అన్వేషించండి

Car Maintenance Tips: కారు మైలేజ్ పెంచుకోవడానికి బెస్ట్ టిప్స్ - ఈ చిన్న మెయింటెనెన్స్ జాగ్రత్తలతో ఫ్యూయెల్ ఆదా చేసుకోండి

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో కార్ల మైలేజీని పెంచుకోవడానికి, ఇంధనాన్ని ఆదా చేయడానికి ఉపయోగపడే సులభమైన మెయింటెనెన్స్ చిట్కాలు అందుబాటులోకి వచ్చాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టైర్లలో సరైన గాలి ఒత్తిడి, సకాలంలో సర్వీసింగ్ ఇంధన సామర్థ్యాన్ని పెంచుతాయి.
  • క్లీన్ ఎయిర్ ఫిల్టర్, అనవసర బరువు తగ్గించడం మైలేజ్ మెరుగుపరుస్తాయి.
  • వీల్ అలైన్మెంట్ సరిచేయడం, డాష్‌బోర్డ్ వార్నింగ్స్ పట్టించుకోవడం ముఖ్యం.

Car Maintenance Tips to Improve Fuel Efficiency: ప్రస్తుతం పశ్చిమాసియా (West Asia) లో జరుగుతున్న ఘర్షణల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా, ఇంధన ధరలపై పడటం ప్రారంభమైంది. భారతదేశంలో కూడా ఇంధనాన్ని ఆదా చేయడం, అనవసరమైన వినియోగాన్ని తగ్గించడంపై ఫోకస్ పెరుగుతోంది. చాలా మంది కేవలం డ్రైవింగ్ స్టైల్ మార్చడం ద్వారానే మైలేజ్ పెరుగుతుందని భావిస్తారు, కానీ కారు మెయింటెనెన్స్ కూడా ఇందులో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సరిగ్గా పట్టించుకోని కారు సాధారణం కంటే ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది. అదే సమయంలో, కారును కండిషన్ లో ఉంచితే ఇంజిన్ స్మూత్‌గా రన్ అవ్వడమే కాకుండా కారు నడపడం కూడా చాలా తేలికగా అనిపిస్తుంది. లాంగ్ రన్ లో ఇది ఇంధనాన్ని బాగా ఆదా చేస్తుంది. దీనికోసం భారీగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రాథమిక తనిఖీలు, అలవాట్లు పాటిస్తే మైలేజ్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది.

Read Also: బడ్జెట్ ధరలో KIA EV.. BAAS విధానంతో భారీగా తగ్గనున్న కారు ధరలు ! స్టైలిష్ లుక్.. హైటెక్ ఫీచర్లు

టైర్ ప్రెజర్ ,సకాలంలో సర్వీసింగ్..

కారు మైలేజ్ తగ్గడానికి ప్రధాన కారణాలలో టైర్లలో గాలి తక్కువగా ఉండటం ఒకటి. గాలి తక్కువగా ఉన్న టైర్లు రోడ్డుపై ఎక్కువ ఘర్షణను (Resistance) కలిగిస్తాయి, దీనివల్ల ఇంజిన్ మరింత కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి కొన్ని వారాలకు ఒకసారి, ముఖ్యంగా లాంగ్ జర్నీలకు వెళ్లే ముందు టైర్ ప్రెజర్ చెక్ చేసుకోవడం మంచిది. అలాగే సర్వీసింగ్ సమయాన్ని ఆలస్యం చేయడం వల్ల తాత్కాలికంగా డబ్బు ఆదా అయినట్లు అనిపించినా, తర్వాత అది ఇంధన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇంజిన్ లో క్లీన్ ఆయిల్, మంచి ఫిల్టర్లు, సరిగ్గా పనిచేసే విడిభాగాలు ఉంటేనే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. కారును నిర్ణీత వ్యవధిలో సర్వీసింగ్ చేయించడం వల్ల ఇంజిన్ లైఫ్ పెరగడమే కాకుండా పెట్రోల్, డీజిల్ ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి.

Read Also: NHAI Shares Important Driving Tips: ఎండల్లో సేఫ్ డ్రైవింగ్ టిప్స్ - సమ్మర్ గ్లేర్ నుండి తప్పించుకోవడానికి ఎన్ హెచ్ఏఐ కీలక సూచనలు

ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ , బరువు నియంత్రణ..

