అన్వేషించండి

Medaram Jatara 2026: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ విశిష్టత మీకు తెలుసా? చరిత్ర చెబుతున్నదేంటి..?

Sammakka Saralamma Jatara | తెలంగాణలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న సమ్మక్క, సారలమ్మల జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర కావడం వెనుక చారిత్రాత్మక విశిష్టత మీకు తెలుసా.?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో జరిగే అతిపెద్ద, విశిష్ట ఆదివాసిల జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ప్రతి రెండు సంవత్సరాలకోసారి ఈ జాతర జరుగుతుంది. ఈ సంవత్సరం జనవరి 28 నుండి 31వ తేదీ వరకు జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల నుండి సుమారు కోటిన్నరకు పైగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ జాతర ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందింది.

మొదటి ప్రతాపరుద్రుడు దండెత్తి రావడంతో..

ఈ జాతర ఇంతలా ప్రసిద్ది చెందిడానికి కారణాలు, ఆలయ విశిష్టతపై విషయానికొస్తే.., 12వ శతాబ్దంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాతంలోని పొలవాసను పాలించే ఆదివాసి దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశారు. ఈ దంపతులకు సారలమ్మ, జంపన్న ఇద్దరు సంతానం కలిగారు. కాకతీయులకు ప్రతీ సంవత్సరం చెల్లించే కప్పం కట్టలేదన్న కారణంతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తుతాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పోయి అజ్ఞాత వాసం గడుపుతుంటాడు.

మేడారాన్ని పాలించే పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా వుంటూ కరువుకాటకాల కారణంగా కప్పం కట్టలేక పోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ ఆదివాసిల సార్వభౌమునికి వ్యతిరేకంగా తిరుగుబాటు భావాజాలాన్ని నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణాలతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు.

కుటుంబంతో కలిసి సమ్మక్క, సారక్కల వీరోచిత పోరాటం..

సాంప్రదాయ ఆయుధాలు ధరించి పోరాడిన పగిడిద్దరాజు, నమ్మక్క, సారక్క, జంపన్న, గోవిందరాజులు విరోచితంగా పోరాటం చేసినప్పటికీ సుశిక్షుతులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్యహత్యకు పాల్పడతాడు. అప్పటి నుంచి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్ప తిప్పలు పెడుతుంది. ఆదివాసి మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు.

చివరికి సమ్మక్కను కాకతీయుల సైన్యం వెనుక వైపు నుండి బరిసెతో పొడుస్తారు. శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుకల గుట్టవైపు వెళుతూ మార్గమధ్యములోనే అదృశ్యమవుతుంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్ళిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల కుంకుమ భరణ లభిస్తుంది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క - సారలమ్మ జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

ఈసారి 2026 లో జనవరి 28 నుండి 31 వ తేదీ వరకు మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర జరుపతున్నారు. జాతర మొదటి రోజైన 28-01-2026 నాడు కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకు వస్తారు. అదే రోజు కొండాయి నుండి గోవిందరాజులును, పూనుగుండ్ల నుండి పడిగిద్దరాజులను గద్దెలపై ప్రతిష్టింప చేస్తారు. రెండవ రోజున 29-01-2026 సమ్మక్కను చిలుకల గుట్ట నుండి పూజార్లు తీసుకోని వచ్చి గద్దెపై ప్రతిష్టింపజేస్తారు. మూడో రోజున శుక్రవారం పూర్తి మొక్కుల చెల్లింపు, నాలుగవ రోజు సాయంత్రం దేవ దేవతలను తిరిగి వన ప్రవేశం చేస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న ఆదివాసులే పూజార్లు కావడం ఈ జాతర పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
Medaram Jatara 2026: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ విశిష్టత మీకు తెలుసా? చరిత్ర చెబుతున్నదేంటి..?

Frequently Asked Questions

మేడారం జాతర ఎప్పుడు జరుగుతుంది?

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున జరుగుతుంది. ఈ సంవత్సరం జనవరి 28 నుండి 31వ తేదీ వరకు జరుగుతోంది.

మేడారం జాతరలో ఎవరెవరిని పూజిస్తారు?

మేడారం జాతరలో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, మరియు గోవిందరాజులు అనే దేవతలను పూజిస్తారు.

ఈ జాతరకు ఎంత మంది భక్తులు వస్తారు?

తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి సుమారు కోటిన్నరకు పైగా భక్తులు ఈ జాతరకు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

జంపన్న వాగుకు ఆ పేరు ఎలా వచ్చింది?

కాకతీయుల దాడిలో వీరోచితంగా పోరాడిన తర్వాత, అవమానాన్ని తట్టుకోలేక జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారు.

భక్తులు అమ్మవార్లకు ఎలాంటి మొక్కులు చెల్లిస్తారు?

భక్తులు తమ కోరికలు తీర్చమని అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress Wins Jangaon and Thorrur: లక్కీడ్రాలోనూ బీఆర్ఎస్‌కు నిరాశే.. జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం
లక్కీడ్రాలోనూ బీఆర్ఎస్‌కు నిరాశే.. జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం
Telangana Municipal Polls: హీటెక్కిన మున్సిపల్ పోరు.. ఇబ్రహీంపట్నంలో కిడ్నాప్ ఆరోపణలు! తొర్రూరులో ఎర్రబెల్లికి చేదు అనుభవం!
మున్సిపల్ పోరు.. ఇబ్రహీంపట్నంలో కిడ్నాప్ ఆరోపణలు! తొర్రూరులో ఎర్రబెల్లికి చేదు అనుభవం!
Telangana Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో మేయర్‌, ఛైర్‌పర్సన్లను ఎలా ఎప్పుడు ఎన్నుకుంటారు? 
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో మేయర్‌, ఛైర్‌పర్సన్లను ఎలా ఎప్పుడు ఎన్నుకుంటారు? 
Telangana Municipal Elections 2026: తెలంగాణలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో పాగా వేసిందెవరు? ఎక్కడ ఎవరు గెలిచారు?
తెలంగాణలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో పాగా వేసిందెవరు? ఎక్కడ ఎవరు గెలిచారు?
Advertisement

వీడియోలు

Australia Eliminated T20 World Cup 2026 | వర్షం కారణంగా Ireland vs Zimbabwe మ్యాచ్ రద్దు | ABP Desam
Mohammad Yousuf Slams Political Interference | పాక్ ఓటమిపై పాక్ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
Hardik Pandya Epic 'No-Look' Wicket | వైరల్ అవుతున్న హార్దిక్ 'నో-లుక్' వికెట్
Vaibhav Suryavanshi Skips 10th Board Exams | వైభవ్ సూర్యవంశీ షాకింగ్ నిర్ణయం
Australia vs Sri Lanka T20 World Cup 2026 | అద్భుతమైన విజయంతో సూపర్ -8లోకి శ్రీలంక
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BioAsia Conference: జీవవిజ్ఞాన రాజధానిగా హైదరాబాద్ - బయోఏషియా 2026 వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
జీవవిజ్ఞాన రాజధానిగా హైదరాబాద్ - బయోఏషియా 2026 వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
Bangladesh new govt: బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంలో హిందూ నేతకు చోటు - తారిక్ రెహ్మాన్‌ భారత్‌కు సందేశం పంపారా?
బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంలో హిందూ నేతకు చోటు - తారిక్ రెహ్మాన్‌ భారత్‌కు సందేశం పంపారా?
IAS Sri Lakshmi: జగన్ అక్రమాస్తులు, ఓబులాపురం కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు షాక్ - డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేత
జగన్ అక్రమాస్తులు, ఓబులాపురం కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు షాక్ - డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేత
Rahul Gandhi: నాయకత్వానికి రాహుల్ గాంధీ అనర్హుడు -తీవ్రంగా విరుచుకుపడ్డ సిద్దూ భార్య
నాయకత్వానికి రాహుల్ గాంధీ అనర్హుడు -తీవ్రంగా విరుచుకుపడ్డ సిద్దూ భార్య
AI Summit 2026: డ్రైవర్‌కు నిద్ర వస్తే కారు ఆగిపోతుందా? ప్రమాదాలకు AIతో ఎలా చెక్ పడుతుంది? టాటా తీసుకొస్తున్న టెక్నాలజీ ఏంటీ?
డ్రైవర్‌కు నిద్ర వస్తే కారు ఆగిపోతుందా? ప్రమాదాలకు AIతో ఎలా చెక్ పడుతుంది? టాటా తీసుకొస్తున్న టెక్నాలజీ ఏంటీ?
Allu Arjun Controversy: సారీ అల్లు అర్జున్ గారూ... నాది తప్పే, క్షమించండి - దిగొచ్చిన బాలీవుడ్ లేడీ
సారీ అల్లు అర్జున్ గారూ... నాది తప్పే, క్షమించండి - దిగొచ్చిన బాలీవుడ్ లేడీ
Bengaluru: ఆస్తి రాసివ్వడం లేదని తండ్రిని కొట్టి చంపేసిన కొడుకులు - ఇలాంటి వాళ్లు కూడా ఉంటారు !
ఆస్తి రాసివ్వడం లేదని తండ్రిని కొట్టి చంపేసిన కొడుకులు - ఇలాంటి వాళ్లు కూడా ఉంటారు !
AP Speaker Ayyanna Patrudu: అసెంబ్లీకి రాని సభ్యులపై త్వరలో నిర్ణయం.. రీకాల్ విధానంపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు
అసెంబ్లీకి రాని సభ్యులపై త్వరలో నిర్ణయం.. రీకాల్ విధానంపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Embed widget