అన్వేషించండి

Chinese Cars India:భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో చైనా కార్ల సునామీ! విప్లవాత్మక టెక్నాలజీ, అందుబాటు ధరల్లో వస్తున్న సరికొత్త మోడళ్లు! 

Chinese Cars India:భారతీయ ఆటోమొబైల్‌ రంగం చైనీస్ కార్ల వెల్లువకు సిద్ధమవుతోంది. JSW MG మోటార్, లీప్ మోటార్, BYD వంటి దిగ్గజాలు సరికొత్త మోడల్స్‌తో రానున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • చైనా కార్లు భారత్‌లో లగ్జరీ, ఎలక్ట్రిక్ విభాగాల్లో విస్తరిస్తున్నాయి.
  • MG, JSW, Leap Motor, BYD కొత్త మోడల్స్‌తో పోటీకి సిద్ధమయ్యాయి.
  • ఈవీ, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ విభాగాల్లో అనేక కొత్త వాహనాలు రానున్నాయి.
  • వినియోగదారులకు మునుపెన్నడూ లేని విధంగా అనేక ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి.

Chinese Cars India: గత కొన్నేళ్లుగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లోకి చైనీస్ కార్లు నేరుగా లేదా జాయింట్‌ వెంచర్ల ద్వారా నిశ్శబ్ధంగా ప్రవేశించాయి. అయితే రాబోయే రోజుల్లో ఈ సంఖ్య విపరీతంగా పెరగబోతోంది. ప్రధానంగా ఎలక్ట్రిక్‌, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ విభాగాల్లో ఈ కంపెనీలు తమ పట్టును బిగించడానికి సిద్ధమవుతున్నాయి. 

లగ్జరీ బడ్జెట్ విభాగాల్లో సరికొత్త వ్యూహంతో వస్ుతన్న JSW MG

మహీంద్రా, టాటా వంటి దేశీయ దిగ్గజాలకు గట్టి పోటీ ఇచ్చేలా ఎంజీ మోటార్ తన లైనప్‌ను భారీగా విస్తరిస్తోంది. ఎంజీ మోటార్ త్వరలో మెజెస్టర్ పేరుతో మొదటి డీ+ సెగ్మెంట్ ఎస్‌యూవీని లాంచ్ చేస్తోంది. ఇది 5,046mm పొడవుతో ప్రస్తుతం మార్కెట్‌ లీడర్‌గా ఉన్న టయోటా పార్చ్యునర్‌ కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. ఇందులో 212bhp పవర్ 478 Nm టార్క్‌ను ఉత్పత్‌చేసే 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజిల్‌ ఇంజిన్ ఉంటుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌తో పాటు, ఇందులో సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా ట్రిపుల్ డిఫరెన్షియల్‌ లాక్, M-క్రాల్‌ సిస్టమ్‌ వంటి ఆఫ్ రోడింగ్ ఫీచర్లు ఉండబోతున్నాయి. దీని ధర 40 నుంచి 45 లక్షల వరకు ఉంటుందని అంచనా. 

టాటా టియాగో ఈవీకి పోటీగా ఎంజీ బింగో ఈవీ రానుంది. ఇది కామెట్‌ ఈవీ, విండసర్‌ ఈవీలకు దీటుగా ఉంటుంది. ఇందులో 31.9 kWh 37.9 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయి. టియాగో ఈవీ 315 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే ఇస్తుండగా, బింగో ఈవీ మెరుగైన రేంజ్‌తోపాటు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ. 11 నుంచి 14 లక్షల మధ్య ఉండొచ్చు. 

మహీంద్రా XUV 7XO, టాటా సఫారీలకు పోటీగా ఎంజీ 520 రాబోతోంది. దీని ప్రధాన ఆకర్షణ 1.5 లీటర్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్‌ ఇంజిన్. ఇది 197bhp పవర్‌ ఇస్తుంది. ఇది కేవలం ఎలక్ట్రిక్ మోడల్‌లోనే 100 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. మొత్తం రేంజ్‌ 1100 కిలోమీటర్లు దాటుతుంది. దీని ఆల్‌ ఎలక్ట్రిక్ వెర్ష 500 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. 

