అన్వేషించండి

Maruti Suzuki Eeco News: మారుతి ఈకో.. కొత్త స్టార్ ఎడిషన్ వచ్చేసింది.. అదిరిపోయే లుక్, ప్రీమియం ఫీచర్లు! కేవలం తక్కువ ధరలోనే అప్‌గ్రేడ్

మారుతి సుజుకి తన పాపులర్ వ్యాన్ ఈకోలో కొత్త 'స్టార్ ఎడిషన్'ను లాంచ్ చేసింది. బాడీ కలర్ బంపర్లు, స్పోర్టీ లుక్ ఇచ్చే 18 రకాల యాక్సెసరీలతో ఈ మోడల్ ఆకట్టుకుంటోంది.

Maruti Suzuki Eeco Star Edition Launched: ఇండియాలో మాస్ మార్కెట్ వ్యాన్ సెగ్మెంట్ లో మారుతి సుజుకికి తిరుగులేదు. ఈకో (Eeco) మోడల్ కు సరైన పోటీ లేకపోవడంతో ప్రతినెలా 10 వేలకు పైగా యూనిట్లు అమ్ముడవుతున్నాయి. గత మార్చి 2026 నెలలో ఏకంగా 11,333 వాహనాలను విక్రయించి మారుతి తన సత్తా చాటింది. ఈ జోరును ఇలాగే కొనసాగించడానికి, ముఖ్యంగా ఫ్యామిలీ కస్టమర్లను ఆకర్షించడానికి మారుతి సుజుకి ఇప్పుడు ఈకో 'స్టార్ ఎడిషన్'ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సాధారణంగా కమర్షియల్ లుక్ లో ఉండే ఈకోను ఈ స్టార్ ఎడిషన్ కాస్త విలాసవంతంగా మార్చేస్తుంది.

ధర - ఆఫర్ వివరాలు..
ఈ స్టార్ ఎడిషన్ ప్యాకేజీ ధరను మారుతి చాలా ఇంట్రెస్టింగ్ గా నిర్ణయించింది. కారు అసలు ధరపై అదనంగా రూ. 19,999 చెల్లిస్తే ఈ స్పెషల్ ఎడిషన్ సొంతం చేసుకోవచ్చు. గతంలో ఇలాంటి ప్యాకేజీ కోసం రూ. 37,000 వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ ధరను దాదాపు సగానికి తగ్గించడంతో బడ్జెట్ లో కారు కొనేవారికి ఇది ఒక మంచి డీల్ అని చెప్పొచ్చు. ఈ ఎడిషన్ మెటాలిక్ బ్రిస్క్ బ్లూ, మెటాలిక్ గ్లిస్టనింగ్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

స్టార్ ఎడిషన్ లో ఏమేం వస్తాయి?
ఈ స్పెషల్ ఎడిషన్ లో మొత్తం 18 రకాల యాక్సెసరీలను మారుతి ఆఫర్ చేస్తోంది. వీటిలో హైలైట్ గా చెప్పుకోవాల్సింది బాడీ కలర్ బంపర్లు. సాధారణ ఈకో మోడళ్లలో బంపర్లు బ్లాక్ కలర్ లో ఉంటే, స్టార్ ఎడిషన్ లో కారు బాడీ రంగులోనే వస్తాయి. దీనివల్ల కారు చూడటానికి చాలా ప్రీమియం గా కనిపిస్తుంది. అలాగే కారు వెనుక భాగంలో స్పోర్టీ లుక్ ఇచ్చే రియర్ స్పాయిలర్, గార్నిష్ తో కూడిన ఫాగ్ ల్యాంప్స్, ఇంటీరియర్ స్టైలింగ్ కిట్లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు కొత్త సీట్ కవర్లు, స్టైలిష్ వీల్ కవర్లు, క్రోమ్ ఎంబ్లమ్, డోర్ వైజర్లు, మడ్ ఫ్లాప్స్ వంటి మరెన్నో ఐటమ్స్ ఈ ప్యాకేజీలో భాగం. ఈ యాక్సెసరీలన్నీ డీలర్ లెవల్ లో అమర్చే అవకాశం ఉంది.

