అన్వేషించండి

బడ్జెట్ ధరలో KIA EV.. BAAS విధానంతో భారీగా తగ్గనున్న కారు ధరలు ! స్టైలిష్ లుక్.. హైటెక్ ఫీచర్లు

Kia Rental Plan: కియా కంపెనీ కొత్త బ్యాటరీ రెంట్ పథకంతో ఎలక్ట్రిక్ కార్లు పెట్రోల్ కార్ల కంటే కూడా మరింత చౌకగా మారనున్నాయి. అయితే అందుకోసం ఏం చేయాలి, కంపెనీ ప్లాన్ ఇక్కడ తెలుసుకోండి.

KIA Motors | భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు (EV) పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ (Kia) మధ్యతరగతి వినియోగదారుల కోసం ఒక భారీ సర్ప్రైజ్ సిద్ధం చేస్తోంది. విలాసవంతమైన ఇవి6 (EV6), క్యారెన్స్ క్లావిస్ వంటి మోడళ్ల తర్వాత, ఇప్పుడు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా ఒక అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురావడానికి కియా ప్లాన్ చేస్తోంది. తక్కువ ధరలో స్టైలిష్ లుక్, అత్యాధునిక ఫీచర్లు కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు.

ఈ కొత్త కియా కారు డిజైన్ పరంగా చాలా మోడ్రన్ గా, యువతను ఆకట్టుకునేలా ఉండబోతోందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. షార్ప్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, ఏరోడైనమిక్ బాడీ, స్టైలిష్ అలాయ్ వీల్స్‌తో రోడ్డుపై బెస్ట్ లుక్ ఇచ్చేలా కంపెనీ దీన్ని తీర్చిదిద్దుతోంది. కేవలం బయటి లుక్ మాత్రమే కాకుండా, లోపలి భాగంలో కూడా ప్రీమియం క్యాబిన్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అదిరిపోయే వైర్‌లెస్ కనెక్టివిటీ వంటి ఫీచర్లతో హైటెక్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది. భద్రత (Safety) విషయంలో రాజీ పడకుండా కియా తన ట్రేడ్ మార్క్ అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లను ఇందులో చేర్చే అవకాశాలున్నాయి.

Also Read: FASTag Recharge Methods: ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ విధానాలు - హైవే ప్రయాణాన్ని మరింత సులభం చేసే టిప్స్ ..

బ్యాటరీ సామర్థ్యం, డ్రైవింగ్ రేంజ్ పై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, సిటీ ట్రాఫిక్ తో పాటు హైవే జర్నీలకు కూడా సెట్ అయ్యేలా మెరుగైన రేంజ్‌ను ఈ కియా కారు అందిస్తుందని మార్కెట్ వర్గాల అంచనా వేస్తున్నాయి. తక్కువ సమయంలోనే ఛార్జ్ చేసుకునేలా ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కారు ధరను సామాన్యులకు భారం కాకుండా ఉంచడానికి కియా ఒక సరికొత్త ప్లాన్ కియా పాటించనుంది. 

బాస్ సర్వీసు(BaaS) తో ప్రయోజనం
ముఖ్యంగా బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) మోడల్‌ను కియా ఈ కారుకు అందించాలని భావిస్తోంది. ఈ పద్ధతిలో కస్టమర్లు కారును కొని, బ్యాటరీని అద్దెకు తీసుకోవడం లేదా విడివిడిగా ఫైనాన్స్ చేయడం ద్వారా కారు ధరను భారీగా తగ్గించుకోవచ్చు. దాంతో తక్కువ ధరకు సామాన్యులు సైతం కొనుగోలు చేసేలా చూడాలని కియా కంపెనీ చర్యలు చేపట్టి బాస్ సర్వీస్ తీసుకొస్తుంది.  ఇప్పటికే కియా క్యారెన్స్ క్లావిస్ మోడల్‌లో సక్సెస్ అయిన ఈ విధానం, కొత్త ఎలక్ట్రిక్ కారుతో మరింత మంది వినియోగదారులను ఆకర్షించాలని సరికొత్త వ్యూహాలతో కార్ మోడల్స్ లాంచ్ చేస్తోంది. కస్టమర్లలో నమ్మకం ఉన్న కార్ల బ్రాండ్లలో కియా ఒకటి.

Also Read: Tata Punch EMI : సరికొత్త టాటా పంచ్‌ కారును అనంతపురంలో కొనాలంటే ఎంత ఈఎంఐ చెల్లించాలి? 

ప్రస్తుతం కియా నుంచి EV6 (ప్రీమియం ఎలక్ట్రిక్), కియా క్యారెన్స్ క్లావిస్ EV వంటి కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కియా కార్లు వాటి మోడ్రన్ డిజైన్, షార్ప్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు,  హైటెక్ ఇంటీరియర్ ఫీచర్లు పెద్ద టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ కనెక్టివిటీ వంటి వాటితో కస్టమర్లకు ఆకర్షిస్తున్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

యూత్‌ కోసం కొత్త 4V ఇంజిన్‌తో వచ్చిన Bajaj Pulsar N160.. ఏ వేరియంట్‌ కొనాలి?
కొత్త Bajaj Pulsar N160 లో ఐదు వేరియంట్లు.. మీరు ఏ వేరియంట్‌ కొంటారు?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget