Monalisa News: కేరళను షేక్ చేసిన మోనాలిసా భోంస్లే - డాన్స్ కూడా అదరగొట్టేసిందిగా !
Kerala: కేరళలోని ఓ జ్యూవలరీ షోరూమ్ మోనాలిసా ప్రారభించి డాన్స్ చేశారు. ఆమె వస్తుందని తెలియడంతో ఆ వీధి అంతా ఫ్యాన్స్ తో నిండిపోయింది.

Mona Lisa Dance: కుంభమేళా పుణ్యమా అని వైరల్ అయిన మోనాలిసా బోంస్లే ఇప్పుడు దేశవ్యాప్తంగా సెలబ్రిటీ అయ్యారు. జ్యూవలరీ దుకాణాల ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరై సందడి చేస్తున్నారు. కేరళలోని ఓ జ్యూవలరీ దుకాణం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై ఆమె డాన్స్ చేశారు.
മലയാളികൾക്ക് വാലാന്റൈൻസ് ഡേ ആശംസിച്ച് കുംഭമേള വയറൽ സുന്ദരി മൊണാലിസ😍 #monalisa #kumbhamela2025 #boche #bobychemmanur pic.twitter.com/mhCJWkv2Wn
— B4blaze (@B4blazeX) February 14, 2025
మోనాలిసా ఇప్పటి వరకూ పూర్తి స్థాయి మేకప్ లో ఎప్పుడూ కనిపించలేదు. కానీ కేరళలో మాత్రం.. ఆమె పూర్తి మేకోవర్ లో కనిపించడం వైరల్ గా మారింది.
വയറൽ സുന്ദരി മൊണാലിസക്ക് ഒപ്പം കോഴിക്കോടിന്റെ മണ്ണിൽ ആടി തിമർത്ത് ബോച്ചേ🔥 #monalisa #boche #letest pic.twitter.com/VLW2aRzc4T
— B4blaze (@B4blazeX) February 14, 2025
తాను ఓ సినిమాను కూడా అంగీకరించానని.. ఆమె సంతోషంగా చెబుతున్నారు.
#Viral girl who became popular at #MahaKumbh for her resemblance to #Monalisa offered a #movie #film #video #news #Prayagraj pic.twitter.com/4XTRbL14PD
— UnMuteINDIA (@LetsUnMuteIndia) February 15, 2025
ఇది సోషల్ మీడియా యుగమని.. రాత్రికి రాత్రి సూపర్ స్టార్లు అయిపోతారని కొంత మంది కాంప్లిమెంట్ ఇస్తున్నారు.
सोशल मीडिया का जमाना हैं
— Manisha kotwal (@Tarakotwal) February 15, 2025
किस्मत कब बदल जाये पता नहीं
गए थी कुंभ मेले में
पहुँच गई फ़िल्म इंडस्ट्री में #Monalisa #viralgirl pic.twitter.com/EMmjkIIo97
మధ్యప్రదేశ్ కు చెందిన ఓ గిరిజన కుటుంబానికి చెందిన మోనాలిసా భోంస్లే.. కుంభమేళాలో పూసలు అమ్ముతూ కనిపించారు. ఓ వ్యక్తి ఆమె చాలా అందంగా ఉందని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇన్ స్టంట్ వైరల్ గా మారింది. దీంతో ఆమె కుటంబం రాత మారిపోయింది. ఆమెను స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. సినిమా ఆఫర్ కూడా వచ్చింది దుకాణాల ప్రారంభోత్సవాలకు పిలుస్తున్నారు. కొన్ని బంగారు దుకాణాల ప్రారంభోత్సవాలకు కూడా ఆమెను పిలుస్తున్నారు. పూసలుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని పిలుస్తున్నారు.
అత్యంత నిరుపేద కుటుంబం.. పూసలు అమ్ముకుంటే తప్ప పూటగడవని కుటుంబం అయినప్పటికీ ఆమె మంచి కాన్ఫిడెంట్ గా సెలబ్రిటీ స్టేటస్ ను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. డాన్సులు కూడా నేర్చుకుంటున్నారు. ఆమె త్వరగా కలసిపోతూండటంతో సినిమా ఇండస్ట్రీలో కూడా పాతుకుపోతుందని గట్టిగా నమ్ముతున్నారు నెటిజన్లు. ఇప్పటికే ఆమెకు దక్షిణాది నుంచి కూడా ఆఫర్లు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒవర్ నైట్ తో మోనాలిసా లైఫ్ మారిపోయిది. దానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆమెపైనే ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
Also Read: 'వ్యక్తిగత పరిచయంతో వైసీపీ నేతలకు ప్రచారం' - ఆ కారణంతో చాలా కోల్పోయాను, సింగర్ మంగ్లీ బహిరంగ లేఖ





















