AFG vs ENG Match Highlights | Champions Trophy 2025 లో పెను సంచలనం | ABP Desam
వాహ్..ఇది ఓ మ్యాచ్ ఇచ్చే కిక్కంటే. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో సరైన థ్రిల్లర్ పడట్లేదు అనుకుంటున్న టైమ్ లో పడింది ఆఫ్గాన్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్. గ్రూప్ ఏ లో సెమీస్ బెర్తులు కన్ఫర్మ్ అయిపోయాయి...ఎలిమినేట్ అయినోళ్లు టికెట్లు కూడా బుక్ చేసేసుకున్నారు. కానీ గ్రూప్ బీ మాత్రం ఓ వర్షానికి అడ్డంగా బలైపోయింది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మ్యాచ్ వర్షం కారణంగా రద్దవటంతో నిన్న రాత్రి జరిగిన ఇంగ్లండ్, ఆఫ్గాన్ మ్యాచ్ కీలకంగా మారిపోయింది. డూ ఆర్ డై సిచ్యుయేషన్ సిరీస్ లో నిలబడాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో పనికూన ఆప్గాన్ అరేయ్ ఎన్ని సార్లు చెప్పాలిరా మేం పని కూన కాదు కసి కూన అని...సర్లే ఈ ఇంగ్లండోళ్లకే మళ్లీ చెప్పాలా చెప్పాం చూసుకోండి అన్నట్లు బజ్ బాల్ టీమ్ ను బంతాడేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆఫ్గాన్ ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయిన ఇబ్రహీం జాద్రాన్ అనే గట్స్ ఉన్న కుర్రోడి అద్భుతమైన ఆటతో రేసులోకి స్పేస్ ఎక్స్ లా దూసుకొచ్చింది. కెప్టెన్ షాహిది, అజ్మతుల్లా, నబీ లాంటి ఆటగాళ్లను అడ్డంగా పెట్టుకుని రవి అస్తమించని సామ్రాజ్యానికి కాబులీ బిర్యానీ తినిపించాడు జాద్రాన్. ఏకంగా 177 పరుగులు బాదాడు జాద్రాన్. అది కూడా 146 బాల్స్ విత్ 12 ఫోర్స్, 6 సిక్సర్స్. మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ అది. దెబ్బకు బెన్ డకెట్ పేరు మీదున్న ఛాంపియన్స్ ట్రోఫీ హయ్యెస్ట్ స్కోర్ రికార్డ్ ఇబ్రహీం జాద్రాన్ వెళ్లిపోయింది. ఆఫ్గాన్ 325పరుగులు స్కోరు పెట్టింది బోర్డు మీద. దీజ్ ఇజ్ ద ఫస్ట్ టైమ్ ఆఫ్గాన్ వన్డేలో 300స్కోరును దాటడం. సరే 326 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ సేమ్ ఆఫ్గాన్ లానే 30కే రెండు వికెట్లు కోల్పోయింది. కానీ బెన్ డకెట్, జోస్ బట్లర్, ఓవర్టన్ తోడుగా జో రూట్ అద్భుతమైన ఫైట్ బ్యాక్ ఇచ్చాడు. కంటెంట్ ఉన్నోడికి టెస్టులు అయితే వన్డేలు అయితే ఏంటీ దేఖో మేరా ఫామ్ అన్నట్లు ఛేజింగ్ లో సెంచరీ బాదేశాడు. 120 పరుగులు చేశాడు జో రూట్. ఇన్ ఫాక్ట్ రూట్ ను అవుట్ చేశారు కాబట్టే ఆఫ్గాన్ గెలిచింది. స్కోరు బోర్డు మీద కొట్టాల్సిన పరుగులు ఎక్కువగా ఉండటంతో ఇంగ్లండ్ తీవ్రంగా ప్రతిఘటించినా..ఆప్గాన్ బౌలర్లు చాలా సార్లు తమ అనుభవ లేమిని చూపించినా.. పెద్దగా ఇబ్బంది ఎదురవ్వలేదు. కానీ చివరికి వచ్చేసరికి టెన్షన్ పెరిగిపోయింది. బట్ బ్యాటింగ్ లో 41 పరుగులు చేసిన అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్ లోనూ 5వికెట్లు తీసి ఇంగ్లండ్ ను అడ్డుకున్నాడు. ఫలితంగా ఆఫ్గానిస్థాన్ మరోసారి ఐసీసీ టోర్నీలో ఇంగ్లండ్ కు ఊహించని షాక్ ఇచ్చింది. 2023 వన్డే వరల్డ్ కప్ లోనూ ఇలాగే ఇంగ్లండ్ కు షాక్ ఇచ్చి ఏకంగా సెమీస్ కి అర్హత సాధించింది ఆఫ్గానిస్థాన్. అప్పుడు సెమీస్ లో ఆస్ట్రేలియాతో ఆడి మాక్స్ వెల్ వీర డబుల్ సెంచరీతో ఓడిన ఆఫ్గాన్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ లో తర్వాతి దశకు దర్జాగా వెళ్లాలంటే మళ్లీ రేపు జరగబోయే మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఓడించాలి. లేదంటే పక్క మ్యాచుల సమీకరణాలపైన ఆధారపడాల్సి వస్తుంది.





















