అన్వేషించండి

High Speed Electric Bikes India: మార్కెట్‌లో అందుబాటులో ఉన్న హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్స్‌ ఇవే! ధర ఫీచర్లు గురించి తెలుసుకోండి!

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో కేవలం పొదుపుకే పరిమితం కాకుండా ఇప్పుడు అత్యంత వేగవంతమైన ప్రయాణంపై కూడా వినియోగదారులు దృష్టి పెట్టారు. అందుకే అలాంటి హైస్పీడ్ కలిగిన ఈవీల గురించి తెలుసుకోండి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారత మార్కెట్లో 90 కి.మీ/గం పైగా వేగంతో 46 హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ మోడళ్లు.
  • ఓలా, ఆల్ట్రావైలెట్, సింపుల్ ఎనర్జీ మంచి రేంజ్, ఫీచర్లతో అందిస్తున్నాయి.
  • పెట్రోల్ బైక్ ప్రదర్శనకు సమానమైన పర్ఫార్మెన్స్, మెరుగైన భద్రత ఈవీలలో లభ్యం.
  • కొత్త ఈవీలు 2-6 గంటల్లో ఫుల్ ఛార్జ్, 3-5 ఏళ్ల బ్యాటరీ వారంటీ.

High Speed Electric Bikes India: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు అంటే కేవలం తక్కువ వేగంతో నడిచే స్కూటర్లు మాత్రమే కాదు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, పెట్రోల్ బైక్‌లకు ధీటుగా గంటకు 90 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే హైస్పీడ్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ల శకం మొదలైంది. ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో ఇటువంటి సుమారు 46 మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి వేగంతోపాటు అద్భుతమైన మైలేజీని కూడా అందిస్తున్నాయి. 

గతంలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారు కేవలం నగరం లోపల తక్కువ దూరం ప్రయాణించడానికి ప్రాధాన్యత ఇచ్చే వారు. కానీ నేడు వినియోగదారులు హైవేలపై కూడా సురక్షితంగా, వేగంగా ప్రయాణించాలని కోరుకుంటున్నారు.  గంటలకు 90 కిలోమీటర్లపైగా వేగంతో వెళ్లే వాహనాలు ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి. ఈ హైస్పీడ్‌ బైక్‌లలో ఏబీఎస్‌, క్రూయిజ్‌ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్‌ వంటి ఫీచర్లు భద్రతను పెంచుతాయి. 150cc, 200cc పెట్రోల్ బైక్‌లను వాడే వారు ఇప్పుడు అదే స్థాయి పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్‌లవైపు మొగ్గు చూపుతున్నారు. 

Also Read:కారు మైలేజ్ పెంచుకోవడానికి బెస్ట్ టిప్స్ - ఈ చిన్న మెయింటెనెన్స్ జాగ్రత్తలతో ఫ్యూయెల్ ఆదా చేసుకోండి

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న టాప్ హై స్పీడ్ ఈవీలు ఇవే !

భారత మార్కెట్‌లో వివిధ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని ప్రమఖ హైస్పీడ్, లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ వాహనాల వివరాలు ఇక్కడ ఉన్నాయి.  

ఓలా ఎలక్ట్రిక్ 

ఓలా సంస్థ తన రోడ్‌స్ట్ సిరీస్‌ , ఎస్‌1ప్రో మోడళ్లతో మార్కెట్‌లో ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఓలా రోడ్‌స్టర్ ప్రో ఎలక్ట్రిక్ బైక్ రంగంలోనే ఒక అద్భుతం. దీని 16kWh బ్యాటరీ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 579 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని ధర సుమారు 2.67లక్షల వరకు ఉంటుంది. 

Also Read:బీవైడీ నుంచి సరికొత్త ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీ - లాంచ్‌కు ముందే రోడ్లపై ప్రత్యక్షం!

ఓలా ఎస్‌1 ప్రో గంటకు 90 కిలోమీటర్‌ల వేగంతో వెళ్తుంది. ఇందులో 4 kWh బ్యాటరీతో 242 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. దీని ధర సుమారు 1.38 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 

బడ్జెట్‌ ధరలో హై స్పీడ్‌ కోరుకునే వారికి ఓలా ఎస్‌ 1 ఎక్స్‌  మంచి ఎంపిక అవుతుంది. దీని 4kWh వేరియంట్‌ 242 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 

ఆల్ట్రావైలెట్‌  

స్పోర్ట్స్ బైక్ ప్రియుల కోసం ఆల్ట్రావైలెట్ సంస్థ అత్యంత శక్తిమంతమైన మోడళ్లను అందిస్తోంది. ఇందులో మొదటిది F77 మాక్ 2. దీని రీకాన్ వేరియంట్‌ 323 కిలోమీటర్ల రేంజ్‌, 30kW పవర్ కలిగి ఉంది. దీని ధర సుమారు 4.44 లక్షలు ఉంది.  ఇందులో మరో మోడల్ X47 క్రాస్ ఓవర్. ఇది కూడా 323 కిలోమీటర్ల రేంజ్, గరిష్ట భద్రతా ఫీచర్లతో వస్తుంది. దీని ధర వేరియంట్లను బట్టి 2.66 లక్షల నుంచి 4.80 లక్షల వరకు ఉంటుంది. 

