అన్వేషించండి

Yamaha Aerox 155 and XSR 155: యామహా ఏరోక్స్ 155 , ఎక్స్‌ఎస్‌ఆర్ 155 ధరలు పెంపు.. కొత్త రేట్లు ఎలా ఉన్నాయంటే?

యమహా ఇండియా తన పాపులర్ 155సీసీ మోడళ్ల ధరలను పెంచింది. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడంతో ఏరోక్స్ స్కూటర్, ఎక్స్‌ఎస్‌ఆర్ బైక్ రేట్లు ఇప్పుడు మరింత భారమయ్యాయి.

Yamaha Aerox 155 and XSR 155 Prices Hiked: ఇండియ‌న్ మార్కెట్లో ప్రీమియం టూ-వీలర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే యమహా ఇండియా, తన 155సీసీ సెగ్మెంట్ లోని రెండు కీలక వాహనాల ధరలను సవరించింది. యమహా ఏరోక్స్ 155 (Yamaha Aerox 155) మ్యాక్సీ స్కూటర్, యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155 (Yamaha XSR 155) బైక్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ముడి సరుకుల ధరలు, ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చుల వల్ల ఈ భారం తప్పలేదని కంపెనీ పేర్కొంది. అయితే ఈ పెరిగిన ధరలు మే 2026 నుండే అమల్లోకి వచ్చాయి. మెకానికల్ గా గానీ, డిజైన్ పరంగా గానీ ఈ వాహనాల్లో కంపెనీ ఎలాంటి కొత్త మార్పులు చేయలేదు.

యమహా ఏరోక్స్ 155 కొత్త ధరలు..
యమహా ఏరోక్స్ 155 స్కూటర్ పై అన్ని వేరియంట్లపై రూ. 2,800 వరకు ధర పెరిగింది. తాజా రివిజన్ తర్వాత, స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 1.43 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) చేరగా, టాప్-స్పెక్ వెర్షన్ ఎస్ (Version S) ధర రూ. 1.46 లక్షలకు పెరిగింది. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒకసారి ధరలు పెంచిన యమహా, కేవలం ఒక నెల గ్యాప్ లోనే మళ్ళీ రెండోసారి రేట్లు పెంచడం విశేషం.

ఫీచర్ల విషయానికి వస్తే, ఏరోక్స్ 155 ఇప్పటికీ మార్కెట్లో మోస్ట్ పవర్ ఫుల్ స్కూటర్లలో ఒకటిగా ఉంది. ఇందులో 155సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 15 బీహెచ్‌పీ పవర్, 13.9 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అగ్రెసివ్ మ్యాక్సీ స్కూటర్ లుక్, ఎల్ఈడీ లైటింగ్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆటోమేటిక్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్ వంటి హైటెక్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది మార్కెట్లో హీరో జూమ్ 160 వంటి స్కూటర్లకు గట్టి పోటీ ఇస్తోంది.

యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155 ధరల వివరాలు..
మరోవైపు, రెట్రో లుక్ తో ఆకట్టుకునే ఎక్స్‌ఎస్‌ఆర్ 155 బైక్ ధర కూడా పెరిగింది. అయితే ఏరోక్స్ తో పోలిస్తే ఇందులో పెంపు కొంత తక్కువగానే ఉంది. ఎంట్రీ లెవల్ మెటాలిక్ బ్లూ కలర్ ధరలో ఎలాంటి మార్పు లేదు, ఇది పాత ధర రూ. 1.49 లక్షలకే లభిస్తుంది. కానీ మిగతా అన్ని వేరియంట్లపై రూ. 1,000 పెరిగింది. వివిడ్ రెడ్ వేరియంట్ ధర రూ. 1.53 లక్షలు, మెటాలిక్ గ్రే ధర రూ. 1.57 లక్షలకు చేరింది. మెటాలిక్ బ్లాక్ గ్రేయిష్ గ్రీన్ మెటాలిక్ షేడ్స్ ధర రూ. 1.59 లక్షలుగా ఉంది.

ఇంజిన్ , ప్రత్యేకతలు:
ఎక్స్‌ఎస్‌ఆర్ 155 బైక్ తన క్లాసిక్ డిజైన్ తో పాటు మోడర్న్ ఫీచర్లకు పేరుగాంచింది. ఇందులో రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. మెకానికల్ గా చూస్తే, ఇందులో 155సీసీ వివిఏ (VVA) టెక్నాలజీ ఉన్న ఇంజిన్ ఉంటుంది. ఇది 18.1 బీహెచ్‌పీ పవర్, 14.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఇస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో పాటు అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ ఫీచర్ కూడా ఉంది. సేఫ్టీ కోసం డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్స్ వంటి ప్రీమియం ఎక్విప్‌మెంట్ ఇందులో అందుబాటులో ఉన్నాయి.

యమహా ప్రేమికులకు ఈ ధరల పెంపు కొంత చేదు వార్తే అయినప్పటికీ, పర్ఫార్మెన్స్ , బిల్డ్ క్వాలిటీ విషయంలో యమహా వాహనాలకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ కొత్త ధరల గురించి పూర్తి వివరాల కోసం మీకు దగ్గరలో ఉన్న యమహా షోరూమ్‌ను సంప్రదించడం మంచిది.

టాప్ హెడ్ లైన్స్

Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు
కేవలం రూ.10,000 మీ దగ్గర ఉంటే చాలు, రూ.2 లక్షల Yamaha R2 మీ సొంతం!
Mahindra XUV700 Price on Road: మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు
రూ.1.10 లక్షలకే ఆంపియర్‌ మాగ్నస్‌ G మ్యాక్స్‌.. ఇంతకుముందులా లేదు, 30కి పైగా కొత్త ఫీచర్లు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
Embed widget