అన్వేషించండి

Raveena Tandon First Sports Car: బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఫస్ట్ స్పోర్ట్స్ కార్.. 18 ఏళ్లకే అరుదైన రికార్డ్! అప్పట్లోనే ఆ రేంజ్ క్రేజ్

బాలీవుడ్ అలనాటి స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ తన 18వ ఏట కొనుగోలు చేసిన మొదటి స్పోర్ట్స్ కార్ మాజ్డా మియాటా ఫోటోను షేర్ చేశారు. ఈ ఐకానిక్ కన్వర్టిబుల్ కార్ విశేషాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Raveena Tandon First Sports Car Mazda Miata: బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసిన ఒక త్రోబ్యాక్ పిక్చర్ ఇప్పుడు ఆటోమొబైల్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా సెలబ్రిటీలు లగ్జరీ కార్లు కొనడం ఇప్పుడు సర్వసాధారణం, కానీ 1990ల కాలంలోనే ఒక హీరోయిన్ స్పోర్ట్స్ కార్ ను సొంతం చేసుకోవడం అంటే అది విశేషమే. రవీనా షేర్ చేసిన ఫోటోలో ఆమె తెల్లటి టాప్ ధరించి, తన స్నేహితులతో కలిసి ఎరుపు రంగు మాజ్డా మియాటా పక్కన నిలబడి ఉన్నారు. ఆ వయసులో తన సంపాదనతో కొనుగోలు చేసిన ఈ కన్వర్టిబుల్ కార్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్.

మొదటి కారు మారుతి 800..
నిజానికి రవీనా టాండన్ కొన్న మొదటి కారు మాజ్డా మియాటా కాదు. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆమె తన కార్ల ముచ్చట్లు చెబుతూ, కెరీర్ మొదట్లో తాను కొన్న మొదటి కారు మారుతి సుజుకి 800 అని చెప్పారు. ఆ కాలంలో భారతీయులందరి కలల కారుగా ఉన్న మారుతి 800 రవీనాకు కూడా మొదటి వాహనం కావడం విశేషం. ఆ తర్వాత తన ఎదుగుదలకు గుర్తుగా ఈ లగ్జరీ స్పోర్ట్స్ కార్ ను ఆమె తన గ్యారేజీలోకి తెచ్చుకున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Saurabh Pawar (@saurabh.kmph)

మాజ్డా మియాటా స్పెషాలిటీ ఏంటి?
ఆటోమొబైల్ చరిత్రలో మాజ్డా మియాటాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 1989లో చికాగో ఆటో షోలో మొదటిసారిగా పరిచయమైన ఈ కారును జపనీస్ ఫిలాసఫీ అయిన "జింబా ఇట్టాయ్" ఆధారంగా రూపొందించారు. అంటే గుర్రం, స్వారీ చేసే వ్యక్తి ఎలాగైతే ఒకరినొకరు అర్థం చేసుకుంటారో, అలాగే డ్రైవర్ కు కారుకు మధ్య ఒక అవినాభావ సంబంధం ఉండాలనేది దీని అర్థం. అందుకే ఈ కారును నడిపేవారు ఒక గొప్ప అనుభూతిని పొందుతారు. బ్రిటీష్ క్లాసిక్ రోడ్‌స్టర్ల నుండి స్ఫూర్తి పొంది తయారు చేసిన ఈ కారుకు ఉన్న పాప్-అప్ హెడ్ లైట్లు అప్పట్లో ఒక క్రేజీ ఫీచర్.

పవర్ ఫుల్ ఇంజిన్ - షార్ప్ పెర్ఫార్మెన్స్..
తొలినాళ్లలో వచ్చిన మాజ్డా మియాటా మోడళ్లలో 1.6 లీటర్ ఇంజిన్ ఉండేది. ఇది 115 హెచ్‌పి పవర్ ను ప్రొడ్యూస్ చేస్తూ, ఫైవ్-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వచ్చేది. లైట్ వెయిట్ డిజైన్ వల్ల ఈ కారు రోడ్లపై చాలా స్పీడ్ గా దూసుకుపోయేది. ఆ తర్వాత 1994లో దీనికి మరింత పవర్ ఫుల్ 1.8 లీటర్ ఇంజిన్ ను జత చేశారు. ఇది 130 హెచ్‌పి పవర్ ను ఇస్తూ, మెరుగైన బ్రేకింగ్ సిస్టమ్ తో కస్టమర్లను మెప్పించింది. కేవలం స్పీడ్ మాత్రమే కాదు, కారు హ్యాండ్లింగ్ కూడా చాలా స్పోర్టీగా ఉండటం వల్ల డ్రైవింగ్ చేసే వారికి ఎంతో కిక్ ఇచ్చేది.

చాలామంది స్పోర్ట్స్ కార్లను కొన్న కొద్దిరోజులకే మార్చేస్తుంటారు. కానీ మాజ్డా మియాటా విషయంలో మాత్రం యజమానులు దాన్ని ఏళ్ల తరబడి తమ దగ్గరే ఉంచుకుంటారని సర్వేలు చెబుతున్నాయి. రవీనా టాండన్ కూడా తన ఫోటో ద్వారా ఆ కారుతో తనకు ఉన్న ఎమోషనల్ బాండ్ ను గుర్తుచేసుకున్నారు. అప్పట్లో రవీనాకు ఉన్న స్టార్ డమ్ కు ఈ కారు ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పాత జ్ఞాపకాలు ఎప్పుడూ అందంగానే ఉంటాయనడానికి ఈ ఫోటోనే ఒక నిదర్శనం. 

టాప్ హెడ్ లైన్స్

Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Embed widget