ఇంజిన్ - మైలేజ్..
మెకానికల్ గా ఈకోలో ఎటువంటి మార్పులు లేవు. ఇందులో నమ్మకమైన 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 81 బీహెచ్‌పీ పవర్, 105.5 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో వచ్చే ఈ కారు పెట్రోల్ వెర్షన్ లో లీటరుకు 19.71 కిమీ మైలేజ్ ఇస్తుంది. ఇక సీఎన్‌జీ వెర్షన్ లో అయితే ఏకంగా కిలో గ్యాస్ కు 26.78 కిమీ మైలేజ్ ఇస్తుండటం విశేషం. పొదుపుగా ప్రయాణించాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

వేరియంట్లు - ఫీచ‌ర్లు..
మారుతి ఈకో ప్రస్తుతం రూ. 5.21 లక్షల నుండి రూ. 6.36 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య లభిస్తోంది. ఇందులో 5 సీటర్ స్టాండర్డ్, 5 సీటర్ ఏసీ, 7 సీటర్ వంటి రకరకాల ఆప్షన్లు ఉన్నాయి. స్లైడింగ్ డోర్ల సౌకర్యం ఉండటం వల్ల ఇరుకైన ప్రదేశాల్లో కూడా కారు ఎక్కడం, దిగడం చాలా సులభం. లాడర్ ఫ్రేమ్ ఛాసిస్ మీద నిర్మించిన ఈ వాహనం రియర్ వీల్ డ్రైవ్ (RWD) సిస్టమ్ తో పనిచేస్తుంది. ప్రస్తుతం షోరూమ్ లో ఉన్న ఏ వేరియంట్ కైనా ఈ స్టార్ ఎడిషన్ ప్యాకేజీని అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్యామిలీ కోసం తక్కువ ధరలో మంచి లుక్ ఉన్న కారు వెతుకుతుంటే ఈ కొత్త ఈకో స్టార్ ఎడిషన్ ఒక మంచి ఆప్షన్ అవుతుంది.

టాప్ హెడ్ లైన్స్

కేవలం 1500 మంది కొనగలిగే రెనాల్ట్ Renault Rafale Hypnotic, ఈ SUV ఎందుకంత స్పెషల్
కేవలం 1500 మంది కొనగలిగే రెనాల్ట్ Renault Rafale Hypnotic, ఈ SUV ఎందుకంత స్పెషల్
ఫెస్టివ్ సీజన్‌కు ముందే షాకివ్వనున్న Mahindra, ఈ ఏడాది 4వ సారి పెరగనున్న SUV ధరలు
ఫెస్టివ్ సీజన్‌కు ముందే షాకివ్వనున్న Mahindra, ఈ ఏడాది 4వ సారి పెరగనున్న SUV ధరలు
కొత్త హ్యుందాయ్ వెర్నా కోసం రూ.3 లక్షలు లేదా రూ.5 లక్షలు డౌన్‌పేమెంట్‌ చేస్తే EMI ఎంత మారుతుంది?
Hyundai Verna EMI: రూ.15,000 లోపు EMIతో హ్యుందాయ్‌ వెర్నా కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి?
మీ హెల్మెట్‌ వైజర్‌ పొగమంచుతో మసకబారుతోందా? పిన్‌లాక్‌ గురించి ప్రతి బైక్‌ రైడర్‌ ఈ విషయాలు తెలుసుకోవాలి
పిన్‌లాక్‌ ఉంటే చలికాలంలో కూడా మీ హెల్మెట్‌ వైజర్‌ మీద ఫాగ్‌ పేరుకుపోదు! ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసా?

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
Embed widget