అన్వేషించండి

EV బ్యాటరీ అయిపోతే కారు ఆగిపోతుందా? Turtle Mode ద్వారా కలిగే ప్రయోజనాలు తెలుసా..

ఒక ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతున్నప్పుడు ఆ కారు మొదట డ్రైవర్‌కు హెచ్చరికలను జారీ చేయడం ప్రారంభిస్తుంది. అదే టైంలో ఆ కారు Turtle Mode లోకి వస్తుంది. ఈ ఫీచర్ పనితీరు ఇక్కడ తెలుసుకోండి.

Electric Car Battery Tips | ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల వాడకం భారత్‌లోనూ వేగంగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల నుండి ఉపశమనం కోసం, తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి EVలను కొనుగోలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఈవీలపై రాయితీలు ఇస్తున్నాయి. అయితే చాలా మంది మనసులో ఒక ప్రశ్న ఖచ్చితంగా మెదలుతుంది. ఒకవేళ ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ పూర్తిగా అయిపోయి మీ డిస్‌ప్లేపై 0 శాతం అని కనిపిస్తే ఏం జరుగుతుంది? కారు వెంటనే ఆగిపోతుందా లేక కొంత దూరం వరకు వెళ్తుందా అని సందేహాలు ఉంటాయి. బ్యాటరీ అయిపోయే సమయంలో ఉపయోగపడే ఒక ప్రత్యేక ఫీచర్ గురించి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. దానినే టర్టిల్ మోడ్ (Turtle Mode) అని అంటారు. ఎలక్ట్రిక్ కార్లు అకస్మాత్తుగా ఆగిపోకుండా ఈ ఫీచర్ వాహనదారులకు హెల్ప్ చేస్తుంది. 

ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ చాలా తక్కువగా ఉన్నప్పుడు, మొదట కారు డ్రైవర్‌కు రెగ్యూలర్‌గా వార్నింగ్ ఇస్తుంది. స్క్రీన్‌పై 'Low Battery' మెసేజ్ రావడంతో పాటు, పలు కార్లలో అలర్ట్ సౌండ్ కూడా వినిపిస్తుంది. సాధారణంగా 15 నుంచి 20 శాతం బ్యాటరీ మిగిలి ఉన్నప్పుడు, కారు దగ్గరలోని ఛార్జింగ్ స్టేషన్‌ను చూసుకోవాలిన డ్రైవర్‌కు సూచిస్తుంది. బ్యాటరీ ఇంకా తగ్గుతున్న కొద్దీ, కారు తన పవర్‌ను ఆదా చేసుకోవడానికి కొన్ని ఫీచర్లను లిమిట్ చేయడం ప్రారంభిస్తుంది.

టర్టిల్ మోడ్ ఎలా పనిచేస్తుంది?
బ్యాటరీ అత్యంత తక్కువ స్థాయికి చేరుకున్నప్పుడు, EV టర్టిల్ మోడ్‌ (Turtle Mode) లోకి వెళ్తుంది. ఈ సమయంలో చాలా కార్ల స్క్రీన్‌లపై తాబేలు గుర్తు కనిపిస్తుంది. కనుక దీనికి టర్టిల్ పేరు వచ్చింది. ఈ మోడ్‌లో కారు వేగం, పవర్ ఒక్కసారిగా తగ్గుతాయి. దాంతో మిగిలి ఉన్న బ్యాటరీ ఎక్కువ సేపు వస్తుంది. కారు కొంచెం స్లోగా వెళ్తుంది. యాక్సిలరేషన్ కూడా చాలా తగ్గిపోతుంది. పలు  సందర్భాల్లో AC, క్లైమేట్ కంట్రోల్, ఇతర అనవసరమైన ఫీచర్లు ఆగిపోతాయి లేదా కంట్రోల్ అవుతాయి.  డ్రైవర్ ఏదైనా సురక్షిత ప్రాంతానికి లేదా దగ్గరలోని ఛార్జింగ్ స్టేషన్‌కు చేరుకోవాలని సూచించడమే దీని ఉద్దేశ్యం.

బ్యాటరీ అయిపోతే EV ఎలా నడుస్తుంది.. 
ఆసక్తికరమైన విషయం ఏంటంటే, చాలా ఎలక్ట్రిక్ కార్లలో బ్యాటరీ 0 శాతం అని కనిపించిన తర్వాత కూడా కొద్దిపాటి బ్యాటరీ రిజర్వ్‌లో ఉంటుంది. బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ కాకుండా కాపాడటానికి కంపెనీలు ఒక హిడెన్ బఫర్ (Hidden Buffer)ను ఉంచుతాయి. దీనివల్ల కొన్ని EVలు 0 శాతం ఇండికేట్ చేసిన తర్వాత కూడా కొన్ని కిలోమీటర్ల వరకు వెళ్తాయి. అయితే ఈ దూరం కారు, వాతావరణం, వేగం, రోడ్డు కండీషన్లపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా EVలు 5 నుండి 15 మైళ్లు, అంటే దాదాపు 8 నుండి 24 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు.

ఒకవేళ డ్రైవర్ సరైన సమయంలో ఛార్జింగ్ స్టేషన్‌కు తీసుకెళ్లకపోతే, బ్యాటరీ పూర్తిగా అయిపోతే కారు క్రమంగా నిలిచిపోతుంది. ఆ తర్వాత కారు నడపలేరు. అయితే హజార్డ్ లైట్లు, డోర్ లాక్, స్క్రీన్ వంటి కొన్ని బేసిక్ సిస్టమ్స్ మాత్రం కొద్దిసేపు పనిచేస్తాయి. ఎందుకంటే అవి విడిగా ఉండే 12 వోల్ట్ బ్యాటరీతో పనిచేస్తాయి. 

అలాంటి పరిస్థితిలో కారును తప్పనిసరిగా ఛార్జింగ్ చేయాలి. కొన్నిసార్లు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, సాధారణ పెట్రోల్ లేదా డీజిల్ కార్ల మాదిరిగా EVలను నేరుగా టో (Tow) చేసి తీసుకెళ్లకూడదు. చాలా ఎలక్ట్రిక్ కార్లను ఫ్లాట్‌బెడ్ ట్రక్కుపైనే తీసుకెళ్లాలి. తప్పుడు పద్ధతిలో టో చేయడం వల్ల ఎలక్ట్రిక్ మోటారు దెబ్బతినే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Politics Personal Attacks: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Samson Storm Reply: వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Black Coffee for Weight Loss : బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
Embed widget