అన్వేషించండి

Summer Car Care Tips: ఎండల్లో మీ కారు ఇంజిన్ సీజ్ అవ్వకుండా ఉండాలా? నిపుణులు చెబుతున్న ఐదు టిప్స్ పాటించండి!

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఈ భగభగమండే వేసవిలో మనులకే కాదు, మనం వాడే కార్లకు కూడా ప్రత్యేక రక్షణ అవసరం. లేదంటే ఇంజిన్ పూర్తిగా సీజ్ అయ్యే ప్రమాదం ఉంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వేసవిలో కారు ఇంజిన్ ఆయిల్ సరైన విస్కాసిటీతో వాడాలి.
  • ఇంజిన్ సీజ్ అవ్వకుండా ఆయిల్ ప్రెషర్ లైట్‌ను గమనించండి.
  • కూలింగ్ సిస్టమ్‌, కూలెంట్‌ స్థాయిని ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి.
  • టైర్లలో గాలి ఒత్తిడిని, కారును నీడలో పార్క్ చేయాలి.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కార్ల పని తీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కొత్త కారు అయినా, పాత కారు అయినా ఎండా కాలంలో సరైన మెయింటెనెన్స్‌ లేకపోతే భారీగా రిపేర్‌ ఖర్చులు తప్పవు. అందుకే వాహనదారులు తమ ప్రాణాలను , డబ్బును కాపాడుకోవడానికి ఈ కింది ఐదు ముఖ్యమైన విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. 

సరైన ఇంజిన్ ఆయిల్‌ అవసరం 

చాలా మంది ఇంజిన్ ఆయిల్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ వేసవిలో మాత్రం ఇంజిన్ ఆయిల్ పాత్ర చాలా కీలకమైంది. ఇది కేవలం లూబ్రికేషన్ మాత్రమే కాకుండా, ఇంజిన్ వేడిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆయిల్ ఎంత చిక్కగా  ఉంటే మీ బండి అంత సేఫ్‌. ఈ విస్కాసిటీ మంచిగా లేకపోతే అధిక వేడి కారణంగా సాధారణ అయిల్‌ పల్చగా మారిపోయి ఇంజిన్ భాగాలను కాపాడే సామర్థ్యం కోల్పోతుంది. 

వేసవి ఎండలను తట్టుకోవడానికి 10W-40 లేదా 15W-40 వంటి ఎక్కువ విస్కాసిటీ గ్రేడ్ ఆయిల్స్‌ను నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇవి ఎంత వేడి ఉన్నా చిక్కదనాన్ని కోల్పోవు. తప్పుడు గ్రేడ్ ఆయిల్ వాడితే ఇంజిన్ భాగాల మధ్య రాపిడి పెరిగి ఓవర్ హీటింగ్ జరుగుతుంది. 

ఇంజిన్ సీజ్ కాకుండా ఏం చేయాలి?

ఇంజిన్‌లోని పిస్టన్లు, క్రాంక్‌ షాఫ్ట్‌ వంటి భాగాలు విపరీతమైన వేడి వల్ల ఒకదానికొకటి అతుక్కుపోయినప్పుడు ఇంజిన్ సీజ్ అవుతుంది. ది జరిగితే కారు యజమానులకు లక్షల్లో ఖర్చు అవుతుంది. ఇంజిన్ నుంచి వింత శబ్దాలు రావడం, డ్యాష్ బోర్డుపై ఆయిల్‌ ప్రెషర్ వార్నింగ్ లైట్ వెలగడం, పొగ రావడం లేదా పికప్ తగ్గిపోవడం ఈ ఇంజిన్ సీజ్‌కు ప్రధాన సంకేతాలు. డ్యాష్ బోర్డ్‌పై ఆయిల్ లైట్ వెలిగిన వెంటనే కారు ఆఫ్ చేయాలి. బలవంతంగా నడిపితే ఇంజిన్ పూర్తిగా పాడైపోతుంది. దీని రిపేర్ ఖర్చు కొన్ని సార్లు కారు మార్కెట్‌ విలువ కంటే ఎక్కువ కావచ్చు. 

కూలింగ్ సిస్టమ్‌, కూలెంట్ నిర్వహణ 

వేసవిలో ఇంజిన్ చల్లగా ఉండాలంటే రేడియేట్‌, కూలెంట్ వ్యవస్థ పక్కాగా పని చేయాలి. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు కూలెంట్ త్వరగా ఆవిరైపోతుంది. రైడియేటర్ ట్యాంక్‌లో కూలెంట్ ఎప్పుడూ మినిమం, మ్యాక్సిమమ్‌ మధ్య ఉందో లేదో చూసుకోవాలి. వారానికి ఒకసారైనా చెక్ చేయాలి. ఇంజిన్ వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడూ రేడియేర్‌ క్యాష్ తెరవకూడదు. అలా చేస్తే వేడి ఆవిరి, మరిగే నీరు ముఖంపై పడి తీవ్రమైన గాయాలు అవుతాయి. కనీసం అరగంట కారు చల్లబడిన తర్వాత క్యాప్ తెరవాలి. 

