్ చేయవచ్చు. ఆధునిక, ఆకర్షణీయమై లుక్ కోసం పూర్తి ఎల్‌ఈడీ సెటప్ ఉంది. 

గత కొన్నేళ్లుగా హోండా ఇండియా కేవలం మిడ్ సైజ్ ఎస్‌యూవీ, సెడాన్ సెగ్మెంట్‌లకే పరిమితమైంది. అకార్డ్, సీఆర్‌వీ వంటి మోడళ్లు నిలిపివేయడంతో ప్రీమియం కస్టమర్లను హోండా కోల్పోయింది. ఇప్పుడు ZR-Vని ఒక హోలో మోడల్‌గా తీసుకురావడం ద్వారా తన బ్రాండ్ వాల్యూను మళ్లీ పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఇది విజయవంతమైతే భవిష్యత్‌లో హోండా తన గ్లోబల్ రేంజ్‌ నుంచి మరిన్ని అంతర్జాతీయ మోడళ్లను భారత్‌కు తీసుకువచ్చే అవకాశం ఉంది. 

ఎవరితో పోటీ 

ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ZR-Vకి గట్టి పోటీ ఎదురుకానుంది. స్కోడా కోడియాక్, BMW X1, వోక్స్ వ్యాగన్ టైరాన్‌తో గట్టి పోటీ ఉంటుంది. CBU రూట్‌లో దిగుమతి కావడం వల్ల దీని ధర కొంత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ప్రారంభ ధర రూ. 45 లక్షలు ఉండవచ్చని, టాప్ ఎండ్‌ వేరియంట్‌ ధర 50 లక్షల  వరకు ఉండవచ్చని అంచనా. 

Frequently Asked Questions

హోండా ZR-V ఎప్పుడు విడుదల అవుతుంది?

హోండా ZR-V మే 22న అధికారికంగా భారత మార్కెట్లో విడుదల కానుంది. ఇది హోండా అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న లాంచ్.

ZR-V ప్రత్యేకతలు ఏమిటి?

ZR-V ఒక ప్రీమియం 5-సీటర్ SUV, ఇది హోండా సివిక్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన మోడల్.

ZR-V ఏ ఇంజిన్‌తో వస్తుంది?

భారతదేశంలో ZR-V కేవలం హైబ్రిడ్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది సుమారు 180bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు సుమారు 1000 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

ZR-V లో ఎలాంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి?

ZR-V లో పనోరమిక్ సన్‌రూఫ్, ADAS, 12-స్పీకర్ బాస్ ఆడియో సిస్టమ్, లెదర్ హీటెడ్ స్టీరింగ్ వీల్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ టెయిల్ గేట్ మరియు ఫుల్ LED లైటింగ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

ZR-V ధర ఎంత ఉండవచ్చు?

ZR-V CBU రూట్ ద్వారా దిగుమతి చేయబడుతుంది, కాబట్టి ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రారంభ ధర సుమారు రూ. 45 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 50 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.

టాప్ హెడ్ లైన్స్

కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
ఖరీదైన కార్లలోనే ADAS ఉంటుందని అనుకుంటున్నారా? మీ బడ్జెట్‌లోనే అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు
ఖరీదైన కార్లకు దీటుగా ADAS ఉన్న 'బడ్జెట్‌ కార్లు'.. రూ.9.39 లక్షలకే సొంతం చేసుకోవచ్చు!
Best selling car: దేశవ్యాప్తంగా జనం ఈ కారు కోసం షోరూమ్‌ ముందు క్యూ కట్టారు, మీ బడ్జెట్‌లోనే వస్తుంది!September 2026 best selling cars in India Maruti Baleno price
సేల్స్‌లో దేశంలోనే నంబర్ 1 ఈ మారుతి కారు.. ధర రూ.6 లక్షల లోపే!
ఎలక్ట్రిక్ కార్లతో జర జాగ్రత్త.. చిన్న పొరపాటుతో భారీ ప్రమాదం! EV వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన భద్రత సూచనలు!
విజయవాడలో నలుగురి ప్రాణాలు తీసిన EV ప్రమాదం! ఎలక్ట్రిక్ కార్లలో మంటలు రాకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget