అన్వేషించండి

Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 

Kavitha Hunger Strike: ఖమ్మం నగరంలో మంగళవారం మధ్యాహ్నం నుంచే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెలుగుమట్ల బాధితులతో కలిసి కవిత తొలుత జిల్లా పరిషత్‌ కూడలిలో భారీ ఆందోళనకు దిగారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వెలుగుమట్ల భూ బాధితులకు కవిత నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.
  • న్యాయం కోసం రోడ్డుపై బైఠాయించిన కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
  • పోలీసుల విడుదల తర్వాత అంబేడ్కర్ భవన్‌లో దీక్షను కొనసాగిస్తున్నారు.
  • పేదల భూ హక్కుల కోసం పోరాటం ఆగదని కవిత స్పష్టం చేశారు.

Kavitha Hunger Strike: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల భూ బాధితుల సమస్య ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. వెలుగుమట్ల బాధితులకు అండగా ఉంటానని ప్రకటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, ఇప్పుడు వారి కోసం నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఖమ్మం నగరంలోని అంబేడ్కర్‌ భవన్‌ ఈ చారిత్రాత్మక పోరాటానికి వేదికైంది. ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ, బాధితులకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని ఆమె భీష్మించుకొని కూర్చున్నారు. 

హైడ్రామా మధ్య సాగిన ఆందోళన! రోడ్డుపై బైఠాయింపు నుంచి పోలీస్ స్టేషన్‌ వరకు...

ఖమ్మం నగరంలో మంగళవారం మధ్యాహ్నం నుంచే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెలుగుమట్ల బాధితులతో కలిసి కవిత తొలుత జిల్లా పరిషత్‌ కూడలిలో భారీ ఆందోళనకు దిగారు. న్యాయం కోసం బాధితులతో కలిసి ఆమె ప్రధాన రహదారిపైనే బైఠాయించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. 

ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా పోలీసులు కవితను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను బలవంతంగా వాహనంలోకి తరలించి స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించడంతో కార్యకర్తలు, బాధితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే చీకటి పడటంతో పోలీసులు ఆమెను స్టేషన్‌ నుంచి విడుదల చేశారు. స్టేషన్‌ నుంచి విడుదలైన వెంటనే కవిత వెనక్కి తగ్గకుండా, నేరుగా అంబేడ్కర్‌ భవన్‌కు చేరుకునే తన పోరాటాన్ని తదుపరి దశకు తీసుకెళ్లారు. 

అంబేడ్కర్‌ భవన్‌లో దీక్షా పర్వం- కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు 

ప్రస్తుతం అంబేడ్కర్‌  భవన్‌లో కవిత తన దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధితులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

ఈ పోరాటం కేవలం ఒక నిరసన మాత్రమే కాదని, ఇది భూమిని నమ్ముకున్న పేదవాడి హక్కుల పోరాటమని ఆమె అభివర్ణించారు. భూదాన్ భూములు బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని, అందరూ కలిసికట్టుగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. వెలుగుమట్ల ప్రాంతంలో దశాబ్దాలుగా నెలకొన్న భూ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, పేదలకు దక్కాల్సిన భూములపై కన్నేసిన వారికి గుణపాఠం తప్పదని ఆమె హెచ్చరించారు. 

వెలుగుమట్ల బాధితుల వేదనకు కారణమేంటి?

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల పరిధిలోని భూదాన్ భూములకు సంబంధించిన గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. పేదలకు కేటాయించిన భూములను ఇతరులు ఆక్రమించుకుంటున్నారని లేదా సాంకేతిక కారణాలతో వారికి పట్టాలు దక్కడం లేదని బాధితులు వాపోతున్నారు. తమ గోడును వినేవారే కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఈ బాధితులకు కవిత మద్దతు తెలపడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 

Frequently Asked Questions

వెలుగుమట్ల భూ బాధితుల సమస్యపై కవిత నిరసన ఎందుకు చేపట్టారు?

వెలుగుమట్ల భూ బాధితులకు మద్దతుగా, వారి సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.

ఖమ్మంలో కవిత ఆందోళన ఎలా జరిగింది?

కవిత, వెలుగుమట్ల బాధితులతో కలిసి జిల్లా పరిషత్ కూడలిలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దీనివల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.

పోలీసులు కవితను ఎందుకు అదుపులోకి తీసుకున్నారు?

ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు కవితను అదుపులోకి తీసుకున్నారు.

వెలుగుమట్ల భూదాన్ భూములకు సంబంధించిన సమస్య ఏమిటి?

పేదలకు కేటాయించిన భూదాన్ భూములను కొందరు ఆక్రమించుకుంటున్నారని లేదా సాంకేతిక కారణాలతో బాధితులకు పట్టాలు దక్కడం లేదని సమస్య ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget