Rahul Gandhi: రైతులు దాడి చేస్తారని రాహుల్ వరంగల్ పర్యటన రద్దు అయిందా ? ఇదిగో అసలు నిజం
Fact Check: రైతులు దాడి చేస్తారన్న కారణంగా రాహుల్ పర్యటన రద్దు అయిందనేది అవాస్తవం. ప్రచారం జరుగుతున్న వార్తల క్లిప్పింగ్స్ ఫేక్.

Fact Check: రాహుల్ గాంధీ వరంగల్ పర్యనటకు రావాల్సి ఉంది. అయితే ఆయన అదే రోజు రద్దు చేసుకున్నారు. దీంతో “రైతులు దాడి చేస్తారని ఇంటెలిజెన్స్ సమాచారంతో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయింది” అని పేర్కొంటూ ‘Way2News’ కథనం పేరుతో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలోవైరల్ అయ్యాయి. (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). అయితే ఈ కథనంలో నిజం లేదు.
ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
క్లెయిమ్: “రైతులు దాడి చేస్తారని ఇంటెలిజెన్స్ సమాచారంతో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు” అని ‘Way2News’క్లిప్పింగ్
ఫాక్ట్ చెక్: ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో అని ‘Way2News’ సంస్థ 12 ఫిబ్రవరి 2025న ట్విట్టర్ లో ప్రకటించింది.
రైతులు దాడి చేస్తారని ఇంటెలిజెన్స్ సమాచారంతో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దయిందా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ క్లెయింను సమర్థించే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ లేనట్లుగా తేలింది.
అయితే రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది పేర్కొంటూ పలు మీడియా సంస్థలు ప్రచురించిన వార్తా కథనాలు ప్రచురించాయి. (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, 11 ఫిబ్రవరి 2025న సాయంత్రం రాహుల్ గాంధీ తెలంగాణలోని వరంగల్ జిల్లాలో పర్యటించాల్సి ఉండి. చివరి నిమిషంలో ఆయన వరంగల్ పర్యటన రద్దు అయింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 11 ఫిబ్రవరి 2025న లోక్‌సభలో పలు కీలక బిల్లులపై చర్చలో రాహుల్ గాంధీ పాల్గొనాల్సి ఉన్నందున, రాహుల్ గాంధీ పర్యటన రద్దు అయినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించినట్లుగా పలు మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. ఏవీ కూడా రైతులు దాడి చేస్తారని ఇంటెలిజెన్స్ సమాచారంతో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు చేయబడినట్లు ఎక్కడా పేర్కొనలేదు.
పైగా, ఈ వార్తను Way2News సంస్థ కూడా ప్రచురించలేదు అని తేలిది. ఈ వైరల్ ‘Way2News’ వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ (https://way2.co/350brl) ద్వారా ‘Way2News’ ఫాక్ట్-చెక్ వెబ్‌సైట్‌లో వెతకగా, ఈ ఐడీతో ఉన్న ఎటువంటి కథనం ‘Way2News’ వెబ్‌సైట్‌లో లభించలేదు.
ఈ న్యూస్ క్లిప్ వైరల్ అవడంతో, 12 ఫిబ్రవరి 2025న ‘Way2News’ సంస్థ X(ట్విట్టర్) పోస్ట్ (ఆర్కైవ్డ్) ద్వారా స్పందిస్తూ,“ఇది Way2News ప్రచురించిన కథనం కాదు, కొందరు మా ఫార్మాట్‌లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని తెలిపింది.
Some miscreants with wrong intentions are spreading misinformation in our format. This is not a Way2News story. #saynotofakenews pic.twitter.com/vT1E573H51
— Fact-check By Way2News (@way2newsfc) February 12, 2025
చివరగా, రైతులు దాడి చేస్తారని ఇంటెలిజెన్స్ సమాచారంతో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన చేయబడిందని పేర్కొంటూ ‘Way2News’ వార్తా కథనం ప్రచురించలేదు.
This story was originally published by Factly as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction, this story has not been edited by ABP DESAM staff.
Follow Fact Check News on ABP DESAM for more latest stories and trending topics.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

