అన్వేషించండి

Harley-Davidson X440 S vs Royal Enfield Guerrilla 450: రోడ్‌పై అసలైన కింగ్ ఎవరు? ఫుల్ డీటెయిల్స్!

హార్లే డేవిండ్‌సన్ X440S, రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గెరిల్లా 450 మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. 3 లక్షల బడ్జెట్‌లో లభించే ఈ బైక్స్‌లో మీకు ఏది సరిపోతుందో ఇక్కడ తెలుసుకోండి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హార్లే-డేవిడ్సన్ X440S, రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450 ధరలు రూ. 2.5 లక్షల లోపు.
  • రెండు బైకులు రెట్రో లుక్, టీఎఫ్టీ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ కలిగి ఉంటాయి.
  • హార్లే X440S 27.3PS పవర్, గెరిల్లా 450 40PS పవర్ ఉత్పత్తి చేస్తుంది.
  • సిటీ రైడ్స్ కి హార్లే, అడ్రినలిన్ రష్ కోసం గెరిల్లా 450 సరైనవి.

Harley-Davidson X440 S vs Royal Enfield Guerrilla 450: భారతీయ రోడ్లపై ఇప్పుడు 400సీసీ సెగ్మెంట్‌ బైకుల హవా నడుస్తోంది. ఒకప్పుడు కేవలం రాయల్ ఎన్‌ఫీల్డ్‌ మాత్రమే రాజ్యమేలిన ఈ విభాగంలో ఇప్పుడు అంతర్జాతీయ దిగ్గజం హార్లే డేవిడ్‌సన్ కూడా ఎంట్రీ ఇచ్చింది. మీరు మూడు లక్షల బడ్జెట్‌లో ఒక పవర్‌ఫుల్, స్టైలిష్, రెట్రో లుక్‌ ఉన్న బైక్‌ కోసం చూస్తున్నారా అయితే మీ ముందు రెండు అద్బుతమైన ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి హార్లే డేవిడ్‌సన్ 440S, రెండోది రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గెరిల్లా 450 అపెక్స్‌. 

ఈ రెండు చూడటానికి రోడ్‌స్టర్లే అయినా, వీటి స్వభావం, పనితీరు, ఇచ్చే ఫీల్డ్ మాత్రం పూర్తిగా భిన్నం. ఈ రెండు బైకుల మధ్య ఉన్న తేడాలను, వీటీ ప్రత్యేకతలు గురించి తెలుసుకోండి. 

H-D X 440 motorcycle beauty shot

ధర, వేరియంట్ల మధ్య తేడా 

బైక్ కొనేటప్పుడు ఎవరైనా ముందుగా చూసేది ధర. హార్లే, రాయల్‌ ఎన్‌ఫీల్డ్ ధరలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉండటం విశేషం. హార్లే డేవిడ్‌సన్ X440S ఎక్స్‌ షోరూమ్ ధర 2,59,000 రూపాయలుగా ఉంటే, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ గెరిల్లా 450 అపెక్స్‌ 2,49, 194 నుంచి 2,56, 387 మధ్య ఉంటుంది. 

ఒకప్పుడు హార్లే అంటే భారీ ధర అనుకునే వారు, కానీ ఇప్పుడు రాయల్‌ ఎన్‌ఫీల్డ్ ధరకు సమానంగా హార్లే బైక్ లభించడం వినియోగదారులకు కలిసొచ్చే అంశం. 

H-D X 440 motorcycle beauty shot

డిజైన్‌, డైమన్సన్స్‌  

రెట్రో లుక్ విషయంలో ఈ రెండు బైకులు తమదైన ముద్ర వేస్తాయి. రెండూ పొడవుగా, వెడల్పుగా ఉండి రోడ్‌పై మంచి ప్రెజెన్స్‌ను కలిగి ఉంటాయి. హార్లే డేవిడ్‌సన్ X440S బరువు 190.5 కేజీలుగు ఉండగా, గెరిల్లా 450 కొంచెం తేలికగా 185 కేజీలు ఉంటుంది. ట్రాపిక్‌లో లేదా పార్కింగ్ చేసేటప్పుడు గెరిల్లా కొంచెం ఈజీగా ఉంటుంది. 

హార్లే సీటు ఎత్తు 805mm కాగా, గెరిల్లా 780mm మాత్రమే. దీని వల్ల తక్కువ ఎత్తు ఉన్న రైడర్లకు గెరిల్లా 450 అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. గెరిల్లాలో రెడ్‌, బ్లాక్‌, గ్రే, గ్రీన్ వంటి బోల్డ్‌ కలర్స్‌ ఉన్నాయి. ముఖ్యంగా ఎరుపు రంగు బైక్‌ చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. హార్లే మాత్రం సింపుల్‌గా బ్లాక్‌, ఆరెంజ్‌ రంగుల్లో మాత్రమే లభిస్తుంది. 

H-D X 440 motorcycle beauty shot

ఫీచర్లు, సేఫ్టీ

టెక్నాలజీ పరంగా రెండు బైకులు నేటి కాలానికి తగ్గట్టుగా ఉన్నాయి. రెండింటిలోనూ టీఎఫ్‌టీ కన్సోల్‌, బ్లూటూత్ కనెక్టవిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450లో సర్క్యులర్‌ టీఎఫ్‌టీ కన్సోల్‌ ఉంటుంది. ఇది చూడటానికి ప్రీమియంగా ఉండటమే కాకుండా చదవడానికి చాలా సులువుగా ఉంటుంది. ఇందులో ఎకో, పెర్ఫార్మెన్స్ అనే రెండు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. 

