Yashasvi Jaiswal Century vs SA | వన్డేల్లోనూ ప్రూవ్ చేసుకున్న యశస్వి జైశ్వాల్ | ABP Desam
రోహిత్ శర్మ- యశస్వి జైశ్వాల్ ది ప్రత్యేకమైన బాండ్. ఓ రకంగా గురు శిష్యుల్లాంటి వాళ్లు. జైశ్వాల్ రోహిత్ ను తన మెంటార్ గా భావిస్తాడు. 2023లో టెస్టుల్లో, టీ20ల్లో టీమిండియాకు అరంగేట్రం చేసిన జైశ్వాల్ ను ఎంకరేజ్ చేసింది అప్పుడు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మనే. అయితే జైశ్వాల్ కి వన్డేల్లో మాత్రం ఆడే ఛాన్స్ దక్కలేదు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ఉండటంతో వన్ డౌన్ కోహ్లీ కావటంతో సిరీస్ కు సెలెక్ట్ అయినా స్క్వాడ్ లో ఉండే వాడు తప్ప ఫైనల్ 11 లో మాత్రం జైశ్వాల్ ఇన్నాళ్లూ చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్ తో తన కెరీర్ లో మొదటి వన్డే ఆడిన జైశ్వాల్...కెప్టెన్ గిల్ గాయం కారణంగా సిరీస్ ఆడలేకపోవటంతో పూర్తిస్థాయిలో సౌతాఫ్రికాతో సిరీస్ ఆడే అవకాశం జైశ్వాల్ కి దక్కింది. త్రీ ఫార్మాట్ ప్లేయర్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని జైశ్వాల్ కి ఉన్నా టీమిండియా కోచ్ గంభీర్ తనను టెస్ట్ ప్లేయర్ గానే ట్రీట్ చేస్తుండటంతో....ఛాన్స్ కోసం రెండేళ్లు ఎదురు చూసినా జైశ్వాల్ నిన్న వైజాగ్ లో సౌతాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక వన్డేలో మాత్రం రెచ్చిపోయాడు. 271 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసే క్రమంలో 121 బంతుల్లో 12ఫోర్లు 2 సిక్సర్లతో 116పరుగులు చేసి ఆడిన వన్డేలోనే కెరీర్ లో తొలి సెంచరీ బాదేశాడు. ఆ తర్వాత ఫుల్ ఆన్ అగ్రెషన్ లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. రీజన్ తనకు వన్డేల్లో పర్మినెంట్ ప్లేస్ కావాలనే. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలనే కలను తను నెరవేర్చుకోవాలన్నా...రోహిత్ వారసుడిగా తనను ట్రీట్ చేయాలని జైశ్వాల్ కచ్చితంగా భావిస్తున్నాడు. మ్యాచ్ తర్వాత రోహిత్ కూడా జైశ్వాల్ ను ఆత్మీయంగా హగ్ చేసుకుని ప్రశంసించాడు. చూడాలి మరి నెక్ట్ సిరీస్ కి గిల్ తిరిగొచ్చేస్తాడు కాబట్టి జైశ్వాల్ ను కనీసం బ్యాకప్ ఓపెనర్ గా అయినా వరల్డ్ కప్ కి కన్సిడర్ చేస్తారో లేదో.





