ప్రీమియం విభాగంలో ఎంజీ IM6 అనే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కూపే ఆగస్టు 2026లో విడుదల కానుంది. 100kWh బ్యాటరీతో వచ్చే ఈ కారు టెస్లా మోడల్‌ వై, హ్యుందాయ్‌ అయోనిక్5తో పోటీ పడుతుంది. దీని AWD వెర్షన్ ఏకంగా 741bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు ప్రస్తుతం ఉన్న ZS ఈవీ స్థానంలో ఎంజీ ఎస్‌5 ఈవీ రాబోతోంది. ఇది హ్యుందాయ్‌ క్రెటా ఎలక్ట్రిక్ ధరలో లభించవచ్చు. 

JSW మోటర్స్‌ నుంచి సరికొత్త మోడల్స్

JSW గ్రూప్ తన సొంత బ్రాండ్‌ JSWమోటార్స్ నుంచి సరికొత్త మోడల్స్ రిలీజ్ చేయనుంది. దీపావళి నాటికి జేటూర్‌ T2 ఎస్‌యూవీ లాంచ్ చేయనుంది. ఇది ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ నుంచి ప్రేరణ పొంది దీన్ని రూపొందించారు. ఇది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్‌ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 221bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 220mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌ , 700mm నీటిలో వెళ్లే సామర్థ్యం దీని ప్రత్యేకతలు 

క్రెటా ఎలక్ట్రిక్ కంటే కొంచెం పెద్దదిగా ఉండే సీ సెగ్మెంట్‌ ఎస్‌యూవీ జేకూ J5. 60.9kWh బ్యాటరీతో 461 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. దీని ఇంటీరియర్‌లో 13.2 అంగుళా వర్టికల్ టచ్‌ స్క్రీన్ ఉంటుంది. ఈ కంపెనీ విడుదల చేయనున్న మరో మోడల్‌ చెరి ఐకార్ వీ 23. ఇది రెట్రో స్టైల్ బాక్సీ డిజైన్‌తో కూడిన ఆఫ్‌ రోడర్, దీని AWD వెర్షన్ 510 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. ఇది 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో రూ. 18-25 లక్షల మధ్య వచ్చే ఛాన్స్ ఉంది. 

లీప్ మోటార్ సంస్థల నుంచి కొత్త మోడల్స్ 

జీప్, సిట్రోయెన్ కంపెనీలను నిర్వహిస్తున్న స్టెలాంటిస్ గ్రూప్, లీప్ మోటార్‌ను భారత్‌లోకి తీసుకొస్తోంది. ఈ జాయింట్ వెంచర్‌ను లీప్ మోటరా బీ10 మోడల్ వస్తోంది. ఇది కంపాక్ట్ ఎలక్ట్రిక్ క్రాస్ ఓవర్, ఇది బైవైడీ ఆట్టో 3తో పోటీ పడుతుంది. ఇది 510కిలోమీటర్ల నుంచి 600 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను ఇచ్చే రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. లీప్‌మోటార్ సీ10 కూడా క్రెటా ఎలక్ట్రిక్ కంటే పెద్దగా ఉండే మిడ్ సైజ్ ఎస్‌యూవీ. 15 నుంచి 22 లక్ష ధరలో 424 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తుంది. టియాగో ఈవీకి గట్టి పోటీ ఇచ్చేందుకు లీప్ మోటార్ T03 హ్యాచ్‌బ్యాక్ తీసుకొస్తున్నారు. దీని ధర 8 నుంచి 12 లక్ష లోపు ఉంటుంది. 395 మైలేజీ ఇస్తుందని భావిస్తున్నారు. 