హార్లే డేవిడ్‌సన్ X440Sలో డైమండ్‌ కట్ వీల్స్, మెషిన్డ్‌ ఇంజిన్‌ ఫిన్స్‌ వంటి అందమైన ఎలిమెంట్స్‌ ఉన్నాయి. ఇందులో ఇ-సిమ్‌ ఫీచర్లు ఉన్నప్పటికీ , రోజువారీ జీవితంలో అవి పెద్దగా ఉపయోగపడకపోవచ్చని నిపుణులు అభిప్రాయం. 

H-D X 440 motorcycle beauty shot

ఇంజిన్ పని తీరు 

ఈ రెండు బైక్‌లు మధ్య అసలైన తేడా ఇక్కడే కనిపిస్తుంది. వీటి ఇంజిన్లు పని చేసే తీరు పూర్తిగా వేర్వేరు. హార్లే డేవిడ్‌సన్ X440Sలో 440cc ఎయిర్‌ అండ్ ఆయిల్ కూల్డ్‌ ఇంజిన్ ఉంది. ఇది 27.3PS పవర్‌, 38Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌ పూర్తిగా టార్క్‌పై ఆధారపడి నడుస్తుంది. తక్కువ ఆర్‌పీఎం వద్దే ఇది అద్భుతమైన పవర్‌ ఇస్తుంది. హైవేపై 100kmph వేగంతో వెళ్తున్నప్పుడు కూడా ఇంజిన్ చాలా ప్రశాంతంగా అలసట లేకుండా ఉంటుంది. రిలాక్స్‌డ్‌గా రైడ్‌ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్‌. 

రాయల్‌ఎన‌ఫీల్డ్ గెరిల్లా 450లో 452cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 40PS పవర్‌, 40Nm టార్క్‌ను ఇస్తుంది. గెరిల్లా ఇంజిన్ మూడు వేల ఆర్‌పీఎం దాటిన తర్వాత అసలైన విశ్వరూపం చూపిస్తుంది. అకస్మాత్తుగా పవర్ పెరగం వల్ల రైడర్‌కు ఒకరకమైన థ్రిల్ కలుగుతుంది. ఇది వేగంగా దూసుకుపోయే స్వభావం కలిగి ఉంటుంది. 

ఎవరు ఏ బైక్ కొనుగోలు చేయాలి

సిటీలో హూందాగా తిరుగుతూ అప్పుడప్పుడు హైవే ట్రిప్పులకు వెళ్లాలనుకుంటే హార్లే X440S బాగుంటుంది. అదే మీరు అడ్రినాలిన్ రష్ కోరుకునే యువకులైతే, వేగమే ప్రాధాన్యత అయితే గెరిల్లా 450 మీకు సెట్ అవుతుంది. 

మీ బడ్జెట్‌ రూ. ౩ లక్షల లోపు ఉండి, బ్రాండ్ వాల్యూ, కంఫర్ట్ కావాలనుకున్న్పుడు హార్లే వైపు చూడండి. అదే అడ్వాన్స్డ్‌ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, ఎక్కువ పవర్ కావాలనుకుంటే గెరిల్లా సరైంది. కాస్త పొట్టిగా ఉన్న వారు, ట్రాఫిక్‌లో సులువుగా బైక్ నడపాలనుకునే వారు గెరిల్లా 450ను ఎంచుకోవచ్చు. గంభీరమైన శబ్దం, రిలాక్స్డ్‌ క్రూజింగ్ కావాలనుకునే వారు హార్లేను టెస్ట్ రైడ్ చేయాలి. 

చివరిగా చెప్పాలంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 అనేది ఒక పవర్‌ఫుల్ రోడ్‌స్టర్, ఇది రైడర్‌ నుంచి కొంచెం ఎక్కువ ఏకాగ్రతను కోరుకుంటుంది. కానీ అద్భుతమైన థ్రిల్ ఇస్తుంది. హార్లే డేవిడ్‌సన్ X440S మాత్రం ఒక క్లాసిక్ బైక్. ఇది మిమ్మల్ని ప్రశాంతంగా గమ్యానికి చేరుస్తుంది.  

Frequently Asked Questions

హార్లే డేవిడ్‌సన్ X440S మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 ధరల మధ్య తేడా ఏమిటి?

హార్లే డేవిడ్‌సన్ X440S ఎక్స్‌ షోరూమ్ ధర 2,59,000 రూపాయలు. రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 అపెక్స్‌ ధర 2,49,194 నుంచి 2,56,387 మధ్య ఉంటుంది.

రెండు బైకుల బరువు మరియు సీటు ఎత్తులో తేడాలు ఏమిటి?

హార్లే డేవిడ్‌సన్ X440S బరువు 190.5 కేజీలు, గెరిల్లా 450 బరువు 185 కేజీలు. హార్లే సీటు ఎత్తు 805mm కాగా, గెరిల్లా సీటు ఎత్తు 780mm.

రెండు బైకులలో ఏయే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?

రెండు బైకులలోనూ టీఎఫ్‌టీ కన్సోల్‌, బ్లూటూత్ కనెక్టవిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. గెరిల్లాలో ఎకో, పెర్ఫార్మెన్స్ అనే రెండు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి.

హార్లే డేవిడ్‌సన్ X440S మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 ఇంజిన్‌ల పనితీరులో ప్రధాన తేడా ఏమిటి?

హార్లే డేవిడ్‌సన్ X440S 440cc ఎయిర్‌ అండ్ ఆయిల్ కూల్డ్‌ ఇంజిన్‌ తక్కువ ఆర్‌పీఎం వద్ద పవర్ ఇస్తుంది. గెరిల్లా 450 452cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ మూడు వేల ఆర్‌పీఎం దాటిన తర్వాత ఎక్కువ పవర్‌తో థ్రిల్‌ను అందిస్తుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
BYD Denza N8 EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget