అరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా
స్టార్ షిప్ లాంటి భారీ రాకెట్ లను గాల్లోనే క్యాచ్ పట్టుకుని చరిత్ర సృష్టించిన ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థ..ఆ ఫీట్ ను మరోసారి రిపీట్ చేయలేకపోయింది. చంద్రుడిపైకి స్టార్ షిప్ ను పంపే ప్రయత్నాల్లో భాగంగా అనేక దశలుగా ప్రయోగాలు చేస్తున్న స్పేస్ ఎక్స్ మళ్లోసారి స్టార్ షిప్ ను ప్రయోగించి దాన్ని గాల్లో ఉండగానే టవర్ కి ఉండే మెకానికల్ ఆర్మ్స్ తో దాన్ని ఒడిసి పెట్టుకునేందుకు ట్రైల్స్ చేస్తోంది. గతంలో ఓసారి ఆ ఫీట్ ను చేసి చూపించిన ఎలన్ మస్క్ సంస్థ...ఈసారి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు మరోసారి ఆ ఫీట్ ను చేసి చూపించాలని ఫిక్స్ అయ్యింది. స్టార్ షిప్ పేలోడ్ లో ఓ అరటిపండును కూడా పెట్టారు. రీజన్ ఈ అరటిపండు సైజ్ ఎలన్ మస్క్ స్టార్ లింక్ డిష్ సైజు అండ్ బరువు రెండూ ఒకటే. అందుకే అరటిపండును పెట్టినట్లు స్టార్ లింక్ ప్రకటించింది. సరే ఇంతకీ గాల్లోకి ఎగిరిన ఈ భారీ రాకెట్ బాగానే లిఫ్ట్ ఆఫ్ అయ్యింది. అయితే ఫస్ట్ స్టేజ్ తిరిగి కిందకి రావటం దాన్ని గాల్లోనే టవర్ క్యాచ్ పట్టడం చేయాలి. కానీ సాంకేతిక లోపంతో ఆ టవర్ క్యాచ్ ను ఆఖరి నిమిషంలో రద్దు చేశారు. ఫలితంగా ఆ రాకెట్ ఫస్ట్ స్టేజ్ గల్ఫ్ ఆఫ్ మెక్స్సికో సముద్రంలో పడిపోయింది. కానీ ఆ పడిపోయేప్పుడు మాత్రం మస్క్ తన టెక్నాలజీని మరోసారి యూజ్ చేయించాడు. అదేదో రాకెట్ కుప్పకూలిపోతున్నట్లు కాకుండా నీటి మీద ల్యాండ్ చేస్తున్నట్లుగా స్ప్లాష్ డౌన్ చేయించాడు. దాన్ని సమర్థించుకుంటూ మరోసారి ఇలాగే సముద్రంలో రాకెట్ ను దించి..ఈసారి షిప్ మీద టవర్ పెట్టి దానితో రాకెట్ ను క్యాచ్ పట్టిస్తామని కొత్త ఛాలెంజ్ విసురుకున్నాడు మస్క్. కానీ ఇంటర్నేషనల్ మీడియా మాత్రం మస్క్ ట్రంప్ ముందు పరువుపోకుండా మంచిగా కవర్ డ్రైవ్ ఆడాడని న్యూస్ ఇచ్చాయి.