అన్వేషించండి

Fact Check: కన్న తండ్రి ప్రాధేయపడినా ప్రియుడితో వెళ్లిపోతున్న కూతురు? వైరల్ న్యూస్‌లో నిజమెంత

Viral News | తన కూతురు ఓ యువకుడ్ని పెళ్లి చేసుకుని, అతడితోనే వెళ్లిపోతుంటే వద్దంటూ ఆమె తండ్రి ప్రాధేయపడుతున్నా పట్టించుకోలేదు. ఈ వైరల్ వీడియోపై అసలు వాస్తవాలు ఇవే.

Claim: కన్న తండ్రి కాళ్ళ మీద పడి ప్రాధేయపడినా వినకుండా ప్రియుడితో వెళ్లిపోతున్న కూతురిని చూపిస్తున్న వీడియో.

Fact: ఈ క్లెయిమ్ తప్పు. ఈ వీడియో కల్పితం, ఒక యూట్యూబ్ ధారావాహికలోని సన్నివేశం.

కన్న కూతురు తాను ప్రేమించిన యువకుడితో వెళ్లిపోతుంటే వద్దని ప్రాధేయపడుతున్న తండ్రిని చూపిస్తున్న ఓ వీడియో గత రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో యువతీ, యువకుడు కలిసి వెళ్తుంటే ఒక వ్యక్తి 'అమ్మ,' అమ్మ' అంటూ వెనకాల నడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ వ్యక్తి వారి కాళ్ల మీద పడినా ప్రయోజనం లేకపోయింది.

కూతురు తన జీవితంలో నుండి తండ్రిని దూరంగా ఉండమని అడుగుతోంది. ప్రియుడు తాను గత నాలుగు సంవత్సరాలుగా ఆమెను ప్రేమిస్తున్నానని, ఆమెను వదిలి వెళ్ళలేనని ఆ తండ్రికి చెబుతున్నట్లు వినిపిస్తోంది. దీనికి ప్రతిస్పందనగా, తండ్రి తన కుమార్తె కోసం నిర్ణయం తీసుకునే హక్కు తనకుందని, ప్రియుడి ఆర్థిక స్థిరత్వం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఈ సంభాషణ తమిళంలో జరుగుతోంది.

ఈ వీడియో షేర్ చేస్తూ శీర్షికలో ఈ విధంగా రాశారు, "పరుగు సినిమాలో దృశ్యం.. తమిళనాడు లో ప్రత్యక్షం! కన్న కూతురు ప్రేమించిన యువకుడితో వెళ్లిపోతుంటే వెళ్ళొదని ప్రాధేయ పడుతున్న తండ్రి.. విడియో వైరల్" (ఆర్కైవ్


Fact Check: కన్న తండ్రి ప్రాధేయపడినా ప్రియుడితో వెళ్లిపోతున్న కూతురు? వైరల్ న్యూస్‌లో నిజమెంత

ఇదే క్లెయిమ్ ఉన్న మరో పోస్ట్ ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్)

 

ఈ పోస్ట్‌లో "నాకు తమిళం రాదు. అంత ప్రాధేయపడే బదులు పెళ్లి చేస్తానంటే ఆగిపోతుంది కదా?" అని ఒకరు అన్నారు. "కన్న తండ్రి అమ్మ! అమ్మ! అని ఆర్తిగా పిలుస్తూ కాళ్లు పట్టుకుని బ్రతిమాలు కుంటున్నా కనికరం లేదు దరిద్రపు కూతురికి," అని ఇంకొకరు కామెంట్ చేశారు.

Fact Check

న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని నిర్ధారించింది. వైరల్ వీడియో ఒక కల్పిత స్క్రిప్ట్ ఆధారంగా చేయబడింది. ఇది నిజ జీవిత సంఘటనను చూపించడం లేదు.

వైరల్ వీడియోలో 'Sai Vijay' అని లోగో కనిపిస్తుంది. అలాగే వీడియోలో జరిగిన సంఘటనలు నాటకీయంగా అనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వీడియోలో కనిపిస్తున్న విషయాలు అసలు నిజంగా జరిగాయా అనే సందేహం కలుగజేశాయి.

వైరల్ వీడియో కీ ఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా పరిశీలించగా, యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన వీడియో ఒకటి దొరికింది. "దయచేసి నాకు కూడా సహాయం చేయండి నాన్న" అనే శీర్షికతో 2025 మార్చి 20న అప్లోడ్ చేయబడినట్లు గుర్తించం. ఈ వీడియోను అప్లోడ్ చేసిన ఛానల్ పేరు 'SAIVIJAYOFFICIAL.'

ఇదే ఛానెల్లో కనిపిస్తున్న మరికొన్ని షార్ట్స్ పరిశీలిస్తే, వైరల్ వీడియోలో కనిపిస్తున్న జంట పెళ్లి చేసుకున్నట్టు, అంతక ముందే తండ్రితో వాగ్వివాదం జరుగుతున్నట్టు మరికొన్ని వీడియోలు కనిపించాయి.

ఈ ఛానల్లో ఇటీవల షేర్ చేసిన వీడియోల్లో "ఆ తండ్రి కాళ్ళపై పడి ఏడ్చాడు. పెళ్లి చేసుకోని స్త్రీ | పార్ట్-7 | రన్నింగ్ కపుల్ | సాయివిజయ్" అనే శీర్షికతో 13 నిమిషాల నివిడి ఉన్న వీడియో దొరికింది. ఈ వీడియోలో 10:16 నిమిషాల మార్కు వద్ద వైరల్ వీడియో కనిపించింది. ఈ వీడియో కల్పితమని తేలింది.

"ఈ వీడియో మీకు నచ్చితే Like కొట్టండి... ఈ వీడియో కేవలం వినోదం కోసం మాత్రమే, సంబంధిత వ్యక్తుల అనుమతితో తయారు చేయబడింది/అప్‌లోడ్ చేయబడింది," అని వీడియో వివరణలో రాశారు. కాబట్టి వైరల్ అవుతున్న వీడియో కల్పితమని, 'పారిపోతున్న జంట' అనే యూట్యూబ్ ధారావాహికలో భాగం అని ధృవీకరించబడింది.

హిందూ వ్యక్తిని ఇఫ్తార్ విందు నుండి బయటకు పంపమని ముస్లింలు కోరారు, రోడ్డుమీద వెళ్తున్న శారీరక వైకల్యం ఉన్న ముస్లిం వ్యక్తిని వేధించారు అని చూపిస్తున్న స్క్రిప్ట్ చేయబడిన వీడియోల గురించి గతంలో న్యూస్‌మీటర్ రాసింది. అయితే ఈ వీడియోలు కల్పితం అని తెలియజేయకుండా షేర్ చేయడం వల్ల, నిజంగా జరిగిన సంఘటనలుగా వైరల్ అవుతూ ఉంటాయి. వైరల్ అవుతున్న వీడియో కూడా కల్పితమే అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.

Claim Review: కన్న తండ్రి కాళ్ళ మీద పడి ప్రాధేయపడినా వినకుండా ప్రియుడితో వెళ్లిపోతున్న కూతురు అని వీడియో వైరల్ అయింది.
Claim Fact Check: False
Fact: ఈ క్లెయిమ్ తప్పు. ఈ వీడియో కల్పితం, ఒక యూట్యూబ్ సిరీస్‌లోని ఓ ఎపిసోడ్ సన్నివేశం అది.

This story was originally published by Newsmeter as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction, this story has not been edited by ABP DESAM staff.

టాప్ హెడ్ లైన్స్

Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget