అన్వేషించండి

నష్టాల నుంచి రికవర్ అవుతున్న Ola Electric .. బ్యాటరీ ఉత్పత్తిపై ఫోకస్, దిగిరానున్న EV ధరలు

Ola Electric Report: బుధవారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి; Ola Electric షేర్లు కూడా లాభాలను నమోదు చేశాయి. గత కాలంతో పోలిస్తే, ఈసారి తమ నష్టాలు తగ్గినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఓలా ఎలక్ట్రిక్ Q4FY26లో నష్టాలు తగ్గి, ఆదాయం రూ. 265 కోట్లకు చేరింది.
  • కస్టమర్ సర్వీస్ సమయం 9 రోజుల నుండి 1 రోజుకు తగ్గింది.
  • 6 GWh గీగాఫ్యాక్టరీ సిద్ధమైంది, బ్యాటరీ సామర్థ్యం 20 GWhకి పెరుగుతుంది.
  • ఎలక్ట్రిక్ స్కూటీల రిజిస్ట్రేషన్లు 20% పెరిగాయి, డిమాండ్ పెరుగుతోంది.

Ola Electric: భారత స్టాక్ మార్కెట్ బుధవారం స్వల్ప లాభాలతో ముగిసింది. ఈ సమయంలో ఇన్వెస్టర్ల ప్రత్యేక నిఘా ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలపై నెలకొంది. ఓలా ఎలక్ట్రిక్ షేర్లు దాదాపు 1 శాతం పెరిగి 36.96 రూపాయలకు చేరుకుంది. ఓలా కంపెనీ తన క్యూ4 ఆర్థిక సంవత్సరం26 (Q4FY26) అప్‌డేట్‌లో నష్టాలు తగ్గడం, సేవల మెరుగుదల, బ్యాటరీ విస్తరణ ప్లాన్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించింది.

ఓలా కంపెనీ లేటెస్ట్ ఆప్డేట్స్.. 
ఓలా కంపెనీ ప్రకారం, మార్చి 2026 త్రైమాసికంలో దాని రెవెన్యూ (ఆదాయం) తగ్గి 265 కోట్లకు చేరుకుంది, ఇది గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 611 కోట్లుగా ఉంది. అయితే, ఈ సమయంలో కంపెనీ నష్టాలు చాలా వరకు తగ్గాయి. Q4FY26 లో నికర నష్టం 500 కోట్లుగా ఉంది, గతేడాది ఇదే కాలంలో ఇది 870 కోట్ల రూపాయలుగా ఉండేది. ఓలా ఎలక్ట్రిక్ తన గ్రాస్ మార్జిన్ కూడా మెరుగైంది. అలాగే ఆపరేటింగ్ EBITDA నష్టం కూడా గతంలో కంటే తగ్గింది. పూర్తి FY26 లో కంపెనీ మొత్తం రెవెన్యూ 2,253 కోట్ల రూపాయలు ఉంది. వార్షిక నికర నష్టం తగ్గి 1,833 కోట్లకు  చేరుకుంది.

సర్వీస్ క్వాలిటీలో మెరుగుదల
ఓలా కంపెనీ తన సర్వీస్ క్వాలిటీ (సేవా నాణ్యత) లో పెద్ద మార్పు కనిపించిందని కూడా తెలిపింది. అక్టోబర్ 2025 లో కస్టమర్ల సర్వీస్‌కు సగటున 9 రోజులు పట్టేది. అదే మార్చి 2026 నాటికి ఈ సమయం తగ్గి దాదాపు 1 రోజుకు చేరుకుందని పేర్కొంది. వారంటీ ఖర్చులు కూడా రూ. 555 కోట్ల నుండి తగ్గి కేవలం 59 కోట్ల రూపాయలకు తగ్గింది. 

Also Read: ప్రీమియం లుక్, మోడ్రన్ ఫీచర్లతో మార్కెట్లోకి రానున్న Tata Tiago Facelift, పాపులర్ అవుతుందా?

బ్యాటరీ వ్యాపారంలో విస్తరణ
ఈ నష్టాల తర్వాత ఓలా ఇప్పుడు బ్యాటరీ విస్తరణపై ఫోకస్ చేసింది. ఓలా ఎలక్ట్రిక్ బ్యాటరీ వ్యాపారంలో పెద్ద ఎత్తున విస్తరణ చేపట్టే ప్రణాళికను కూడా వివరించింది. కంపెనీ 6 GWh గీగాఫ్యాక్టరీ పని దాదాపు పూర్తయింది . దీనిని ఓలా త్వరలోనే ప్రారంభించనుంది. కంపెనీ వచ్చే ఏడాది నాటికి బ్యాటరీ సామర్థ్యాన్ని 20 GWh వరకు పెంచడానికి సిద్ధమవుతోంది.