మార్కెట్‌లో లీడర్‌గా పట్టు నిలుపుకోవడానికి బీవైడీ ఎత్తుగడ 

ప్రస్తుతం భారత్‌ల బలంగా ఉన్న బైవైడీ కూడా తన ప్రోడక్ట్స్‌ను అప్‌డేట్ చేస్తుంది. ఇందులో మొదటిది బైవైడీ డాల్ఫిన్. ఇది ఎంజీ విండసర్‌ ఈవీకి గట్టిపోటీ ఇస్తుంది. 201bhp పవర్‌తో కేవలం 7 సెకన్లలో 0-100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. క్రెటా ఈవీకి, మహీంద్రా BE6లకు నేరుగా పోటీ ఇచ్చే బీవైడీ అట్టో 2ను రిలీజ్ చేయనున్నారు. ఇది 380 కిలోమీటర్ల రేంజ్‌తో ఈ మిడ్ సైజ్ ఎస్‌యూవీ రాబోతోంది. ఇందులో తిరిగే టచ్‌స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బీవైడీ అట్టో 3 ఫేస్‌లిఫ్ట్‌ ఇప్పటకే అమ్ముడువుతోంది. దీన్ని కొత్తగా డిజైన్ చేస్తున్నారు. రేంజ్‌ను కూడా అప్‌డేట్ చేస్తున్నారు. బీవైడీ సిలయ్‌6 1.5 లీటర్ ఇంజిన్, బ్యాటరీ కలయికతో వచ్చే ప్లగ్ ఇన్ హైబ్రిడ్, దీని మొత్తం రేంజ్ 1100 కిలోమీటర్లు.కేవలం ఎలక్ట్రిక్ పవర్‌ోనే 92 కిలోమీటర్ల ట్రావెల్ చేయవచ్చు. చైనీస్ కంపెనీల రాకతో భారతీయ వినియోగదారులకు మునుపెన్నడూ లేని విధంగా అనేక ఆప్షన్లు లభించనున్నాయి. 

Frequently Asked Questions

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లోకి చైనీస్ కార్ల ప్రవేశం ఎలా ఉంది?

గత కొన్నేళ్లుగా చైనీస్ కార్లు నేరుగా లేదా జాయింట్‌ వెంచర్ల ద్వారా భారత మార్కెట్‌లోకి ప్రవేశించాయి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

JSW MG ఏ విభాగంలో కొత్త మోడల్స్‌ను విడుదల చేస్తోంది?

JSW MG లగ్జరీ, బడ్జెట్ విభాగాల్లో కొత్త మోడల్స్‌ను విడుదల చేస్తోంది. మెజెస్టర్, బింగో ఈవీ, MG 520 వంటి వాహనాలు త్వరలో మార్కెట్‌లోకి రానున్నాయి.

JSW మోటార్స్‌ నుంచి ఏయే కొత్త మోడల్స్‌ రానున్నాయి?

JSW మోటార్స్‌ జేటూర్‌ T2 ఎస్‌యూవీ, జేకూ J5, మరియు చెరి ఐకార్ వీ 23 వంటి మోడల్స్‌ను విడుదల చేయనుంది.

లీప్ మోటార్‌ నుంచి ఏయే ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి?

లీప్ మోటార్‌ నుంచి లీప్ మోటరా బీ10, సీ10, మరియు T03 హ్యాచ్‌బ్యాక్‌ మోడల్స్‌ వస్తున్నాయి. ఇవి వివిధ విభాగాలలో పోటీనిస్తాయి.

BYD‌ భారత మార్కెట్‌ కోసం ఏయే మోడల్స్‌ను సిద్ధం చేస్తోంది?

BYD‌ డాల్ఫిన్, అట్టో 2, మరియు అట్టో 3 ఫేస్‌లిఫ్ట్‌ వంటి మోడల్స్‌ను విడుదల చేయనుంది. సిలయ్‌6 ప్లగ్ ఇన్ హైబ్రిడ్‌ కూడా వస్తుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

BS6 కార్ల యజమానులకు భారీ ఊరట.. కాలుష్య ధ్రువీకరణ గడువు మూడేళ్లకు పెంచనున్న కేంద్రం!
కార్ ఓనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఇక మూడేళ్లకు ఒకసారి 'పొల్యూషన్‌ సర్టిఫికెట్‌!'
E20 పెట్రోల్‌ను దేశమంతా అందుబాటులోకి తెచ్చినా.. అనుకూల వాహనాలపై కేంద్రం వద్దే డేటానే లేదట!
హవ్వ.. దేశంలో ఎన్ని E20 వాహనాలున్నాయో సర్కారుకే తెలియదట - షాకింగ్ న్యూస్‌
EVలకు తగ్గని డిమాండ్ - జులైలో 32 వేలకుపైగా అమ్మకాలు, ఏ కంపెనీ ఎన్ని కార్లను విక్రయించిందంటే..?
జులైలోనూ జోరు తగ్గని ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు.. జనం ఏ కంపెనీ కార్లను ఎక్కువగా కొన్నారంటే..?
వర్షంలోనే టూవీలర్‌ నడుపుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ బండి మధ్య రోడ్డులోనే ఆగిపోవచ్చు!
వర్షంలో తడిచిన టూవీలర్‌ స్టార్ట్ కావట్లేదా? వీటిని ఒకసారి చెక్‌ చేయండి, ప్రోబ్లెం సాల్వ్‌!
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Embed widget