Viral News: కోనసీమలో మోనాలిసా అంటూ బాలిక వీడియో తీశాడు.. చివరకు ఆ యువకుడి పరిస్థితి ఇదీ
Konaseema Monalisa: కోనసీమ ప్రాంతంలోని చెయ్యేరులో జరిగిన ఓ తీర్థమహోత్సవంలో పూసల దండలు అమ్ముకుంటున్న ఓ మైనర్ బాలిక వీడియో తీసి కోనసీమ మోనాలీసా అంటూ ఇన్‌ష్టాలో పోస్ట్ చేశాడు..

కోనసీమ: మహా కుంభమేళా మొత్తానికి సోషల్ మీడియా వేదికగా సెంట్రాఫ్ అట్రాక్షన్ ఏమైనా ఉందంటే అది పూసలమ్ముకునే మోనాలిసానే... మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ అమ్మాయి ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో పూసలు అమ్ముకుంటుండగా ఆమె కళ్లకు, ఆమె అందానికి ఫిదా అయిన ఓ వ్యక్తి ఆమె వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు... ఇక ఆ వీడియో ఎవ్వరూ ఊహించలేనంతగా వైరల్ అయ్యి దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. అంతే కాదు భాషతో సంబంధం లేకుండా మోనాలీసా వీడియోలు సోషల్ మీడియా వేదికలపై చక్కర్లు కొట్టాయి. దీంతో మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి యూట్యూబ్ ఛానెళ్లు సైతం మోనాలీసా ఇంటర్వ్యూ కోసం ఎగబడ్డారు. వీరే కాదు సాధారణ జనం కూడా ఆమెతో ఫోటోలు దిగేందుకు ఆమెను పోలీసులు దాచాల్సిన పరిస్థితి ఏర్పడిరది.
ఆమె చివరకు ట్రైన్ ఎక్కి తమ సొంతూరుకు వెళ్లాల్సి వచ్చింది.. ఆ తరువాత ఆమెను బాలివుడ్ దర్శక నిర్మాత కలిసి చివరకు సినిమాలోకూడా తీసుకున్నారు.. అయితే అలాగే అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓ తీర్ధమహోత్సవంలో పూసలు అమ్ముకుంటున్న ఓ బాలికను వీడియో తీసి కోనసీమ మోనాలిసా అంటూ పోస్ట్ చేశాడో యువకుడు.. అయితే ఇప్పుడు ఆయువకుడు కేసుల్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
తీర్ధమహోత్సవంలో వీడియో తీసి...
కోనసీమ ప్రాంతంలో కాట్రేనికోన మండలం చెయ్యేరులో సత్తెమ్మతల్లి తీర్ధమహోత్సవం మూడు రోజుల పాటు ఘనంగా జరిగింది. ఈ తీర్ధమహోత్సవంలో ముమ్మిడివరానికి చెందిన ఓ బాలిక తల్లితండ్రులకు బాసటగా ఉండేందుకు పూసల దండలు, ఇతర అలంకరణ వస్తువులు అమ్ముతుండగా ముమ్మిడివరంకు చెందిన దుర్గాప్రసాద్ అనే యువకుడు కోనసీమ మోనాలీసా అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అది బాగా వైరల్ అయ్యింది.. దీంతో కేవలం ఇన్‌స్టాలోనే కాకుండా సోషల్‌మీడియా ఇతర వేదికల్లోనూ ఈ వీడియో గిర్రున తిరగడంతో ఈ అమ్మాయిని గుర్తుపట్టిన వారు ఆమెను ఆటపట్టించడం మొదలు పెట్టారు.
ఈ బాలిక ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదోతరగతి చదువుతుండడంతో తోటి విద్యార్థులు కూడా ఆటపట్టించడం మొదలుపెట్టారు.. దీంతో ఆ అమ్మాయి వాళ్ల అమ్మకు చెప్పడంతో కుటుంబీకుల సలహాతో ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.. పోలీసుల దర్యాప్తులో ముమ్మిడివరానికి చెందిన దుర్గాప్రసాద్ అనే యువకుడు ఈ వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: Monalisa News: కేరళను షేక్ చేసిన మోనాలిసా భోంస్లే - డాన్స్ కూడా అదరగొట్టేసిందిగా !





