ఎలక్ట్రిక్ స్కూటీలకు పెరిగిన డిమాండ్
 ఏప్రిల్ 2026లో తన వాహనాల రిజిస్ట్రేషన్లు 20 శాతం పెరిగాయని ఓలా కంపెనీ తెలిపింది. రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. కంపెనీ ఈ సెగ్మెంట్‌లో దాదాపు 50 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నట్లు తెలిపింది.  FY27 మొదటి త్రైమాసికంలో ఆర్డర్లు రెట్టింపు వరకు పెరగొచ్చని భావిస్తోంది. మెరుగైన సర్వీస్, స్ట్రాంగ్ సప్లై, పెరుగుతున్న డిమాండ్ వల్ల భవిష్యత్తులో భారీ ప్రయోజనం చేకూరుతుందని కంపెనీ నమ్మకం ఉంచింది. 

ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ (EV 2W) సెగ్మెంట్‌లో అత్యధిక మార్కెట్ వాటాతో కొనసాగుతోంది. కంపెనీ విడుదల చేసిన సరికొత్త ఆర్థిక ఫలితాలు, నష్టాలు తగ్గాయని చూపిస్తున్నప్పటికీ, గతేడాదితో పోలిస్తే రెవెన్యూ తగ్గింది. సర్వీస్ డెలివరీ సమయాన్ని 9 రోజుల నుండి 1 రోజుకు తగ్గించడం తమ కస్టమర్లలో నమ్మకాన్ని పెంచుతోంది. ఓలా కంపెనీ సొంతంగా బ్యాటరీ సెల్స్ తయారు చేయడంపై ఫోకస్ చేస్తోంది. వారి 'గీగాఫ్యాక్టరీ' అందుబాటులోకి వస్తే, బ్యాటరీల దిగుమతి ఖర్చులు భారీగా తగ్గుతాయి. దాంతో భవిష్యత్తులో వాహనాల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

Frequently Asked Questions

ఓలా ఎలక్ట్రిక్ Q4FY26 లో ఆదాయం ఎంత?

ఓలా ఎలక్ట్రిక్ Q4FY26 లో ఆదాయం 265 కోట్లకు చేరుకుంది, ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో 611 కోట్లుగా ఉంది.

ఓలా ఎలక్ట్రిక్ Q4FY26 లో నికర నష్టం ఎంత?

Q4FY26 లో ఓలా ఎలక్ట్రిక్ నికర నష్టం 500 కోట్లుగా ఉంది, గతేడాది ఇదే కాలంలో ఇది 870 కోట్లుగా ఉండేది.

ఓలా ఎలక్ట్రిక్ సేవా నాణ్యతలో ఎలాంటి మెరుగుదల కనిపించింది?

అక్టోబర్ 2025 లో కస్టమర్ల సర్వీస్‌కు సగటున 9 రోజులు పట్టేది, మార్చి 2026 నాటికి ఇది 1 రోజుకు తగ్గింది.

ఓలా ఎలక్ట్రిక్ బ్యాటరీ వ్యాపారంలో విస్తరణ ప్రణాళికలు ఏమిటి?

ఓలా ఎలక్ట్రిక్ 6 GWh గీగాఫ్యాక్టరీని త్వరలో ప్రారంభించనుంది మరియు వచ్చే ఏడాది నాటికి బ్యాటరీ సామర్థ్యాన్ని 20 GWh వరకు పెంచనుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

17 వేల EMIపై Hyundai Creta కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి
17 వేల EMIపై Hyundai Creta కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి
Maruti Dzireకు ప్రత్యామ్నాయంగా Honda Amaze కొనబోతున్నారా? ముందు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోండి
కొత్త Honda Amaze కొనేవాళ్లకు అలెర్ట్‌! ఈ సెడాన్‌లో మీకు తెలియాల్సిన 3 ప్లస్‌లు, 3 మైనస్‌లు!
Ethanol: పెట్రోల్ తర్వాత డీజిల్‌పైనా ప్రయోగం.. ఇథనాల్‌పై కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గింది?
డీజిల్‌లో ఇథనాల్ కలపడం కుదరదు.. అసలు కారణం ఇదే!
బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
హోండా రెబెల్ 300 vs రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350 - ఏది స్పెషల్‌ బైక్‌?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget