(Source: Poll of Polls)
బాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు
దశాబ్దాలుగా స్వచ్చమైన భూగర్భ జలాలు కాస్తా ఇప్పుడు కాలకోట విషంలా మారిపోయాయి. కొబ్బరినీళ్లులా ఉండే త్రాగునీరు ఇప్పుడు మురికి కంపును తలపిస్తున్నాయి. అంతలా ఆ కాలనీలో భూగర్భ జలాలు కలుషితమైయ్యాయి. ఈ దుస్దితికి ప్రధాన కారణం సరిగ్గా రెండేళ్ల క్రితం ,గత ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా చేపట్టిన స్టాటజిక్ నాలా డవలప్మెంట్ ప్రొగ్రామ్ ( SNDP).ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం హైదరాబాద్ నగరంలో నాలాలు సరిగా లేక ముంపుకు గురవుతున్న కాలనీలను ముంపు భారి నుండి రక్షించి, ఎగువ నుండి వస్తున్న ఆ మురుగునీటిని ప్రత్యేక కెనాన్ నిర్మాణం ద్వారా సమీపంలోని చెరువులకు తరలించడం. సంకల్పం మంచిదే కానీ ఓ చిన్న ఆటకం వల్ల ఏకంగా భూగర్భ జలాలు విషతుల్యంగా మారిపోయారు. ముంపు అటుంచి ఇప్పుడు ప్రాణాలకే చెటు తెచ్చే పరిస్దితులు వచ్చాయి.ఇక్కడ SNDP ప్రాజెక్ట్ లో భాగంగా 150 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అతిపెద్ద మురుగునీటి కాలువ..బాచుపల్లిలోని రెడ్డి ల్యాబ్ నుండి ప్రారంభమై ఇప్పుడు మీరు చూస్తున్న ఈ SKK కాలనీని ఆనుకుని 10కిలోమీటర్లు ప్రయాణించి చివరకు అమీన్ పూర్ చెరువులో కలుస్తుంది. దాదాపు 95శాతం కాలువ నిర్మాణం పూర్తైపోయింది.