Rifle Club Review - 'రైఫిల్ క్లబ్' రివ్యూ: మలయాళ సినిమాలో ఏముంది? ఎందుకంత స్పెషల్?
Rifle Club Movie Review: డిసెంబర్ 19న మలయాళంలో 'రైఫిల్ క్లబ్' అనే సినిమా విడుదలైంది. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వాణీ విశ్వనాథ్ ఓ పాత్రలో నటించారు. ఆ సినిమా ఎలా ఉంది? ఏమిటి? అనేది చూస్తే...
ఆసిక్ అబు
దిలీష్ పోతన్, అనురాగ్ కశ్యప్, వాణీ విశ్వనాథ్, దర్శనా రాజేంద్రన్, సురభి లక్ష్మి, హనుమాన్‌కైండ్ తదితరులు
Malayalam movie Rifle Club review in Telugu: సీనియర్ ఎన్టీఆర్ 'సామ్రాట్ అశోక', చిరంజీవి 'ఘరానా మొగుడు' సినిమాల్లో వాణీ విశ్వనాథ్ కథానాయికగా నటించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బోయపాటి శ్రీనుల 'జయ జానకీ నాయక'లో ఓ పాత్ర చేశారు. ఆవిడ నటించిన తాజా మలయాళ సినిమా 'రైఫిల్ క్లబ్'. హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ విలన్ రోల్ చేయగా... దిలీష్ పోతన్, 'హృదయం' ఫేమ్ దర్శనా రాజేంద్రన్, సురభి లక్ష్మి, వినీత్ కుమార్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. డిసెంబర్ 19, 2024న థియేటర్లలో విడుదలైంది. విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. అసలు ఈ సినిమాలో ఏముంది? అనేది చూస్తే...
కథ (Rifle Club Movie Story): దయానంద్ (అనురాగ్ కశ్యప్) గన్ డీలర్. అతడిని ఎదిరించే దమ్ము ధైర్యం మంగుళూరులో ఎవరికీ లేవు. అతని కుమారుడు, బర్త్ డే పార్టీలో డ్యాన్స్ చేయడానికి వచ్చిన అమ్మాయితో తప్పుగా ప్రవర్తిస్తాడు. దాంతో ఆమె బాయ్ ఫ్రెండ్ చేతిలో తన్నులు తింటాడు. చావుబతుకుల మధ్య ఉన్న అతడిని వదిలేసి వాయనాడ్ వచ్చేస్తుంది ఆ జంట.
వాయనాడ్‌లోని రైఫిల్ క్లబ్‌లో ఉన్న హీరో షాజహాన్ (వినీత్ కుమార్)ను సాయం కోరుతుంది ప్రేమ జంట. ఆ జంటను వెతుకుతూ దయానంద్, అతని కొడుకు, వాళ్ళ మనుషులు ఆ క్లబ్ దగ్గరకు చేరుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఆ ప్రేమ జంటను దయానంద్ చంపేశాడా? లేదా వాయనాడ్ రైఫిల్ క్లబ్ సభ్యులు అందరూ కలిసి కాపాడారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
విశ్లేషణ (Rifle Club Review Telugu): రైఫిల్ క్లబ్ సినిమా ప్రత్యేకత ఏమిటంటే... ఈ కథలో, సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరూ లేదు. సమయం సందర్భం వస్తే హీరో / షీరోయిజం చూపించే క్యారెక్టర్లు తప్ప! స్పెషల్ సాంగ్స్ లేవు, సపరేట్ కామెడీ ట్రాక్ లేదు. కానీ... స్టార్టింగ్ టు ఎండింగ్ ఎంటర్‌టైన్ చేస్తుంది. ఎంగేజ్ చేస్తుంది. కళ్లు అప్పగించి స్క్రీన్ వైపు చూసేలా చేస్తుంది.
'రైఫిల్ క్లబ్' కథకు వస్తే... చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. తన కొడుకు చావుకు కారణమైన ప్రేమ జంటను చంపాలని వచ్చిన విలన్ గ్యాంగ్, కౌంటర్ ఎటాక్ ఇచ్చే రైఫిల్ క్లబ్ సభ్యులు - క్లుప్తంగా ఇదీ కథ! కానీ, ఈ కథతో తీసిన సినిమా గురించి చెప్పుకోవడానికి చాలా ఉంది. రచయితలు శ్యామ్ పుష్కరన్, దిలీష్ కరుణాకరణ్, సుహాస్ ఫెంటాస్టిక్ వర్క్ చేశారు. క్యారెక్టర్లు క్రియేట్ చేయడం దగ్గర్నుంచి ఆయా పాత్రలకు రాసిన డైలాగ్స్ వరకు - ప్రతి సన్నివేశం కోసం ఎంతో వర్క్ చేశారు.
