Max Review Telugu - 'మ్యాక్స్' రివ్యూ: మ్యాగ్జిమమ్ మాస్ యాక్షన్‌తో అదరగొట్టిన కిచ్చా సుదీప్ - మరి సినిమా హిట్టా? ఫట్టా?
Max Movie Review Telugu: కిచ్చా సుదీప్ హీరోగా నటించిన కొత్త సినిమా 'మ్యాక్స్'. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న కన్నడలో విడుదలైంది. డిసెంబర్ 27న తెలుగు, తమిళ భాషల్లో విడుదల! ఈ సినిమా ఎలా ఉంది?
విజయ్ కార్తికేయ
'కిచ్చా' సుదీప్, సునీల్, ఇళవరసు, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు
Kiccha Sudeep's Max Review In Telugu: 'విక్రాంత్ రోణ' తర్వాత కన్నడ స్టార్ 'కిచ్చా' సుదీప్ పూర్తి స్థాయి హీరోగా నటించిన సినిమా 'మ్యాక్స్'. సుమారు రెండేళ్ల విరామం తర్వాత ఆయన నటించిన సినిమా కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. కన్నడనాట సినిమాకు సూపర్ హిట్ టాక్ లభించింది. మరి, తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలు సినిమాలో ఏమున్నాయి? ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మించిన ఈ సినిమా ఎలా ఉంది? అనేది చూస్తే...
కథ (Max Movie Story): గని భాయ్ (సునీల్) ఇచ్చిన పార్టీ నుంచి డ్రగ్స్ మత్తులో మునిగి తేలిన ఇద్దరు మంత్రుల కుమారులు పార్టీ నుంచి వెళ్లే దారిలో ఓ మహిళ పోలీసుతో అసభ్యంగా ప్రవర్తిస్తారు. తెల్లారితే డ్యూటీలో జాయిన్ కావాల్సిన సీఐ మ్యాక్స్ అలియాస్ అర్జున్ మహాక్షయ్ (సుదీప్) అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపిస్తాడు.
మంత్రుల కుమారులు ఇద్దరి కోసం స్టేషన్ మీదకు రౌడీలు గుంపులు గుంపులుగా వస్తారు. వాళ్ళను మ్యాక్స్ అండ్ టీమ్ ఎలా ఎదుర్కొన్నాడు? సెల్‌లో వేసిన ఇద్దరూ ఎలా మరణించారు? క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసే లేడీ సీఐ రూప (వరలక్ష్మి శరత్ కుమార్) నుంచి మ్యాక్స్ అండ్ టీమ్ ఎదుర్కొన్న ముప్పు ఏమిటి? గని ఏం చేశాడు? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ (Max Movie Review In Telugu): మ్యాక్స్... ఆ టైటిల్‌కు తగ్గట్టు కిచ్చా సుదీప్ హీరోయిజాన్ని, స్టార్‌డమ్‌ను మ్యాగ్జిమమ్ వాడుకోవాలని దర్శకుడు విజయ్ కార్తికేయ ట్రై చేశారు. ఆ ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. యాక్షన్ బేస్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాను ప్రేక్షకులకు అందించారు.
హీరోల ఇమేజ్ నడిచే కథలు కొన్ని ఉంటాయి. హీరోలకు ఇమేజ్ తీసుకు వచ్చే కథలు ఇంకా కొన్ని ఉంటాయి. 'మ్యాక్స్' మొదటి కేటగిరీకి చెందిన కథ. 'కిచ్చా' సుదీప్ (Kiccha Sudeep Max Review)కు ఇప్పుడు కొత్తగా ఇమేజ్ రావాల్సిన అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీలో ఆయన స్టార్ హీరో. ఆయనకు అంటూ ఒక ఇమేజ్ ఉంది. దాన్ని బేస్ చేసుకుని యాక్షన్ ఫిల్మ్ తీశారు దర్శకుడు విజయ్ కార్తికేయ. రాత్రి నుంచి ఉదయం వరకు స్టేషన్ మీదకు వందల మంది రౌడీలు వస్తే... భయపడే స్టాఫ్ అండతో హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అనేది క్లుప్తంగా కథ.
