అన్వేషించండి

Pagani Hypercars: డబ్బుంటే సరిపోదు.. పగాని కారు కావాలంటే లక్ కూడా ఉండాలి.. ముఖేష్ అంబానీ కూడా కొనలేని కార్ల కథ!

ఇటలీకి చెందిన Pagani Automobili సంస్థ లిమిటెడ్ సంఖ్యలో హైపర్‌కార్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ సంస్థ కారు కొనుగోలు చేయడం కేవలం మనీ మ్యాటర్ మాత్రమే కాదు. అందుకే ముఖేష్ అంబానీ ఫ్యామిలీ వద్ద ఈ కార్లు లేవు.

Mukesh Ambani Family | ప్రపంచ కుబేరులలో ఒకరైన ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబం తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. తమ లగ్జరీ లైఫ్ స్టైల్, కార్యక్రమాల్లో ఆధ్యాత్మికత చాటుతూ పలుమార్లు ప్రజల దృష్టిని ఆకర్షించారు. దాంతో పాట తమ లగ్జరీ కార్ల కలెక్షన్, ఖరీదైన వాచ్‌లతో వార్తల్లో నిలుస్తుంటారు. ముంబైలోని వారి నివాసం యాంటిలియా సైతం ఓ ట్రెండ్ సెట్టర్ లాంటిది. వారి నివాసంలో 170కి పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి. అంబానీ కుటుంబం వద్ద రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII EWB, రోల్స్ రాయిస్ కల్లినన్, ఫెరారీ SF90 స్ట్రాడేల్, మెర్సిడెస్-బెంజ్ S గార్డ్ వంటి అనేక ఖరీదైన కార్లు ఉన్నాయి. వీటి ధర కోట్ల రూపాయలలో ఉంటుంది. ప్రపంచంలోని అనేక లగ్జరీ కార్ల బ్రాండ్లు ముఖేష్ అంబానీ ఫ్యామిలీ వద్ద ఉన్నాయి. అయితే కొన్ని కార్లు కేవలం డబ్బు ఇచ్చి కొనలేనివి ఉంటాయి. ముఖేష్ అంబానీ కూడా క్యాష్ ఇచ్చి కొనలేని కొన్ని కార్లు ఉన్నాయి. మరి ముఖేష్ అంబానీ కూడా కొనలేని ఆ కార్లు ఏమిటి, ఆ కారును కొనడానికి రూల్స్ ఏంటో వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

ముఖేష్ అంబానీ అంత ఈజీగా ఈ కారును కొనలేరు
ఇటలీకి చెందిన పగాని ఆటోమొబైల్ అలాంటి కంపెనీలలో ఒకటి. ఇది తన హైపర్‌కార్లను చాలా లిటిటెడ్ సంఖ్యలో తయారు చేస్తుంది. ప్రతి కొనుగోలుదారుని స్వయంగా ఎంచుకుంటుంది. అందుకే ఈ కంపెనీ కారును కొనడం అంటే కేవలం డబ్బుకు సంబంధించిన మ్యాటర్ కాదు. ఒక ఎక్స్‌క్లూజివ్ క్లబ్‌లో భాగం కావడం. పగాని కార్లు సాధారణ లగ్జరీ కార్లలా నేరుగా కొనుగోలు చేయడానికి అందరికీ అందుబాటులో ఉండవు. కంపెనీ ప్రతి కొనుగోలుదారుని సెలక్ట్ చేస్తుంది. అనేక సందర్భాల్లో ఇన్విటేషన్ (ఆహ్వానం) ద్వారా మాత్రమే కారు కొనే అవకాశం ఉంటుంది.  ఎవరి వద్ద అయినా వందల కోట్లు, వేల కోట్లు ఉన్నప్పటికీ, కంపెనీ వారికి తన కారును విక్రయిస్తుందని గ్యారెంటీ లేదు. కంపెనీ ఫోకస్ కేవలం డబ్బున్న కస్టమర్ల మీద మాత్రమే కాకుండా, బ్రాండ్  ప్రత్యేక గుర్తింపును, దాని విలువను అర్థం చేసుకునే వ్యక్తులపై సైతం ఆధారపడి ఉంటుంది. అందుకే పగాని కార్ల ఉత్పత్తిని ఉద్దేశపూర్వకంగానే చాలా లిమిటెడ్ చేశారు. 

