అన్వేషించండి

Mahindra Bolero Price Hike: మహీంద్రా బొలెరో ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు! క్లాసిక్, నియో మోడళ్లపై ఎఫెక్ట్

మహీంద్రా తన పాపులర్ బొలెరో సిరీస్ ధరలను పెంచింది. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వల్ల వేరియంట్‌ను బట్టి గరిష్టంగా రూ. 26,500 వరకు అదనపు భారం పడనుంది.

Mahindra Bolero Price Hike for Classic Neo and Neo Plus: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన బెస్ట్ సెల్లింగ్ మోడల్ బొలెరో లైనప్‌పై ధరల పెంపును ప్రకటించింది. ఇందులో బొలెరో క్లాసిక్, నియో, నియో ప్లస్ అనే మూడు రకాల మోడళ్లు ఉన్నాయి. సాధారణంగా ట్రావెల్స్ ఆపరేటర్లు, గ్రామీణ వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే ఈ వాహనాల ధరలు పెరగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆధునిక హంగుల కంటే మన్నికకు ప్రాధాన్యత ఇచ్చే వారికి బొలెరో ఎప్పుడూ మొదటి ఛాయిస్‌గా ఉంటుంది. ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల కంపెనీ ఈ భారాన్ని కస్టమర్లపై వేయక తప్పలేదు.

బొలెరో క్లాసిక్ ధరల వివరాలు..
మహీంద్రా బొలెరో క్లాసిక్ మోడల్ బి4, బి6, బి6 (ఓ), బి8 అనే నాలుగు వేరియంట్లలో మార్కెట్లో ఉంది. ఇందులో బేస్ వేరియంట్ బి4 ధరపై కేవలం రూ. 500 మాత్రమే పెంచారు. దీనివల్ల దీని ప్రారంభ ధర రూ. 7.99 లక్షల వద్దే స్థిరంగా ఉంది. అయితే బి6 వేరియంట్ పై రూ. 25,500 పెరగ్గా, బి6 (ఓ) వేరియంట్ పై అత్యధికంగా రూ. 26,500 భారం పడింది. టాప్ ఎండ్ వెర్షన్ బి8 ధర రూ. 21,500 పెరిగి ఇప్పుడు రూ. 9.90 లక్షలకు చేరింది. ఈ మోడళ్లన్నీ పాత 1.5 లీటర్ ఎంహాక్ 75 డీజిల్ ఇంజిన్‌తో, 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తాయి. కఠినమైన రోడ్లపై కూడా సునాయాసంగా ప్రయాణించే తత్వం ఈ కారు సొంతం.

బొలెరో నియో అప్‌డేట్..
సబ్ 4 మీటర్ సెగ్మెంట్‌లో ఉండే బొలెరో నియోలో మొత్తం ఐదు వేరియంట్లు (N4, N8, N10 (R), N11, N10 (O)) అందుబాటులో ఉన్నాయి. ఎంట్రీ లెవల్ ఎన్4 వేరియంట్ ధర రూ. 15,500 పెరిగింది. మిగిలిన అన్ని వేరియంట్లపై రూ. 5,000 చొప్పున ధరను పెంచారు. ఇందులో 1.5 లీటర్ ఎంహాక్ 100 డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది క్లాసిక్ మోడల్ కంటే ఎక్కువ పవర్ ఇస్తుంది. ప్రస్తుతం దీని ప్రారంభ ధర సుమారు రూ. 8.84 లక్షల నుండి మొదలవుతోంది. సిటీలో తిరగడానికి, హైవేలపై వెళ్లడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎస్‌యూవీ అని చెప్పాలి.

బొలెరో నియో ప్లస్..
ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలుగా ఉండే బొలెరో నియో ప్లస్ మోడల్‌లో పి4, పి10 అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. బేస్ వెర్షన్ పి4 పై రూ. 9,500 పెరగ్గా, పి10 పై రూ. 4,500 అదనంగా పెంచారు. ఈ కారులో స్కార్పియో క్లాసిక్ నుంచి తీసుకున్న పవర్ ఫుల్ 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ అమర్చారు. ఇది ఏడుగురు ప్రయాణించడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ మోడల్ ధరలు రూ. 10.99 లక్షల నుండి రూ. 11.99 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. పెద్ద కుటుంబాలకు, ఎక్కువ లగేజీతో ప్రయాణించే వారికి ఇది ఒక మంచి ఆప్షన్.

మార్కెట్ విశ్లేషణ..
భారతీయ మార్కెట్‌లో లాడర్ ఫ్రేమ్ ఛాసిస్‌తో డీజిల్ ఇంజిన్ ఆప్షన్ ఇచ్చే ఏకైక బ్రాండ్‌గా మహీంద్రా తన ప్రత్యేకతను కాపాడుకుంటోంది. ధరలు పెరిగినప్పటికీ, తక్కువ మెయింటెనెన్స్ తో ఎక్కువ కాలం మన్నే వాహనాల కోసం చూసే వారికి బొలెరో క్లాసిక్ ఇప్పటికీ బెస్ట్ ఛాయిస్. ట్రావెల్స్ నడిపే వారు తమ లాభాలు తగ్గకుండా ఉండాలంటే పాత ధరలు మారకముందే తమ వెహికల్స్ సంఖ్యను పెంచుకోవడం మంచిది. కస్టమర్లకు ఈ ధరల పెంపు కొంచెం ఇబ్బంది కలిగించే విషయమే అయినా, కంపెనీ ఇస్తున్న క్వాలిటీ, సర్వీస్ ముందు ఇది పెద్ద విషయం కాదని విశ్లేషకులు అంటున్నారు. రాబోయే రోజుల్లో మిగతా కార్ల ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

ప్రయాణానికి 'సేఫెస్ట్‌ కారు' అని నిరూపించుకున్న Mahindra XEV 9S.. భారత్ NCAP పరీక్షల్లో '5 స్టార్ సేఫ్టీ రేటింగ్'
మహీంద్రా XEV 9S కారు చాలా సేఫ్‌ గురూ! క్రాష్ టెస్టుల్లో 5 స్టార్ రేటింగ్
VinFast e-scooters: విన్‌ఫాస్ట్ నుంచి 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. భారతీయుల కోసమే ప్రత్యేకంగా తయారీ!
వియత్నాం దేశపు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. ఇండియా కోసమే ప్రత్యేకంగా తయారీ!
Vehicle Insurance: ఇన్సూరెన్స్ లేకుండా టోల్ గేట్‌ దాటుతున్నారా? మీ వాహనం వివరాలు ఈజీగా తెలిసిపోతాయి.. రూ.10 వేల వరకు జరిమానా!
వాహన బీమా లేకుండా టోల్ ప్లాజా దాటితే SMS అలర్ట్.. రూ.10,000 వరకు జరిమానా!
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan: అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
Bellampalli Police Private Party: ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
Bigg Boss Season 10 Today November 17th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
Mitchell Santner Injury: టీమిండియాతో టెస్ట్ సిరీస్ కు ముందు కివీస్ కు ఎదురుదెబ్బ‌.. గాయంతో శాంట్నర్ దూరం, జట్టులోకి డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ఎంట్రీ
టీమిండియాతో టెస్ట్ సిరీస్ కు ముందు కివీస్ కు ఎదురుదెబ్బ‌.. గాయంతో శాంట్నర్ దూరం, జట్టులోకి డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ఎంట్రీ
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Embed widget