Vizag Crime News: లా స్టూడెంట్‌పై గ్యాంగ్ రేప్ కేసులో లవర్ సహా నలుగురు నిందితుల అరెస్ట్
Visakhapatnam News | విశాఖలో లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం కేసులో ప్రియుడు సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.
Vizag Law Student Crime News | విశాఖపట్నం: ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన విశాఖపట్నంలో కలకలం రేపింది. ఈ కేసులో బాధితురాలి ప్రియుడు, అతడి స్నేహితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ప్రధాన నిందితుడు వంశీని, అతని స్నేహితులు జగదీశ్, ఆనంద్, రాజేశ్‌లను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.
అసలేం జరిగిందంటే..
ఆ యువతి మధురవాడలోని లా కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతోంది. ఆమెకు తన కాలేజీకి చెందిన విద్యార్థి వంశీతో స్నేహం కుదరింది. అనంతరం అది ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆగస్టు 10వ తేదీన యువతి కంబాలకొండకు తీసుకువెళ్లాడు వంశీ. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమె వద్దని వారిస్తున్నా వినకుండా ప్రియురాలిపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దన్నాడు. కానీ ఆగస్టు 13న తన ఫ్రెండ్ ఆనంద్ ఇంటికి వంశీ, యువతి వెళ్లారు. అక్కడ సైతం పెళ్లి పేరుతో నమ్మించి మరోసారి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం వంశీ స్నేహితులు ఆనంద్, రాజేష్, జగదీష్ ఒకరి తర్వాత ఒకరు యువతిపై సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో వారి మొబైల్స్ లో వీడియోలు సైతం రికార్డ్ చేశారు. ఆ వీడియోలు ఉన్నాయని బెదిరించి బాధితురాలికి నరకం చూపిస్తున్నారు.
తాము పిలిచినప్పుడల్లా వచ్చి కోరిక తీర్చాలని, లేకపోతే నీ వీడియోలను యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాధితురాలు వంశీకి చెప్పి, తనను సేవ్ చేయాలని కోరింది. వాళ్లు చెప్పినట్లుగా చేయాలని ప్రియురాలిపై వంశీ ఒత్తిడి తీసుకురావడంతో ఆమె మానసికంగా మరింతగా కుంగిపోయింది. వీడియోలు ఉన్నాయని బెదిరిస్తూ, తమ కోరికలు తీర్చాలని నిందితులు వేధిస్తుండటంతో తట్టుకోలేక నవంబర్ 18న యువతి ఉరివేసుకుని ఆత్మాహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన తండ్రి ఆమెను కాపాడారు. తనకు జరిగిన అన్యాయాన్ని, తనపై కొన్ని రోజులుగా దారుణాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. యువతి కుటుంబసభ్యులు విశాఖ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం నాడు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గురు లా స్టూడెంట్స్ కాగా, ప్రైవేట్ కంపెనీలో క్యాషియర్‌గా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
Also Read: AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!