అన్వేషించండి

Tata Nexon Pure Plus News: టాటా నెక్సాన్ కొత్త సంచలనం.. అతి తక్కువ ధరకే పనోరమిక్ సన్‌రూఫ్! లీకైన ఇంటీరియర్ వివరాలు

టాటా మోటార్స్ తన పాపులర్ ఎస్‌యూవీ నెక్సాన్‌లో కొత్త ప్యూర్ ప్లస్ పీఎస్ వేరియంట్‌ను లాంచ్ చేయబోతోంది. అత్యంత చౌకగా పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ అందించడమే దీని స్పెషాలిటీ.

Tata Nexon Pure Plus PS Variant Leaked:  టాటా మోటార్స్ కు నెక్సాన్ ఒక పెద్ద 'క్యాష్ కౌ' లాంటిది. అంటే కంపెనీకి అత్యధిక లాభాలను, అమ్మకాలను తెచ్చిపెట్టే మోడల్ ఇది. ప్రస్తుతం సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్ లో గట్టి పోటీ ఉన్నప్పటికీ నెక్సాన్ తన క్రేజ్ ఏమాత్రం తగ్గించుకోవడం లేదు. సేల్స్ ను మరింత పెంచే ప్లాన్ లో భాగంగా టాటా ఇప్పుడు 'ప్యూర్ ప్లస్ పీఎస్' (Pure+ PS) అనే కొత్త వేరియంట్‌ను సిద్ధం చేసింది. ఇందులో పీఎస్ (PS) అంటే పనోరమిక్ సన్‌రూఫ్ అని అర్థం. అధికారికంగా లాంచ్ అవ్వకముందే ఈ కారు ఇంటీరియర్ వివరాలు బయటకు వచ్చాయి.

అందరికీ అందుబాటులో పనోరమిక్ సన్‌రూఫ్..
ప్రస్తుతం ఇండియన్ కస్టమర్లు కారులో ఎక్కువగా కోరుకునే ఫీచర్ సన్‌రూఫ్. ఇప్పటివరకు పనోరమిక్ సన్‌రూఫ్ కావాలంటే కనీసం రూ. 11.32 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర ఉన్న క్రియేటివ్ ప్లస్ పీఎస్ వేరియంట్ కొనాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త ప్యూర్ ప్లస్ పీఎస్ వేరియంట్ లాంచ్ అయితే సామాన్యులకు కూడా ఈ లగ్జరీ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ప్యూర్ ప్లస్ ఎస్ వేరియంట్ ధర రూ. 9.23 లక్షల నుండి ప్రారంభం అవుతుండగా, ఈ కొత్త పీఎస్ వేరియంట్ ధర అంతకంటే కొంచెం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. దేశంలో పనోరమిక్ సన్‌రూఫ్ తో లభించే అత్యంత చౌకైన కారుగా ఇది నిలవబోతోంది.

కొత్తగా చేరిన ఫీచర్లు..
లీకైన ఫోటోల ప్రకారం ఈ కొత్త వేరియంట్ లో సన్‌రూఫ్ తో పాటు 'క్రూయిజ్ కంట్రోల్' ఫీచర్ కూడా కనిపిస్తోంది. సాధారణంగా ఈ ఫీచర్ కేవలం టాప్ ఎండ్ వేరియంట్లలోనే ఉండేది. ఇప్పుడు బడ్జెట్ వేరియంట్ లోనే స్పీడ్ సెట్ చేసుకునే టోగుల్స్ ఇస్తుండటం విశేషం. వీటితో పాటు 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, హెచ్‌డీ రియర్ వ్యూ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆటో హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ఈ ప్యాకేజీలో భాగం కానున్నాయి.

ఇంజిన్ ఆప్షన్లు..
నెక్సాన్ ప్యూర్ ప్లస్ పీఎస్ వేరియంట్ లో పవర్ ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు ఉండబోతున్నాయి. ఇందులో టర్బో పెట్రోల్ (6MT/6AMT), టర్బో డీజిల్ (6MT/6AMT) తో పాటు సీఎన్‌జీ వెర్షన్ కూడా లభించే అవకాశం ఉంది. దేశంలో నాలుగు రకాల ఇంధన ఆప్షన్లతో (పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఈవీ) దొరుకుతున్న ఏకైక కారు నెక్సాన్ కావడం గమనార్హం.

మార్కెట్ లో పోటీ..
ఈ కొత్త వేరియంట్ లాంచ్ అయితే మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ వంటి మోడళ్లకు కష్టాలు తప్పవు. ముఖ్యంగా తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లు ఇవ్వడం టాటాకు ప్లస్ పాయింట్ కానుంది. సేఫ్టీ విషయంలో ఇప్పటికే 5 స్టార్ రేటింగ్ సంపాదించిన నెక్సాన్, ఇప్పుడు ఇలాంటి క్రేజీ ఫీచర్లతో యూత్ ను మరింతగా ఆకట్టుకోనుంది. ఈ మోడల్ అతి త్వరలోనే షోరూమ్ లలో సందడి చేయబోతోంది.

టాప్ హెడ్ లైన్స్

కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
AP Cabinet Decisions: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
Alias Rukmini Heroine: 'అలియాస్ రుక్మిణి'లో హీరోయిన్ ఈ అమ్మాయే... నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆఫియా సయ్యద్
'అలియాస్ రుక్మిణి'లో హీరోయిన్ ఈ అమ్మాయే... నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆఫియా సయ్యద్
Hyderabad Crime News: చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
Embed widget