Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Invest Andhra: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్ రూ.20,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ జరిగింది.

MoU between the Government of Andhra Pradesh and Hinduja Group: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం , హిందూజా గ్రూప్ మధ్య రూ.20,000 కోట్ల పెట్టుబడి ఎంఓయూ (మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్) జరిగింది. ఈ ఒప్పందం రాష్ట్ర ఇండస్ట్రియల్ , క్లీన్ ఎనర్జీ రంగాల్లో ఉపాధి అవకాశాలు, సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌కు దోహదపడుతుందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్ పర్యటనలో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హిందూజా గ్రూప్ చైర్మన్ ఆశోక్ పి. హిందూజా, యూరప్ చైర్మన్ ప్రకాష్ హిందూజా, సీఈఓ వివేక్ నందా.. ఎంఓయూ చేసుకున్నారు.
ఈ ఎంఓయూ ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) హబ్‌గా మార్చే లక్ష్యంతో రూపొందింది. హిందూజా గ్రూప్, ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్, ఆటోమొబైల్స్, ఎనర్జీ రంగాల్లో ఉన్న భారతీయ మల్టీ-నేషనల్ కార్పొరేట్ కంపెనీ. ఈ పెట్టుబడి ద్వారా రాష్ట్ర విద్యుత్, పునరుత్పాదక శక్తి, ట్రాన్స్‌పోర్ట్ సెక్టర్లలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు. "ఈ భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్‌ను ఫ్యూచర్-రెడీ రాష్ట్రంగా మార్చుతుంది" అని సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తంచేశారు.
ఈ ఒప్పందం కింద రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రముఖ ప్రాజెక్టులను నిర్మిస్తారు.
విశాఖపట్నం పవర్ ఎక్స్‌పాన్షన్: హిందూజా నేషనల్ పవర్ కార్ప్ లిమిటెడ్ (HNPCL) ప్లాంట్‌ను విస్తరించడం. ప్రస్తుతం 1,050 MW సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్‌కు అదనంగా 1,600 MW (2×800 MW) యూనిట్లు నిర్మిస్తున్నారు. ఇది రాష్ట్ర ఇండస్ట్రీలకు నమ్మకమైన విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తుంది. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మొత్తం సామర్థ్యం 2,650 MWకి చేరుతుంది.
రాయలసీమ పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులు: రాయలసీమ ప్రాంతంలో పెద్ద ఎత్తున సోలార్ , విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తారు. ఇది రాష్ట్ర క్లీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూ, కార్బన్ ఎమిషన్స్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. హిందూజా గ్రూప్ యూరప్ చైర్మన్ ప్రకాష్ హిందూజా "ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ లీడర్‌గా మార్చుతాయి." అని విశ్వాసం వ్యక్తంచేశారు.
కృష్ణ జిల్లా మల్లవల్లిలో ఈవీ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్: స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ ఈలక్ట్రిక్ బస్ మరియు లైట్-వెహికల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ స్థాపిస్తారు. ఇది సస్టైనబుల్ మొబిలిటీని ప్రోత్సహించి, రాష్ట్ర రోడ్స్‌పై గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్‌ను పెంచుతుంది. ఈ ప్లాంట్ ద్వారా వేలాది ఉద్యోగాలు, స్థానిక సప్లై చైన్‌కు బూస్ట్ రావచ్చని అధికారులు అంచనా.
రాష్ట్రవ్యాప్త ఈవీ చార్జింగ్ నెట్‌వర్క్: ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య రహదారులు, నగరాల్లో విస్తృత చార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్ అమలు చేస్తారు. ఇది ఈవీ ఆడాప్షన్‌ను వేగవంతం చేస్తూ, గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేస్తుంది.
Delighted to announce the signing of an MoU between the Government of Andhra Pradesh and the Hinduja Group, marking a cumulative investment of ₹20,000 crore to accelerate our state’s industrial and clean energy growth.
— N Chandrababu Naidu (@ncbn) November 3, 2025
The MoU was signed in the presence of Mr. Ashok P. Hinduja,… pic.twitter.com/kyX0HoPT9S
హిందూజా గ్రూప్, 1914లో స్థాపించిన భారతీయ మల్టీ-నేషనల్ కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా ఆటో, బ్యాంకింగ్, ఎనర్జీ రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే HNPCL ద్వారా పవర్ సెక్టర్‌లో ఉన్న గ్రూప్, ఈ ఎంఓయూ ద్వారా తన ఉన్నతిని మరింత పెంచుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ పాలసీలు, సింగిల్ విండో క్లియరెన్స్ వంటి సౌకర్యాలతో పెట్టుబడులను ఆకర్షిస్తోంది.





