సెలెక్టివ్‌గా కొందరి వద్ద మాత్రమే కార్లు 
పగాని అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో 'పగాని హువాయ్రా కోడలుంగా' కూడా ఉంటుంది. ప్రపంచంలో ఈ కారువి కేవలం కొన్ని యూనిట్లు మాత్రమే తయారు చేశారు. ఈ కారు తయారవ్వకముందే అన్ని యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ హైపర్‌కార్‌లో 6.0 లీటర్ ట్విన్ టర్బో ఛార్జ్డ్ V12 ఇంజన్ ఇచ్చారు. ఇది దాదాపు 829 హార్స్ పవర్ జనరేట్ చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు సుమారు 217 మైళ్లు అని తెలుస్తోంది. క్లాసిక్ రేసింగ్ కార్ల నుంచి ప్రేరణ పొంది కంపెనీ దీనిని డిజైన్‌ చేసింది. 

రూ. 112 కోట్ల విలువైన కారు
పగాని 'పగాని జోండా హెచ్‌పి బార్‌షెట్టా' పేరుతో మరో ప్రత్యేకమైన కారును కూడా రూపొందించింది. కంపెనీ ఈ కారును 2018లో రిలీజ్ చేసింది. ఈ కారు ధర సుమారు రూ. 112 కోట్లు అని తెలిపారు. పగాని కంపెనీ దీనివి కేవలం మూడు యూనిట్లు మాత్రమే తయారు చేసింది. అవి లాంచ్ కావడానికి ముందే అమ్ముడయ్యాయి. ఈ కారులో 7.3 లీటర్ మెర్సిడెస్ AMG V12 ఇంజన్ ఇచ్చారు. ఈ కారు కేవలం 3.1 సెకన్లలో ఏకంగా 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అందుకే దీనిని ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన హైపర్‌కార్లు, ఫాస్టెస్ట్ కార్లలో ఒకటిగా భావిస్తారు. 

పగాని కార్లు ఎందుకంత ప్రత్యేకం.. ?
పగాని కంపెనీ తన ప్రతి కారును చాలా వరకు కస్టమైజ్ చేస్తుంది. దీనివల్ల దాదాపు ప్రతి యూనిట్ విభిన్నంగా, ప్రత్యేకం‌గా మారుతుంది. అందుకే ఈ కార్లను కేవలం ఒక వాహనంలా మాత్రమే కాకుండా స్టేటస్ సింబల్, కలెక్టర్ ఐటమ్‌గా భావిస్తారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

E20 పెట్రోల్‌ను దేశమంతా అందుబాటులోకి తెచ్చినా.. అనుకూల వాహనాలపై కేంద్రం వద్దే డేటానే లేదట!
హవ్వ.. దేశంలో ఎన్ని E20 వాహనాలున్నాయో సర్కారుకే తెలియదట - షాకింగ్ న్యూస్‌
EVలకు తగ్గని డిమాండ్ - జులైలో 32 వేలకుపైగా అమ్మకాలు, ఏ కంపెనీ ఎన్ని కార్లను విక్రయించిందంటే..?
జులైలోనూ జోరు తగ్గని ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు.. జనం ఏ కంపెనీ కార్లను ఎక్కువగా కొన్నారంటే..?
వర్షంలోనే టూవీలర్‌ నడుపుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ బండి మధ్య రోడ్డులోనే ఆగిపోవచ్చు!
వర్షంలో తడిచిన టూవీలర్‌ స్టార్ట్ కావట్లేదా? వీటిని ఒకసారి చెక్‌ చేయండి, ప్రోబ్లెం సాల్వ్‌!
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Nithiin Nani : హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Embed widget