'రైఫిల్ క్లబ్' కథ ఒక్క రోజులో జరుగుతుంది. అలాగని క్యారెక్టర్స్ పరిచయం చేయడానికి ఎక్కువ రోజుల సమయం తీసుకోలేదు. సన్నివేశాలతో పాటు పాత్రలను పరిచయం చేశారు. ఆ సీన్స్ మధ్యలో అంతర్లీనంగా సందేశం ఇచ్చారు. మెజారిటీ కథ రీఫిల్ క్లబ్‌లో జరిగినప్పటికీ... ఆ ఫీల్ రాకుండా లైవ్లీగా సినిమా ముందుకు వెళ్లిందంటే మధ్య మధ్యలో వేసిన జోక్స్ కారణం అని చెప్పాలి. వన్ లైనర్ పంచ్ డైలాగ్స్ పేలాయి.
నటి వాణీ విశ్వనాథ్ డివోర్సీగా కనిపిస్తారు. ఆమె భర్త కూడా ఆ రైఫిల్ క్లబ్ మెంబరే. ప్రేమ జంటను కాపాడే సమయంలో 'నువ్వు బెటర్ వైఫ్ కాకపోవచ్చు. కానీ, బెస్ట్ షూటర్' అంటూ కాంప్లిమెంట్ ఇస్తాడు. అందులో పర్సనల్ లైఫ్ ఎటాక్ ఉంది. ఆమె టాలెంట్ గురించి గొప్పగా చెప్పడమూ ఉంది. దయానంద్ (అనురాగ్ కశ్యప్) తనయుడి పాత్రలో నటించిన ఇండియన్ సింగర్ అండ్ ర్యాపర్ Hanumankind క్లబ్‌లోకి ఎంటరైనప్పుడు వాణీ విశ్వనాథ్ ఎదురు అవుతారు. 'ఎవరైనా మగాడిని పిలువు' అన్నట్టు అడుగుతాడు. అప్పుడు ఆమె ఇగో హర్ట్ అవుతుంది. గన్ ఒక ప్లేసులో పెట్టి సమాధానం ఇస్తుంది. విజిల్ వర్తీ మూమెంట్ అది.
Also Read: 'యూఐ' రివ్యూ: ఇండియన్ పాలిటిక్స్‌పై ఉపేంద్ర సెటైర్... కామన్ ఆడియన్‌కు అర్థం అవుతుందా?
'రైఫిల్ క్లబ్' ఎంటర్‌టైనింగ్‌గా, ఎంగేజింగ్‌గా, థ్రిల్ ఇస్తూ ఇవ్వడానికి మెయిన్ రీజన్ డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్ ఆషిక్ అబు. యాక్షన్ ఎపిసోడ్స్ పిక్చరైజ్ చేసిన తీరు గానీ, వాటి మధ్యలో రిలీఫ్ ఇవ్వడానికి తీసిన కొన్ని ఏరియల్ షాట్స్ గానీ సింప్లీ సూపర్బ్. ఎక్కువ శాతం ఒకే లొకేషన్‌లో తీసినా ఆ డిఫరెన్స్ తెలియకుండా సినిమా తీశారు. వయలెన్స్‌లోనూ సెన్సిటీవిటీ చూపించారు. రెట్రో సాంగ్స్ కూడా భలే తీశారు. అయితే... బ్రదర్ హుడ్, కొన్ని సీన్స్ ఇంకా బాగా తీస్తే బావుండేదని అనిపిస్తుంది. సినిమాలో హీరోగా నటించిన క్యారెక్టర్ అంతగా వర్కవుట్ కాలేదు.
దయానంద్ పాత్రలో అనురాగ్ కశ్యప్ చూపించిన విలనిజం మామూలుగా లేవు. ఈ మధ్య ఆయన కొన్ని సినిమాల్లో ఆయన విలన్ రోల్స్ చేశారు. కానీ, ఇందులో కొత్తగా కనిపించారు. వాణీ విశ్వనాథ్ నటన వల్ల ఆ పాత్రకు పవర్ వచ్చింది. ఆవిడ బాగా చేశారు. దిలీష్ పోతన్ (Dileesh Pothan)కు నవ్వించే అవకాశంతో పాటు సీరియస్ / ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆయన వంద శాతం న్యాయం చేశారు. దర్శనా రాజేంద్రన్, సురభి లక్ష్మి సహా మిగతా నటీనటులు అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
కమర్షియల్ సినిమాలు చూసి చూసి మధ్యలో ఒక కొత్త తరహా సినిమా చూడాలని కోరుకునే ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటుందీ 'రైఫిల్ క్లబ్'. కమర్షియల్ సినిమా అభిమానుల్ని సైతం మెప్పిస్తుంది. 'రైఫిల్ క్లబ్'లో ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్ / స్టైలిష్ వయలెన్స్ ఉన్నాయి. ప్రేక్షకులకు రెండు గంటలు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. డోంట్ మిస్ ఇట్. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా కలిసి ఉంటే కలదు సుఖం అనే సందేశాన్ని ఇస్తుంది.
Also Read: 'బచ్చల మల్లి' రివ్యూ: హీరోకి యూనిక్ క్యారెక్టర్ ఒక్కటే చాలా... సినిమాకు కథ, ఎమోషన్స్ అవసరం లేదా?