Bigg Boss Tamil 8: చివరి దశకు వచ్చేసిన తమిళ బిగ్‌బాస్ - ఫైనల్ రేసులో ఎంత మంది ఉన్నారు? ప్రైజ్ మనీ ఎంత?
Bigg Boss Tamil 8 Grand Finale Date: బిగ్‌బాస్ తమిళ్ 8 సీజన్ దాదాపుగా ఎండింగ్‌కు వచ్చేసింది. రాయన్ ఇప్పటికే టికెట్ టు ఫినాలేను కూడా గెలుచుకోవడం విశేషం.
Bigg Boss Tamil 8 Grand Finale: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఫినాలే ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ తమిళ్ సీజన్ 8 కూడా ముగింపునకు వచ్చేసింది. ఈ సీజన్‌కు రెగ్యులర్ హోస్ట్ కమల్ హాసన్ కాకుండా విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం బిగ్ బాస్ కూడా చాలా ట్విస్టులతో జరిగింది.
త్వరలో బిగ్‌బాస్ తమిళ్ 8 ఫినాలే డేట్...
గ్రాండ్ ఫినాలే డేట్‌ను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. బజర్ టు బజర్ ఛాలెంజ్‌లో విజేతగా నిలవడం ద్వారా రాయన్ ఇప్పటికే టికెట్ టు ఫినాలేను గెలుచుకున్నాడు. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 8 ఫైనల్లోకి అడుగుపెట్టిన మొదటి కంటెస్టెంట్‌గా నిలిచాడు. విజయ్ సేతుపతి స్వయంగా హౌస్‌లోకి ఎంటర్ అయి రాయన్‌కి టికెట్‌ను పర్సనల్‌గా అందించారు. లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్‌లో తక్కువ ఓట్లు రావడం కారణంగా రానవ్, మంజరి వంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ కూడా ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు.
Also Read: 'మ్యాక్స్' రివ్యూ: మ్యాగ్జిమమ్ మాస్ యాక్షన్‌తో అదరగొట్టిన కిచ్చా సుదీప్ - మరి సినిమా హిట్టా? ఫట్టా?
స్టార్ విజయ్ తమిళ ఛానెల్లో, డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో తమిళ బిగ్ బాస్‌ను చూడవచ్చు. బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 8 ఫైనల్లో విజయం సాధించిన వారికి రూ.50 లక్షల నగదు బహుమతి లభించనుంది. దీంతోపాటు కంటెస్టెంట్లకు వారి పాపులారిటీని బట్టి రోజుకు రూ.10 వేల నుంచి రూ.రెండు లక్షల వరకు రెమ్యునరేషన్ లభించనుంది. విజేతగా నిలిచిన వారికి వచ్చే రూ.50 లక్షలు అదనంగా వస్తాయని అనుకోవచ్చు.
ఈ సంవత్సరం ఫినాలే మరింత రంజుగా సాగనుంది. ఎందుకంటే ఇప్పటివరకు హౌస్‌లో ఉన్న వారందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లే కావడం విశేషం. వీరందరికీ ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ ఉంది. ప్రస్తుతం ఉన్న 10 మందిలో విన్నర్‌గా ఎవరు నిలుస్తారో ఇప్పుడే చెప్పడం చాలా కష్టం.
#Day91 #Promo2 of #BiggBossTamil
— Vijay Television (@vijaytelevision) January 5, 2025
Bigg Boss Tamil Season 8 - இன்று இரவு 9:30 மணிக்கு நம்ம விஜய் டிவில.. #BiggBossTamilSeason8 #VJStheBBhost #VijaySethupathi @mynanduonline #AalumPudhusuAattamumPudhusu #BiggBossTamil #BBT #BBTamilSeason8 #பிக்பாஸ் #VijayTelevision #VijayTV pic.twitter.com/bEpw3391tZ
#Day95 #Promo3 of #BiggBossTamil
— Vijay Television (@vijaytelevision) January 9, 2025
Bigg Boss Tamil Season 8 - இன்று இரவு 9:30 மணிக்கு நம்ம விஜய் டிவில.. #BiggBossTamilSeason8 #VJStheBBhost #VijaySethupathi @mynanduonline #AalumPudhusuAattamumPudhusu #BiggBossTamil #பிக்பாஸ் #Disneyplushotstartamil #VijayTelevision #VijayTV pic.twitter.com/A4b0BR6opl
#Soundariya x #Sunitha Dance Performance for Apudi Podu Song was pure fire!🔥💃#Sound just vented out all the anger and frustration she’s been holding up since morning😤✨#BiggBossTamil #BiggBossTamil8 #BiggBoss8Tamil #BiggBossTamilSeason8 #BBTamil8pic.twitter.com/QPizUtCLOc
— Rasigan@Fan🎙️ (@Rasigan_022) January 9, 2025