యాక్షన్ సీక్వెన్సులకు అవసరమైన సెటప్ కుదిరింది. ప్రొడక్షన్ డిజైన్ అండ్ మ్యూజిక్ కూడా బావుంది. అజనీష్ లోక్‌నాథ్ పాటల కంటే నేపథ్య సంగీతం ఎక్కువ ఆకట్టుకుంటుంది. కొంత మందికి అది లౌడ్ అనిపించినా సరే... ఆ యాక్షన్ సీన్లలో 'హై' ఇవ్వడానికి అవసరమే. కిచ్చా సుదీప్ ఇమేజ్, అదే విధంగా మాస్ జనాలకు నచ్చే అంశాలను దృష్టిలో పెట్టుకుని యాక్షన్ బ్లాక్స్ డిజైన్ చేశారు. అయితే... ఈ కథలో మెయిన్ మైనస్ ఏమిటంటే? లోకేష్ కనకరాజ్ ఫ్లేవర్ అండ్ కార్తీ 'ఖైదీ' తరహా కాన్సెప్ట్. సినిమాపై 'ఖైదీ' ప్రభావం ఎక్కువ కనబడుతుంది. కథంతా ఒక్క రాత్రిలో, మేజర్ సీన్స్ స్టేషన్‌లో జరుగుతాయి. ఈ కథలో యాక్షన్ వచ్చిన ప్రతిసారీ హై వస్తుంది. కొన్ని సీన్స్ వచ్చినప్పుడు డల్ అవుతుంది. మెయిన్ ట్విస్ట్ రివీల్ చేయడం, ఆ తర్వాత ముగింపు ఇవ్వడంలో ఇంకాస్త గ్రిప్పింగ్‌గా తీస్తే బావుండేది. కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడం ఈ సినిమాకు మరొక మైనస్.
Also Read: బేబీ జాన్ రివ్యూ: కీర్తి సురేష్ ఫస్ట్ హిందీ సినిమా - దళపతి విజయ్ 'తెరి' బాలీవుడ్ రీమేక్ ఎలా ఉందంటే?
కిచ్చా సుదీప్ నటనకు సవాల్ విసిరే క్యారెక్టర్ కాదు మ్యాక్స్. కానీ, ఆయన స్వాగ్ వల్ల క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయింది. యాక్షన్ సీక్వెన్సుల్లో ఆయన మ్యానరిజం అండ్ యాటిట్యూడ్ ఎక్స్‌లెంట్. మాస్ జనాలను బాగా మెప్పిస్తాయి. సునీల్ మరోసారి మాస్ డాన్ రోల్ చేశారు. నెగిటివ్ షేడ్ ఉన్న పోలీస్ పాత్రలో వరలక్ష్మి స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. కథలో కీలకమైన క్యారెక్టర్ చేసిన తమిళ నటుడు ఇళవరసు బ్యాలెన్స్డ్ యాక్టింగ్ చేశారు. మిగతా నటీనటులు ఓకే. ఫిమేల్ పోలీస్ రోల్స్ చేసిన ఇద్దరి నటన కాస్త బోర్డర్ దాటింది.
మాస్ జనాలకు మ్యాగ్జిమమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే సినిమా 'మ్యాక్స్'. కథ, స్క్రీన్ ప్లే వంటి అంశాల గురించి ఆలోచిస్తే స్క్రీన్ మీద యాక్షన్ చేసే మేజిక్ ఎంజాయ్ చేయలేరు. రొటీన్ కమర్షియల్ ఫార్మాటులో సాగినప్పటికీ... యాక్షన్ సీన్స్ కిక్ ఇస్తాయి. ఆ తరహా సినిమాలు కోరుకునే ప్రేక్షకులకు 'మ్యాక్స్' నచ్చుతుంది. ఆ విషయంలో నో డౌట్.
Also Read: 'రైఫిల్ క్లబ్' రివ్యూ: వాణీ విశ్వనాథ్ కీలక పాత్రలో నటించిన మలయాళ సినిమా... ఎందుకంత స్పెషల్?