Prayagraj Mahakumbh 2025 : రూ.5కే మహా కుంభమేళా చరిత్ర..ప్రయాగ్ రాజ్ లో ఏర్పాట్లు మొత్తం టెక్నాలజీ మయం!
Mahakumbh 2025 : నూతన సంవత్సరం 2025 జనవరిలో ప్రారంభమయ్యే మహాకుంభమేళాకోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయ్. దీనికి సంబంధించిన కొన్ని అప్ డేట్స్ మీకోసం..
Maha Kumbh Mela 2025: కొత్తఏడాదిలో జనవరి 13 భోగి నుంచి ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా జరగనుంది. 12 ఏళ్లకోసారి జరిగే మహా కుంభమేళాకు భారీ ఏర్పాట్లు చేస్తోంది అక్కడి ప్రభుత్వం.
Also Read: 2025 భోగి నుంచి మహాశివరాత్రి వరకూ మహా కుంభమేళా - అది పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో రాజ స్నానం తేదీలివే!
అణువణువు టెక్నాలజీ మయం
ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో పరిశుభ్రత కోసం అధునాతన పరికరాలను ఉపయోగించనున్నారు. దేశ వివిదేశాల నుంచి ప్రయాగరాజ్ మహా కుంభమేళాకు వచ్చే భక్తులు, పర్యాటకులకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించేందుకు అధునాతన పరిశుభ్రతా పరికరాలను ఉపయోగించనున్నారు. ఇందుకోసం ప్రయాగరాజ్ మేళా అథారిటీ సన్నాహాలు పూర్తి చేసింది. మేళా ప్రారంభానికి ముందే ఈ అధునాతన పరికరాలను తీసుకొచ్చేస్తున్నారు. ఈ పరికరాల కోసం 45 లక్షల నుంచి 50 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా. ప్రయాగరాజ్ మేళా అథారిటీ ఈ మొత్తం ఖర్చును భరిస్తుంది.
Also Read: మహా కుంభమేళా కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు .. ఉచిత రైలు ప్రయాణం నిజమా!
భక్తులకు మెరుగైన సౌకర్యాలు
దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు, భక్తులు మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఘాట్ లు సిద్ధం చేస్తున్నారు. కుంభమేళా ప్రాంతంలో స్నానపు ఘాట్‌లు, రోడ్లు, ఫుట్ పాత్ లు సహా వివిధ ప్రదేశాలు శుభ్రపరచేందుకు కాంపాక్ట్ మాన్యువల్ స్వీపింగ్ మెషీన్‌ను ఉపయోగించనున్నారు. ఇవి కరెంట్ అవసరం లేకుండా పనిచేస్తాయి. మాన్యువల్ గా నడిపే ఈ మిషన్ వల్ల ధుమ్ము, ధూళి లేకుండా పరిశుభ్రంగా ఉంటుంది. బ్యాటరీతో నడిచే వాక్యూమ్ టైప్ లిట్టర్ పికర్ ను తీసుకొస్తున్నారు. కుంభమేళాలో మూల మూలన పరిశుభ్రంగా ఉంచేందుకు ఇది సహకరిస్తుంది. మాన్యువల్ గా శ్రమ పడకుండా క్లీన్ చేసేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుంది.
AI తో పటిష్ఠ నిఘా
ఉత్తర ప్రదేశ్ లో గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమస్థలంలో జరిగే మహా కుంభమేళా వేడుక కోసం ప్రభుత్వం భద్రత కోసం ఏకంగా 40 వేల మందికి పైగా పోలీసులను భద్రతకోసం ఉపయోగించనుంది. మరోవైపు AIతో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసి, డ్రోన్ల ద్వారా అనుక్షణం పర్యవేక్షణ చేపట్టనున్నట్లు తెలిపింది.
Also Read: 108 వైష్ణవ క్షేత్రాల్లో మొదటిది.. దేశంలోనే అతి పెద్ద ఆలయం ..ధనుర్మాసంలో దర్శించుకుంటే జన్మ ధన్యం!
రూ.5 కే మహాకుంభమేళా చరిత్ర
కుంభమేళా చరిత్ర అందరకీ తెలియజేసేలా గీతా ప్రెస్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 2 కోట్ల రూపాయల వ్యయంతో మహా కుంభమేళాలో శిబిరం ఏర్పాటు చేసి..ఇందులో కుంభమేళా గురించి పూర్తివివరాలతో అన్ని భాషల్లో బుక్ లెట్స్ అందుబాటులో ఉంచేందుకు ప్లాన్ చేస్తోంది. మహాకుంభ పర్వ్ అనే పేరుతో ప్రత్యేక బుక్‌లెట్ ప్రచురించనుంది. మహాకుంభం, అర్ధ కుంభం, కుంభమేళా ప్రాముఖ్యతపై అన్ని భాషల్లో బుక్ లెట్స్ ప్రచురించి అందుబాటులో ఉంచనుంది. దీని ధర కేవలం 5 రూపాయలు మాత్రమే. ఈ బుక్ లెట్ కొనుక్కుంటే చాలు భక్తులకు కుంభమేళా గురించి మొత్తం సమాచారం చేతిలో ఉన్నట్టే.