టైర్ల భద్రత చాలా ముఖ్యం 

హైవేలపై వెళ్తున్న వాహనాల టైర్లు పేలి ప్రమాదాలు జరిగిన ఘటనలు చాలా చూశాం. వేడి వల్ల టైర్లలోని గాలి వ్యాప్తి చెందుతుంది. అందుకే వేసవి కాలంలో లాంగ్ డ్రైవ్ వెళ్లేటప్పుడు కంపెనీ సూచించిన దాని కంటే ఒకటి లేదా రెండు పీఎస్‌ఐ తక్కువ గాలి ఉంచడం మంచిది. కారు కనీసం మూడు గంటలు కంటిన్యూగా నడపకుండా ఉన్నప్పుడు మాత్రమే ప్రెషర్ చెక్ చేయాలి. 

వేసవిలో పనికి వచ్చే మరికొన్ని స్మార్ట్ హ్యాక్స్ 

భాగం చేయాల్సిన స్మార్ట్ వర్క్ లభించే ప్రయోజనం
కారు ఏసీ ఎక్కగా ఏసీ అన్ చేయకుండా ఒక నిమిషం విండోస్ దించి బ్లోయర్‌ ఆన్ చేయాలి వేడి గాలి బయటకు పోయి, కారు త్వరగా చల్లబడుతుంది. 
పెట్రోల్ ట్యాంక్ వేసవి కాలంలో ట్యాంక్ ఫుల్ చేయించకండి గ్యాస్ వ్యాకోచించడానికి కొంచెం ఖాళీ స్థలం ఉంటుంది. 
కారు బాడీ/పెయింట్    వీలైనంత వరకు నీడలో పార్క్ చేయాలి. లేదా వాక్స్ పాలిష్ వాడాలి. యూవీ కిరణాల వల్ల కారు రంగు వెలిసిపోకుండా ఉంటుంది. 

వేసవి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు ఎంతో మేలు చేస్తాయి. మీ కారు డ్యాష్ బోర్డుపై ఎలాంటి వార్నింగ్ లైట్స్ కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెటంనే మెకానిక్‌ను సంప్రందించండి. 

Frequently Asked Questions

వేసవిలో ఇంజిన్ ఆయిల్ ఎందుకు ముఖ్యం?

వేసవిలో ఇంజిన్ ఆయిల్ ఇంజిన్ వేడిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అధిక విస్కాసిటీ గ్రేడ్ ఆయిల్స్ వేడిలో కూడా చిక్కదనాన్ని కోల్పోవు, ఇంజిన్ భాగాలను రక్షిస్తాయి.

ఇంజిన్ సీజ్ అవ్వడానికి సంకేతాలు ఏమిటి?

ఇంజిన్ నుంచి వింత శబ్దాలు రావడం, డ్యాష్ బోర్డుపై ఆయిల్ ప్రెషర్ వార్నింగ్ లైట్ వెలగడం, పొగ రావడం లేదా పికప్ తగ్గిపోవడం ఇంజిన్ సీజ్ అవ్వడానికి సంకేతాలు.

వేసవిలో కూలెంట్ స్థాయిని ఎలా తనిఖీ చేయాలి?

రేడియేటర్ ట్యాంక్‌లో కూలెంట్ ఎప్పుడూ మినిమం, మ్యాక్సిమమ్‌ మధ్య ఉందో లేదో వారానికి ఒకసారి చూసుకోవాలి. ఇంజిన్ వేడిగా ఉన్నప్పుడు రేడియేటర్ క్యాప్ తెరవకూడదు.

వేసవిలో కారు టైర్లలో గాలి ఎంత ఉండాలి?

వేసవిలో టైర్లలోని గాలి వ్యాప్తి చెందుతుంది. కంపెనీ సూచించిన దాని కంటే ఒకటి లేదా రెండు పీఎస్‌ఐ తక్కువ గాలి ఉంచడం సురక్షితం. కారు కనీసం మూడు గంటలు ఆగితేనే ప్రెషర్ చెక్ చేయాలి.

టాప్ హెడ్ లైన్స్

సరికొత్తగా మార్కెట్లోకి Skoda Slavia Facelift.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే.. ఫీచర్ల వివరాలు
సరికొత్తగా మార్కెట్లోకి Skoda Slavia Facelift.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే.. ఫీచర్ల వివరాలు
బజాజ్ చేతక్ EVని ఇంటికి తెచ్చుకోవడానికి లోన్‌ ఫెసిలిటీ.. కనీస డౌన్‌పేమెంట్‌, EMI పూర్తి వివరాలు
Bajaj Chetak C2501 ఎలక్ట్రిక్ స్కూటర్‌.. నెలకు కేవలం రూ.1500 EMIతో మీ సొంతం!
చలికాలంలో కారు తీసుకుని బయటకు వెళ్తున్నారా? ఈ 5 యాక్సెసరీస్ ఉంటే టెన్షన్ ఉండదు!
ఈ చలికాలంలో కారు డ్రైవింగ్ సేఫ్‌గా సాగాలంటే.. ఈ 5 యాక్సెసరీస్ తప్పనిసరి!
గూగుల్‌ మ్యాప్స్‌ మిర్రరింగ్‌ ఉన్న 8 బైక్‌లు.. పూర్తిగా కొత్త ప్రదేశంలోనూ ఈజీగా దారి తెలుసుకోవచ్చు!
బైక్‌ స్కీన్‌పైనే గూగుల్‌ మ్యాప్‌ కనిపిస్తుంది.. ధర కేవలం రూ.1 లక్షల నుంచి స్టార్ట్‌!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
8th Pay Commission: 8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
Dada Rules Delhi: ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Embed widget