అన్వేషించండి

Car Maintenance Tips: వేసవిలో CNG కార్లను నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం తప్పదు.. ఈ విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి

CNG Car Maintenance: వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల CNG వ్యవస్థపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. చిన్న నిర్లక్ష్యం ప్రమాదానికి దారితీస్తుంది.

Car Maintenance Tips in Summer | వేసవి కాలంలో మనుషులకు మాత్రమే కాదు, వాహనాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. వెహికల్ సేఫ్టీ, నిర్వహణ ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ముఖ్యంగా సీఎన్‌జీ (CNG) కార్ల విషయంలో కొన్ని విషయాలు పాటించాలి. సీఎన్‌జి కార్లు ఒకవైపు పెట్రోల్-డీజిల్ వాహనాలతో పోలిస్తే చౌకగా, పొదుపుగా ఉన్నప్పటికీ, మరోవైపు ఈ వాహనాల విషయంలో సమ్మర్‌లో  సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.  వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల సిఎన్‌జి వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. కనుక మీరు అజాగ్రత్తగా ఉంటే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అందుకే సీఎన్‌జి కార్లు నడిపేవారు వాహనం సురక్షితంగా ఉండాలంటే, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ విషయాలను గమనించి నడుచుకోవాలి..
వేసవి కాలంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, సిఎన్‌జి ట్యాంక్‌ను ఎప్పుడూ పూర్తిగా (Full) నింపవద్దు. అధిక వేడి వల్ల గ్యాస్ విస్తరించినట్లు అనిపిస్తుంది. కనుక ట్యాంక్‌లో కొంత ఖాళీ స్థలం వదలడం సురక్షితంగా భావిస్తారు.  దీనివల్ల ట్యాంక్ లోపల ఒత్తిడి పెరిగినా ఖాళీ ఉండటంతో బ్యాలెన్స్ అవుతుంది. లీకేజీ లేదా ఇతర ప్రమాదాల భయం తగ్గుతుంది. అంతేకాకుండా, కారును ఎల్లప్పుడూ నీడలో పార్క్ చేసేలా చూసుకోండి. డైరెక్ట్‌గా ఎండ తగిలితే, డోర్ క్లోజ్ చేసి ఉంటుంది కనుక కారు లోపల ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. ఇది సిఎన్‌జి వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

చిన్న అజాగ్రత్త వల్ల ప్రమాదాలు జరగవచ్చు 
సీఎన్‌జీ కారు సేఫ్టీ కోసం దానిని ఎప్పటికప్పుడు చెక్ చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా సిఎన్‌జి పైప్‌లైన్, ఫిట్టింగ్‌లు, ట్యాంక్‌ను టైం టు టైం తప్పకుండా సర్వీసింగ్ చేయించాలి. ఎక్కడైనా గ్యాస్ వాసన వచ్చినా లేదా లీకేజీ ఉందని అనుమానం కలిగినా వెంటనే సర్వీస్ సెంటర్‌కు వెళ్లి చెక్ చేయించాలి. ఇలాంటి చిన్న అజాగ్రత్తలు కూడా పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చు. కనుక దేనిని ఈజీగా తీసుకోకూడదు.

దీనితో పాటు సీఎన్‌జి ట్యాంక్‌కు ఎప్పటికప్పుడు హైడ్రో టెస్ట్ చేయించడం కూడా అవసరం. ఈ టెస్ట్ ట్యాంక్ పవర్,  భద్రతను చెక్ చేస్తుంది. చాలా కాలంగా ఈ పరీక్ష చేయించకపోతే, ప్రమాదాలను నివారించడానికి వీలైనంత త్వరగా చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సమ్మర్ సీజన్ కనుక ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందుకే ఏ రకం వాహనం అయినా, ఈ సీజన్లో వాటిని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయకపోతే ఇబ్బందులు తప్పవు.

ఇంజిన్ గురించి జాగ్రత్తలు తీసుకోవాలి
ఇంజిన్ పనితీరును మెరుగుపరచడానికి ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్‌లను శుభ్రం చేయడం, సమయానికి మార్చడం చాలా అవసరం. మురికిగా ఉన్న ఫిల్టర్లు లేదా పాడైపోయిన స్పార్క్ ప్లగ్‌ల వల్ల మైలేజీ తగ్గడమే కాకుండా, ఇంజిన్‌పై ఎక్కువ ప్రెషర్ పడుతుంది. దీంతో పాటు కారు సురక్షితంగా, సాఫీగా నడవడానికి టైర్లలో సరైన గాలి ఒత్తిడిని మెయింటైన్ చేయాలి.  అలాగే, కారును ఎల్లప్పుడూ కేవలం సీఎన్‌జి మోడ్‌లోనే నడపకుండా, అప్పుడప్పుడు పెట్రోల్ మోడ్‌ను కూడా ఉపయోగించాలి. దీనివల్ల ఇంజిన్ లైఫ్ టైం మెరుగుపడుతుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Bonneville T40 తో పాటు ట్రయంఫ్ నుంచి 3 కొత్త బైక్‌లు.. 798cc భారీ ఇంజిన్‌తో స్ట్రీట్ ట్రిపుల్ బైక్‌
798cc ఇంజిన్‌తో కొత్త Triumph Street Triple 798 బైక్‌.. Tiger 900, Tiger 1200 బైకుల్లో రాడార్‌ టెక్నాలజీ!
350cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 లాంచ్.. 5 రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్‌తో అదుర్స్!
యూత్‌ కోసం ట్రయంఫ్ బొన్నెవిల్ T40 వచ్చేసింది.. ఈ బైక్‌లో చాలా స్పెషల్స్ గురూ!
Honda Elevate Facelift కొత్త లుక్‌ అదిరిపోయింది.. కేవలం ₹21,000తో బుక్‌ చేసుకోవచ్చు
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌.. ధర రూ.11.80 లక్షలు.. కొత్తగా వచ్చిన మార్పులు ఇవే!
టాటా ఏరిస్ iCNG కొనబోతున్నారా? ముందు ఈ 2 మైనస్‌ల గురించి తప్పక తెలుసుకోండి
Tata Aeris CNG కారు కొనొచ్చా, లేదా? ప్లస్‌లు, మైనస్‌లు తెలిస్తే నిర్ణయం ఈజీ

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Hair Transplant : హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
Shreyas Iyer Breaks Virat Kohli Record: కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ .. తొలి టీ20లో మెరుపు సెంచరీతో సరికొత్త చరిత్ర
కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ .. తొలి టీ20లో మెరుపు సెంచరీతో సరికొత్త చరిత్ర
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Embed widget