Telangana News: తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
Lower Temparatures: తెలంగాణలో రానున్న వారం రోజుల్లో చలి తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ వార్నింగ్ ఇచ్చింది.
Telangana Health Department Warning To People Due To Lower Temparatures: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఉదయం, సాయంత్రం చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయాన్నే మంచు సహా చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో (Telangana) రానున్న వారం రోజుల్లో 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేసింది. శీతల సమయాల్లోనే ఇన్‌ఫ్లూయెంజా పంజా విసిరే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఇన్‌ఫ్లూయెంజ్ (Influenza) లక్షణాలుగా పేర్కొంది.
'ఇది సాధారణ వ్యాధి. కోలుకోవడానికి వారం రోజుల సమయం పడుతుంది. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి. చలిగాలిలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్యంగా ఉన్న వారికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా జలుబు, దగ్గు ఉన్న వారికి దూరంగా ఉండడం మంచిది. సరైన నిద్ర, సరిపడా నీరు, పౌష్టికాహారం తీసుకోవాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇన్‌ఫ్లూయెంజా బారిన పడకుండా ఉండవచ్చు.' అని వైద్య శాఖ అధికారులు తెలిపారు.
Also Read: Viral News: దేవుడిలా వచ్చి సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్స్