Women's ODI Final | Smriti Mandhana | చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్లేయర్స్ చాలా బాగా అందిపుచ్చుకున్నారు. తమకు వచ్చిన ఈ గోల్డెన్ ఛాన్స్ ను ఎక్కడ మిస్ యూజ్ చేయకుండా మంచి ప్రదర్శనతో హాటెర్స్ నుంచి కూడా ప్రసంశలు అందుకున్నారు.
ముందు బ్యాటింగ్ కు వచ్చిన భారత ఓపెనర్లు స్మ్రితి మందాన, షఫాలీ వర్మ నిలకడగా ఆడుతూ రన్స్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. స్మృతి మంధాన 45 పరుగులు చేసి హాఫ్ సెంచరీ మిస్ చేసుకుంది. కానీ క్రీజ్ లో ఉనంతసేపు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించింది. వరుస 4 లతో చెలరేగింది. 17 వ ఓవర్ లో మందాన వికెట్ సమర్పించుకుంది.
స్మ్రితి వికెట్ పడినా కూడా మరోపక్క ఉన్న షఫాలీ వర్మ ఏ మాత్రం భయపడకుండా జామిమాతో కలిసి స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించింది. ఓపెనర్ గా వచ్చి 78 బంతుల్లో 87 రన్స్ చేసింది. 7 ఫోర్, 2 సిక్సులతో చెలరేగింది. జమిమా కాస్త మెల్లగా ఆడినా కూడా షఫాలీ మాత్రం ఎక్కడా తగ్గలేదు. సెమీఫైనల్ మ్యాచ్ లో చెలరేగిన జమిమా ఫైనల్ మ్యాచ్ లో కాస్త తడబడింది అనే చెప్పాలి. ఫైనల్ మ్యాచ్ లో కేవలం 24 పరుగులు చేసి అవుట్ అయింది.
అయితే టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ తరఫున సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది.





