Also Read:టాటా ఆల్ట్రోజ్ సీఎన్‌జీ ఏఎంటీ కారు కొనాల‌నుకుంటున్నారా..? ఈఎమ్ఐ వివరాలు ఇవే.!

సింపుల్ ఎనర్జీ 

రేంజ్ విషయంలో సింపుల్‌ ఎనర్జీ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. సింపుల్‌ ఆల్ట్రా ఒకసారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని ధర 2. 47 లక్షలు. 5kWh బ్యాటరీతో 265కిలోమీటర్ల రేంజ్‌ అందించే సింపుల్ వన్ మోడల్ ధర 2.01 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఫ్లయింగ్‌ ఫ్లీ బైక్‌తో ఎలక్ట్రిక్ రంగంలోకి అడుగు పెట్టింది. ఇది 154 కిలోమీట్ల రేంజ్ ఇస్తుంది. ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో టీవీఎస్ ఎక్స్ 159 కిలోమీటర్ల రేంజ్, 11kW పవర్‌తో అందుబాటులో ఉంది. ఏథర్ 40 అపెక్స్‌ పెర్ఫార్మెన్స్‌కు మారుపేరుగా నిలిచే ఈ మోడల్‌ 157 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 

Also Read: టాటా ఆల్ట్రోజ్ సీఎన్‌జీ ఏఎంటీ కారు కొనాల‌నుకుంటున్నారా..? ఈఎమ్ఐ వివరాలు ఇవే.!

ఈ హైస్పీడ్ వాహనాల్లో అత్యాధునిక బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌, శక్తిమంతమైన మోటార్లు వాడుతున్నారు. నేడు వస్తున్న బైక్‌లు 2 నుంచి 6 గంటల వ్యవధిలోనే ఫుల్ ఛార్జ్ అవుతున్నాయి. ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి మోడళ్లు కేవలం 2.16 గంటల్లోనే ఛార్జింగ్ పూర్తి చేసుకుంటున్నాయి. మొబైల్ కనెక్టివిటీ, నావిగేషన్, ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్స్‌ ద్వారా వాహనం పని తీరును నిరంతరం మెరుగుపరుచవచ్చు.  దాదాపు అన్ని సంస్థలు 3 నుంచి ఐదేళ్ల వరకు బ్యాటరీ వారంటీని అందిస్తున్నాయి. ఇది వినియోగదారులకు భరోసా ఇస్తుంది. 

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ 46 మోడళ్లు వివిధ ధరల శ్రేణిలో 70 వేల నుంచి 5 లక్షల ధరతో లభిస్తున్నాయి. వినియోగదారులు తమ బడ్జెట్‌, అవసాలను బట్టి ముఖ్యంగా రోజువారి ప్రయాణ దూరాన్ని పరిగణలోకి తీసుకుని సరైన మోడల్‌ను ఎంచుకోవచ్చు. 

Frequently Asked Questions

భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి?

ప్రస్తుతం భారత మార్కెట్లో గంటకు 90 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే సుమారు 46 హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.

హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌లలో ఏయే భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?

ఈ హై-స్పీడ్ బైక్‌లలో ABS, క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రయాణాన్ని మరింత సురక్షితంగా చేస్తాయి.

ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లు ఎంత రేంజ్ అందిస్తాయి?

ఓలా S1 ప్రో 242 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది, అయితే రోడ్‌రస్ట్ ప్రో యొక్క 16kWh బ్యాటరీ వేరియంట్ ఒక్కసారి ఛార్జింగ్‌తో 579 కిలోమీటర్ల రేంజ్ వరకు ఇవ్వగలదు.

ఆల్ట్రావైలెట్ F77 మాక్ 2 బైక్ విశేషాలు ఏమిటి?

ఆల్ట్రావైలెట్ F77 మాక్ 2 రీకాన్ వేరియంట్ 323 కిలోమీటర్ల రేంజ్ మరియు 30kW పవర్‌ను అందిస్తుంది. దీని ధర సుమారు 4.44 లక్షలు.

హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌లు పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది?

నేడు వస్తున్న చాలా హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌లు 2 నుండి 6 గంటల వ్యవధిలోనే పూర్తిగా ఛార్జ్ అవుతాయి. కొన్ని మోడల్స్ కేవలం 2.16 గంటల్లోనే ఛార్జింగ్ పూర్తి చేసుకుంటాయి.

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Embed widget