Budh Vakri March 2025: మీన రాశిలో వక్రంలో బుధుడి సంచారం..ఈ 5 రాశువారికి ఏప్రిల్ 08 వరకూ అష్టకష్టాలు!
Mercury Retrograde 2025: మార్చి 17 నుంచి ఏప్రిల్ 08 వరకూ మీన రాశిలో వక్రంలో బుధుడి సంచారం ఉంటుంది. ఈ ప్రభావం మీ రాశిపై ఎలా ఉంటుందో తెలుసా..

Budh Vakri March 2025: గ్రహాల రాకుమారుడైన బుధుడు ఫిబ్రవరి 28 నుంచి మీన రాశిలో సంచరిస్తున్నాడు.. మార్చి 17 నుంచి ఇదే రాశిలో తిరోగమనం చెందుతాడు. ఈ ప్రభావం మీ రాశిపై ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి
మేష రాశి
మీన రాశిలో బుధుడి సంచారం మీకు మంచి ఫలితాలనివ్వదు. ఈ సమయంలో చాలా ఉద్రేకపూరితంగా ఉంటారు. మాట్లాడే విధానం విమర్శలు ఎదుర్కొనేలా చేస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. కుటుంబం జీవితం బాగానే ఉంటుంది.
వృషభ రాశి
మీ రాశి నుంచి పదకొండో స్థానంలో బుధుడి తిరోగమనం..మీకు ఆర్థిక లాభాన్నిస్తుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు చేతికందుతుంది. పోటీపరీక్షలకు సిద్ధమయ్యే వారు మంచి ఫలితాలు పొందుతారు.
మిథున రాశి
పదో స్థానంలో బుధుడి తిరోగమనం మీరున్న రంగంలో మీ ఆధిపత్యం పెంచుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. మీ మాటల్లో మాధుర్యం ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం.
( మేష రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
కర్కాటక రాశి
మీ రాశి నుంచి తొమ్మిదో స్థానంలో బుధుడి తిరోగమనం మీకు విజయాన్నిస్తుంది. ఎప్పటినుంచో ఆస్తులు కొనుగోలు చేయాలనే మీప్రయత్నం సఫలం అవుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మంచి ఉద్యోగ ప్రతిపాదనలు అందుతాయి
సింహ రాశి
మీనంలో బుధుడి తిరోగమనం అంటే మీ రాశి నుంచి అష్టమంలో ఉన్నట్టు లెక్క..ఈ సమయం మీకు పెద్దగా కలసిరాదు. చట్టపరమైన విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండొచ్చు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. అప్పులు తీసుకోవడం అస్సలు మంచిదికాదు
కన్యా రాశి
మీ రాశి నుంచి ఏడో స్థానంలో గ్రహాల రాకుమారుడి తిరోగమనం మీకు మంచి చేస్తుంది. వైవాహిక జీవితం బావుంటుంది. ఉద్యోగంలో సంతోషం ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఎవరిపైనా అతి విశ్వాసం పెట్టుకోవద్దు.
తులా రాశి
మీనంలో బుధుడి తిరోగమనం తులా రాశివారికి ఖర్చులు పెంచుతుంది. ఉద్యోగులు ఉన్నతాధికారులతో అనవసర వాదనలకు దిగొద్దు. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అన్ని విషయాలను ఇతరులతో చర్చించవద్దు.
(వృషభ రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
వృశ్చిక రాశి
ఐదో స్థానంలో బుధుడి తిరోగమనం మీ కెరీర్ని ఎక్కడికో తీసుకెళుతుంది. ఉత్సాహంగా ఉంటారు. ఉన్నత విద్యలో మంచి ఫలితాలు సాధిస్తారు. వివాదాస్పద విషయాలను చర్చించవద్దు. మీరు ఉన్నత విద్యలో విజయం సాధిస్తారు. డబ్బు పెట్టుబడిలో మంచి ఫలితాలను పొందుతారు.
ధనుస్సు రాశి
బుధుడి తిరోగమనం సమయంలో ఈ రాశి ఉద్యోగులు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. వ్యవసాయదారుల ఆదాయం పెరుగుతుంది. నూతన ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం విషయంలో ఆందోళన ఉంటుంది
(మిథున రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
మకర రాశి
మూడో స్థానంలో బుధుడి తిరోగమనం మిమ్మల్ని వివాదాల్లోకి నెట్టేస్తుంది. మీకు తెలియకుండానే శత్రువులు ఏర్పడతారు. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించండి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉంటుంది.
కుంభ రాశి
మీనంలో బుధుడి తిరోగమనం ఉన్న సమయంలో మీకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అర్థరహిత పనులలో డబ్బు ఖర్చు చేయవద్దు. కుటుంబ సభ్యుల మధ్య తేడాలు ఉండవచ్చు. ప్రేమ సంబంధాలలో అపోహలు వస్తాయి
మీన రాశి
మీ రాశిలోనే గ్రహాల రాకుమారుడి తిరోగమనం...ఈ సమయంలో వ్యాపారంలో తీసుకునే నిర్ణయాలు నష్టపరుస్తాయి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో సమన్వయం ఉండేలా ప్లాన్ చేసుకోండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
(కర్కాటక రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
గమనిక: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