ధూళితో నిండిపోయిన ఎయిర్ ఫిల్టర్లు ఇంజిన్‌కు అందే గాలిని నియంత్రిస్తాయి. ఇది ఇంధన దహన ప్రక్రియను (Combustion) దెబ్బతీసి, ఇంధన వినియోగాన్ని పెంచుతుంది. భారతదేశంలో ధూళి ఎక్కువగా ఉండే రోడ్లపై ఎయిర్ ఫిల్టర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం ఇంకా అవసరం. దీనితో పాటు కారులో అనవసరమైన బరువును తగ్గించడం కూడా ముఖ్యం. చాలా మంది టూల్స్, బ్యాగులు లేదా ఇతర వస్తువులను నెలల తరబడి కారు బూట్ స్పేస్ లోనే ఉంచేస్తూ ఉంటారు. ఈ అదనపు బరువు ఇంజిన్‌పై ఎక్కువ భారాన్ని మోపుతుంది. ముఖ్యంగా సిటీ ట్రాఫిక్‌లో ప్రయాణించేటప్పుడు కారులో ఉన్న అనవసరమైన సామాన్లను తొలగించడం వల్ల ఇంధన సామర్థ్యం స్వల్పంగా మెరుగవుతుంది.

వీల్ అలైన్‌మెంట్ , డాష్‌బోర్డ్ వార్నింగ్స్

కారు నడుపుతున్నప్పుడు స్టీరింగ్ కొద్దిగా పక్కకు లాగుతున్నట్లు అనిపించినా లేదా కారు ఒక వైపునకు వెళ్తున్నట్లు ఉన్నా వీల్ అలైన్‌మెంట్ దెబ్బతిన్నట్లు అర్థం చేసుకోవాలి. సరైన అలైన్‌మెంట్ లేకపోవడం వల్ల రోడ్డుపై డ్రాగ్ పెరిగి, కాలక్రమేణా మైలేజ్ తగ్గిపోతుంది. కాబట్టి వీల్ అలైన్‌మెంట్‌ను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. అలాగే డాష్‌బోర్డ్‌పై వచ్చే వార్నింగ్ లైట్లను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఇంజిన్ లేదా సెన్సార్లలో వచ్చే చిన్న చిన్న సమస్యలు కూడా కారు ఇంధన సామర్థ్యాన్ని నిశ్శబ్దంగా ప్రభావితం చేస్తాయి. డాష్‌బోర్డ్‌పై ఏదైనా హెచ్చరిక సిగ్నల్ కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా కారును మెకానిక్ వద్ద తనిఖీ చేయించడం ఉత్తమం. ఈ చిన్న జాగ్రత్తలు మీ ప్రయాణాన్ని సేఫ్ గా ఉంచడమే కాకుండా జేబుకు చిల్లు పడకుండా కాపాడతాయి.

Frequently Asked Questions

కారు మైలేజ్ పెంచడానికి టైర్ ప్రెజర్ ఎందుకు ముఖ్యం?

టైర్లలో గాలి తక్కువగా ఉంటే రోడ్డుపై ఘర్షణ పెరిగి, ఇంజిన్ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. క్రమం తప్పకుండా టైర్ ప్రెజర్ చెక్ చేసుకోవడం వల్ల మైలేజ్ మెరుగుపడుతుంది.

కారు సర్వీసింగ్ ఆలస్యం చేయడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి?

సర్వీసింగ్ ఆలస్యం చేస్తే ఇంజిన్ పనితీరు తగ్గి, ఇంధన సామర్థ్యం దెబ్బతింటుంది. సకాలంలో సర్వీసింగ్ చేయించడం వల్ల ఇంజిన్ లైఫ్ పెరిగి, ఇంధన ఖర్చులు తగ్గుతాయి.

ఎయిర్ ఫిల్టర్ శుభ్రంగా లేకపోవడం వల్ల మైలేజ్ పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

మురికిగా ఉన్న ఎయిర్ ఫిల్టర్లు ఇంజిన్ కు అందే గాలిని అడ్డుకుంటాయి. దీనివల్ల ఇంధన దహన ప్రక్రియ దెబ్బతిని, ఇంధన వినియోగం పెరుగుతుంది.

కారులో అనవసరమైన బరువు తగ్గించడం వల్ల మైలేజ్ ఎలా మెరుగుపడుతుంది?

కారులో అదనపు బరువు ఉంటే ఇంజిన్ పై భారం పెరుగుతుంది. ముఖ్యంగా సిటీ ట్రాఫిక్ లో ప్రయాణించేటప్పుడు అనవసరమైన వస్తువులను తొలగించడం వల్ల ఇంధన సామర్థ్యం స్వల్పంగా మెరుగుపడుతుంది.

డాష్‌బోర్డ్‌పై వచ్చే వార్నింగ్ లైట్లను నిర్లక్ష్యం చేయవచ్చా?

డాష్‌బోర్డ్‌పై వచ్చే వార్నింగ్ లైట్లను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న సమస్యలు కూడా ఇంధన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి, కాబట్టి వెంటనే మెకానిక్ వద్ద చూపించడం మంచిది.

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
AP Urban Local body Election Results: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం.. కంచుకోటలోనూ వైసీపీకి బిగ్ షాక్
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం.. కంచుకోటలోనూ వైసీపీకి బిగ్ షాక్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
ENE Repeat Trailer Review : 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
Embed widget