అన్వేషించండి

Shamshabad Airport Bomb Threat: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం.. 3 అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ కానున్న మూడు అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. తెలంగాణ రైజింగ్ గ్లోబట్ సమ్మిట్ వేళ ఈ బెదిరింపులు ఆందోళన పెంచాయి.

Rajiv Gandhi International Airport | హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం (డిసెంబర్ 8) బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాల్సిన మూడు విమానాలకు ఒకేసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే మూడు విమానాలను పైలట్లు సేఫ్ ల్యాండింగ్ చేయడంతో అందులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు దిగిన తరువాత భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు.

బెదిరింపులకు గురైన విమానాలు, వాటి మార్గాలు ఈ విధంగా ఉన్నాయి:

కేరళ కన్నూర్ - హైదరాబాద్ (ఇండిగో ఎయిర్‌లైన్స్ - విమాన సర్వీస్ 6E 7178)

ఫ్రాంక్‌ఫర్ట్ - హైదరాబాద్ (లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ - విమాన సర్వీస్  LH-752)

లండన్ - హైదరాబాద్ (బ్రిటిష్ ఎయిర్‌లైన్స్)

ఈ మూడు విమానాలు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండయ్యాయి. ల్యాండింగ్ అయిన వెంటనే, భద్రతా ప్రమాణాల దృష్ట్యా అధికారులు ప్రయాణికులను తక్షణమే విమానాల నుంచి దించి, వారిని ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు. అనంతరం, భద్రతా అధికారులు బాంబు స్క్వాడ్ బృందాలతో కలిసి ఆ మూడు విమానాలను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించినట్లు సమాచారం లేదు, అయితే తనిఖీ ప్రక్రియ కొనసాగుతోంది.

విమానాశ్రయ భద్రతపై ప్రభావం
సాధారణంగా ఇలాంటి బాంబు బెదిరింపుల మెయిల్స్ వచ్చినప్పుడు విమానాశ్రయ భద్రతా సంస్థలు (CISF), విమానయాన సంస్థలు, స్థానిక పోలీసులు, మరియు జాతీయ భద్రతా దళాలు (NSG) సమన్వయంతో పనిచేస్తాయి. బాంబు బెదిరింపు మెయిల్స్ కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలోని ఇతర విమానాల రాకపోకలపై, భద్రతా తనిఖీల ప్రక్రియపై స్వల్ప ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రయాణికులు విమాన ప్రయాణాలకు ముందు తమ విమాన సమయాన్ని ధృవీకరించుకోవాలని అధికారులు సూచించే అవకాశం ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
Amaravati News: అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
Sunita Williams Retires: నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
AR Rahman: భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు
భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు
Advertisement

వీడియోలు

MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన
India vs New Zealand T20 Preview | నేడు భారత్ - న్యూజిలాండ్ మొదటి టీ20
Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
Amaravati News: అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
Sunita Williams Retires: నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
AR Rahman: భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు
భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు
BRS ప్రభుత్వంలో హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసింది ఎవరు? సొంత పార్టీలో చిచ్చురేపుతున్న సిట్ లీక్స్
BRS ప్రభుత్వంలో హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసింది ఎవరు? సొంత పార్టీలో చిచ్చురేపుతున్న సిట్ లీక్స్
Tiger Near Hyderabad: హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ రాజకీయ భవిష్యత్తు - జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది?
BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ రాజకీయ భవిష్యత్తు - జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది?
Most imported item in India: భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
Embed widget